లోన్ కోసం బ్యాంకు తలుపు తట్టే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే. “మీ స్కోరు ఎంత?” ఆ ప్రశ్న విన్న వెంటనే చాలామందికి మనసులో అనేక సందేహాలు మొదలవుతాయి. అది క్రెడిట్ స్కోరా? లేదా సిబిల్ స్కోరా? (Credit Score vs CIBIL Score) రెండూ ఒకటే కదా? సాధారణంగా చాలా మంది ఈ రెండింటినీ ఒకటేనని భావిస్తుంటారు. కానీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి లోతుగా వెళ్తే, క్రెడిట్ స్కోరు – సిబిల్ స్కోరు మధ్య ఉన్న తేడా చిన్నదైనా ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఆ తేడాను అర్థం చేసుకోకపోతే, లోన్ దరఖాస్తు తిరస్కరణ నుంచి ఎక్కువ వడ్డీ భారం వరకూ అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఈ రెండింటి మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలుసుకోవడం ప్రతి రుణగ్రహీతకు అవసరం.
బ్యాంకుల భాషలో ‘స్కోరు’ అంటే ఏమిటి? What Does “Score” Mean in Banking Terms?
క్రెడిట్ స్కోరు (Credit Score vs CIBIL Score) అనేది ఒక సంఖ్య మాత్రమే కాదు. అది మీ ఆర్థిక జీవితం మీద బ్యాంకులు వేసే ముద్ర. మీరు ఇప్పటి వరకూ ఎలా అప్పులు తీసుకున్నారు, వాటిని ఎంత క్రమశిక్షణతో తీర్చారు, ఎక్కడైనా ఆలస్యం చేశారా, ఎప్పుడైనా చెల్లింపులు ఆపేశారా అన్న విషయాలన్నీ ఒకే సంఖ్యలో ప్రతిబింబిస్తాయి. సాధారణంగా ఈ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. స్కోరు ఎక్కువగా ఉంటే మీరు నమ్మదగిన కస్టమర్‌గా పరిగణింపబడతారు. స్కోరు తగ్గితే బ్యాంకుల అనుమానం పెరుగుతుంది. బ్యాంకులకు ఇది ఒక రిపోర్ట్ కార్డు లాంటిది. విద్యార్థి మార్కులు చూసి అతడి ప్రతిభ అంచనా వేసినట్టే, మీ స్కోరు చూసి మీరు లోన్‌కు అర్హులా కాదా అన్నది నిర్ణయిస్తారు. అందుకే బ్యాంకు కౌంటర్ దగ్గర నిల్చున్నప్పుడు మీ ఆదాయం కన్నా ముందుగా మీ స్కోరే మాట్లాడుతుంది.
ఈ స్కోరు ఎవరు లెక్కిస్తారు? Who Calculates This Score?
మీ స్కోరు (Credit Score vs CIBIL Score) ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకులే లెక్కిస్తాయా? కాదు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. వీటినే క్రెడిట్ బ్యూరోలు అంటారు. ఇవి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి మీ రుణాల సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి స్కోర్లుగా మారుస్తాయి. భారత్‌లో ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరోలు పనిచేస్తున్నాయి. వాటిలో అత్యంత పురాతనమైనది, ఎక్కువగా వినిపించే పేరు TransUnion CIBIL. ఇదే కాకుండా Experian, Equifax, CRIF High Mark కూడా క్రెడిట్ స్కోర్లు ఇస్తున్నాయి. ఈ నాలుగు సంస్థలూ ఒకే సమాచారాన్ని సేకరించినా, స్కోరు లెక్కించే విధానం ఒక్కో దానికి ఒక్కోలా ఉంటుంది. అందుకే ఒకే వ్యక్తికి సిబిల్ స్కోరు ఒకలా, ఎక్స్‌పీరియన్ స్కోరు మరోలా ఉండే అవకాశం ఉంది.
ఈ స్కోరు ఎలా తయారవుతుంది? How Is This Score Calculated?
మీ స్కోరు (Credit Score vs CIBIL Score) ఒక్కరోజులో తయారవదు. ఇది మీ సంవత్సరాల ఆర్థిక ప్రయాణం సారాంశం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ విషయాలను పరిశీలిస్తాయి . మీరు తీసుకున్న లోన్లు , వాటిని