Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips!

Posted on 17/10/2025 By admin No Comments on బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips!

బంగారం ధ‌ర నింగినంటుతోంది.. రోజురోజుకూ ఎగ‌బాకుతుంది. భ‌విష్య‌త్‌లో దీని ధ‌ర మ‌రింత పెరుగుతుంద‌ని భావించి ఇప్పుడే బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా? లేదా గోల్డ్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ రోజుల్లో బంగారం కొనడం అంటే కేవలం ఆభరణాలే కాదు. లాభదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశం. ఏదేమైనా డిజిటల్‌ రూపాల్లో పెట్టుబడి పెట్టడం సురక్షితం, లాభదాయకం. చిన్న మొత్తాలతో ప్రారంభించి, మార్కెట్‌ పరిస్థితులు అంచనా వేసుకుంటూ దశలవారీగా ఇన్వెస్ట్‌ చేస్తే బంగారం పెట్టుబడి ఫలిస్తుంది.

ఆభరణాల కంటే ఇన్వెస్ట్‌మెంట్‌ గోల్డ్‌ మంచిది
Investment Gold Is Better Than Jewelry

చాలామంది ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తారు. కానీ దానిపై మేకింగ్‌ చార్జీలు, వడ్డీ , జీఎస్‌టీ వంటి వ్యయాలు ఉంటాయి. అమ్మేటప్పుడు కూడా మేకింగ్‌ చార్జీలు, జీఎస్టీ తిరిగి రావు. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ గోల్డ్ (బంగారు బిస్కెట్లు, నాణేలు) కొనడం లాభదాయకం.

గోల్డ్‌ ETFలు – తక్కువ రిస్క్‌తో లాభదాయకం
Gold ETFs – Profitable with Lower Risk

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడయ్యే గోల్డ్‌ ETFలు (Exchange Traded Funds) మంచి ఆప్షన్‌. వీటిలో మీరు చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టొచ్చు. భౌతిక బంగారం లాగా సేఫ్‌గా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. బంగారం ధర పెరిగితే ETF విలువ కూడా పెరుగుతుంది. ఇది స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో ట్రేడయ్యే మ్యూచువల్‌ ఫండ్‌. బంగారం ధరల ఆధారంగా నడిచే ఒక ఫండ్‌. ఇది స్టాక్‌ల మాదిరిగానే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (NSE/BSE) లో కొనుగోలు, విక్రయం చేయవచ్చు. ఇది పూర్తిగా 24 క్యారెట్‌ బంగారం ధరలతో అనుసంధానమై ఉంటుంది. అంటే మీరు గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడితే, నిజంగా బంగారం కొన్నట్టే కానీ అది డీమ్యాట్‌ అకౌంట్‌లో డిజిటల్‌గా ఉంటుంది. డీమ్యాట్‌ అకౌంట్‌ & ట్రేడింగ్‌ అకౌంట్‌ ఉండాలి. మీ బ్రోకరేజ్‌ యాప్‌ ద్వారా “Gold ETF” అని సర్చ్ చేయాలి. SBI Gold ETF, Nippon India Gold ETF, HDFC Gold ETF వంటి ప్రముఖ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్‌ల మాదిరిగానే మార్కెట్‌ ధరకు కొనుగోలు/అమ్మకం చేయవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ విలువ బంగారం మార్కెట్‌ ధరల ఆధారంగా మారుతుంది. అంటే బంగారం ధర పెరిగితే ETF విలువ కూడా పెరుగుతుంది. సగటున దీర్ఘకాలంలో 8–10% రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్‌ల కంటే మేనేజ్‌మెంట్‌ ఖర్చులు తక్కువగా ఉంటాయి. కాగా ఇందులో దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డి పెట్టాలి. ఎక్స్‌పెన్స్‌ రేషియో (ఫండ్‌ నిర్వహణ ఫీజు) కూడా గమనించాలి.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు ..Sovereign Gold Bonds

భారత ప్రభుత్వం తరఫున RBI జారీ చేసే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (SGBs) పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్‌ ఇస్తాయి. బంగారం ధరల పెరుగుదలతో పాటు ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాదు, ఇది క్యాపిటల్‌ గైన్స్‌ పన్ను నుంచి మినహాయింపు పొందుతుంది. ఇది పూర్తిగా భద్రత కలిగిన ఇన్వెస్ట్‌మెంట్‌. దొంగతనం, నిల్వ సమస్యలు ఉండవు. బాండ్ల విలువ బంగారం మార్కెట్‌ రేటుతో నేరుగా అనుసంధానం అయి ఉంటుంది. అంటే బంగారం ధర పెరిగితే బాండ్‌ విలువ కూడా పెరుగుతుంది. అందువల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ అకౌంట్‌లో జమ చేస్తారు. అంటే బంగారం రేటు పెరుగుదలతో పాటు వడ్డీ లాభం కూడా! సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు మ్యాచ్యూరిటీ తర్వాత (8 ఏళ్లకు) రిడీమ్‌ చేసుకుంటే, దానిపై వచ్చే లాభానికి క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది సాధారణ బంగారం లేదా ETFలతో పోలిస్తే పెద్ద ప్రయోజనం. ఇన్వెస్టర్‌ ఒక్క గ్రాము బంగారం విలువతోనే ప్రారంభించవచ్చు. దీన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా కొనవచ్చు. సావరిన్‌ బాండ్లకు లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే రిడీమ్‌ చేయవచ్చు. అలాగే ఇది మార్కెట్‌ రేటుపై ఆధారపడినందున, తాత్కాలికంగా ధరలు పడిపోతే లాభాలు తగ్గొచ్చు. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మాత్రమే ఇది అనుకూలం.

సెకండ‌రీ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవచ్చా?
Can It Be Purchased in the Secondary Market?

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (Sovereign Gold Bond – SGB)ను RBI విడుదల చేసే స‌మ‌యంలోనే కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ స‌మ‌యం మిస్‌ అయితే? కొత్త విడుదల వరకు వేచి చూడ‌న‌వ‌సరం లేదు. సెకండరీ మార్కెట్‌ (Stock Market) లో కూడా వాటిని కొనుగోలు చేయొచ్చు. సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల (NSE, BSE) లో ట్రేడవుతాయి. అంటే వాటిని సెకండరీ మార్కెట్‌ లోనూ కొనుగోలు చేయవచ్చు. ఒకసారి RBI బాండ్‌ విడుదలైన తర్వాత, దాన్ని కొన్న ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌లో విక్రయానికి ఉంచుతారు. అక్కడి నుంచే కొత్త ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు. సెకండరీ మార్కెట్‌లో బాండ్‌ ధరలు డిమాండ్‌, బంగారం ధరలు, వడ్డీ రేట్లు వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం ధర కంటే తక్కువ రేటుకు బాండ్‌ దొరకొచ్చు. అది ఇన్వెస్టర్లకు మంచి అవకాశం. సెకండరీ మార్కెట్‌లో కొనేటప్పుడు బాండ్‌ ISIN నంబర్‌, సిరీస్‌ పేరు, మ్యాచ్యూరిటీ తేదీ వంటి వివరాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రేడింగ్‌ అకౌంట్‌ (Demat Account) అవసరం ఉంటుంది. కొనుగోలు ముందుగా ప్రస్తుత మార్కెట్‌ ధరను తప్పక పరిశీలించాలి.

డిజిటల్‌ గోల్డ్‌ – ఆధునిక పద్ధతి.. Digital Gold – The Modern Way

ఈ మధ్యకాలంలో ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌ పే వంటి యాప్స్‌ ద్వారా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేయొచ్చు. ఒక్క రూపాయితో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే భద్రత, పారదర్శకత, సులభ లిక్విడిటీ.

గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఆప్షన్‌
Gold Mutual Funds Are Also an Option

గోల్డ్‌ ETFలలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. వీటిని బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలు ఆఫర్‌ చేస్తాయి. మార్కెట్‌ పరిజ్ఞానం లేని వారికి ఇవి సులభమైన మార్గం. బంగారం ధరలు తాత్కాలికంగా మారినా, దీర్ఘకాలికంగా ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి 5–10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేవారికి బంగారం మంచి రిటర్న్స్‌ ఇస్తుందని ఫైనాన్షియల్‌ నిపుణులు చెబుతున్నారు. మీ పెట్టుబడిని మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు సేకరించి, బంగారం ధరల ఆధారంగా ట్రేడయ్యే గోల్డ్‌ ETFలు లో పెడ‌తారు. అంటే, మీరు డైరెక్ట్‌గా బంగారం కొన‌కుండా లాభాలను పొందుతారు. మీకు మ్యూచువల్‌ ఫండ్‌ అకౌంట్‌ ఉండాలి (CAMs లేదా AMCs ద్వారా). SIP (Systematic Investment Plan) లేదా lumpsum రూపంలో పెట్టుబడి చేయవచ్చు. గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు గోల్డ్‌ ETFల ద్వారా బంగారం మార్కెట్‌ ధరలతో నేరుగా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి బంగారం ధర పెరిగితే, ఫండ్‌ NAV కూడా పెరుగుతుంది. బంగారం ఇన్వెస్ట్‌మెంట్‌లో స్మార్ట్‌, సురక్షిత మార్గం కావాలంటే. గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్ సరైన ఎంపిక. చిన్న SIPలతో ప్రారంభించి, దీర్ఘకాలిక పెట్టుబడి కొనసాగిస్తే, రాబడులు బంగారం లా ఉంటాయి .ఇందులో భద్రత కూడా ఎక్కువ.

గోల్డ్ కార్పొరేట్‌ బాండ్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
How to Invest in Gold Corporate Bonds?

కంపెనీలు లేదా కార్పొరేట్‌ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కోసం ప్రజల నుండి నిధులు సమీకరించడానికి జారీ చేసే బాండ్‌లు ఇవి. ఈ బాండ్‌ల విలువ బంగారం ధరల ఆధారంగా ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెడితే, బంగారం ధర పెరిగినంత మేరా లాభం వస్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్‌లలో (NSE, BSE), బ్రోకరేజ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లలో వాటిని కొనుగోలు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ఇష్యూ రూపంలో కంపెనీలు వాటిని జారీ చేస్తాయి. డీమ్యాట్‌ అకౌంట్ , ట్రేడింగ్‌ అకౌంట్‌ అవసరం. బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫారమ్‌లో “Corporate Bonds” సెక్షన్‌ ద్వారా ఫండ్‌లు చూడాలి. కంపెనీ పేరు, బాండ్ రకం, వడ్డీ రేటు, కాల వ్యవధి పరిశీలించి కొనుగోలు చేయాలి . 8%–10% (కంపెనీ స్థాయి, క్రెడిట్ రేటింగ్, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి) వ‌ర‌కు వ‌డ్డీ వ‌స్తుంది. మ్యాచ్యూరిటీ వరకు రాబడి స్థిరంగా లభిస్తుంది . ఇందులో రాబడి అంటే అధిక రిస్క్ అని గుర్తుంచుకోవాలి . కంపెనీ క్రెడిట్ రేటింగ్ చెక్ చేయాలి (AAA, AA+). బాండ్ మ్యాచ్యూరిటీ పీరియడ్ తెలుసుకోవాలి. అవసరమైతే సెకండరీ మార్కెట్‌లో విక్రయం చేయడం సాధ్యం. వడ్డీపై ట్యాక్స్‌ ఉంటుంది. FDల మాదిరే పన్ను విధానం ఉంటుంది. ఏదేమైనా బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి వ‌స్తుంది. నిర్దిష్ట కాలంలో వడ్డీ చెల్లింపులు ఉంటాయి. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు ఇది ఉపయోగకరం.

 

252
FINICAL PLANNING Tags:Can It Be Purchased in the Secondary Market?, Digital Gold – The Modern Way, Gold ETFs – Profitable with Lower Risk, Gold Mutual Funds Are Also an Option, How to Invest in Gold Corporate Bonds?, Investment Gold Is Better Than Jewelry, Sovereign Gold Bonds

Post navigation

Previous Post: పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
Next Post: సిల్వర్‌ ETFల‌పై షాకింగ్ న్యూస్‌.. వాటిని ఆపేసిన‌ మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీలు Shocking News on Silver ETFs: Mutual Fund Companies That Have Discontinued Them

Related Posts

  • ఇదీ డిజిటల్‌ లోన్ల అసలు కథ‌! The Real Story Behind Digital Loans! FEATURE NEWS
  • వ్యక్తిగత రుణం Vs క్రెడిట్ కార్డు లోన్‌.. ఈ రెండింటిలో ఏది మంచిది? Personal Loan vs Credit Card Loan .. Which One Is Better? FINICAL PLANNING
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • 15*15*15 రూల్‌తో రూల్‌తో ఆర్థిక స్వేచ్ఛ how to get financial freedom with 15*15*15*  law FINICAL PLANNING
  • 60 ఏళ్ళ వారికి నెల నెలా ఆదాయం.. FINICAL PLANNING
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.20 వేలు.. Retirement Income Plan – Safe, Steady and Stress-Free FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • దేశంలో కొన్ని రంగాల్లో భారీ వేతనాలు.. నైపుణ్యం ఉన్నవారికి కోట్లలో ప్యాకేజీలు! Huge Salaries in Some Sectors in India.. Companies Offering Crore Packages for Skilled Professionals! FEATURE NEWS
  • రూ.3,32,205 కోట్ల తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బడ్జెట్ .. అభివృద్ధి–సంక్షేమాలకు సమ ప్రాధాన్యం! Andhra Pradesh Budget of ₹3,32,205 Crore: Equal Priority to Development and Welfare FEATURE NEWS
  • మోడల్ టెనెన్సీ చట్టంతో అద్దె ఇంటికి కొత్త రూల్స్.. New Rental House Rules ..Under the Model Tenancy Act FEATURE NEWS
  • పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్ర‌భుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger? FEATURE NEWS
  • ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies FEATURE NEWS
  • సూక్ష్మ రుణాలు తగ్గుముఖం..!16.8 శాతం క్షీణత‌! Micro Loans Decline…! A Sharp 16.8% Drop FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • సోలార్ ఉత్పత్తుల దిగుమ‌తుల‌పై126 శాతం డ్యూటీ..! ట్రంప్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం! 126% Duty on Solar Imports! Trump Administration Takes a Key Decision FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme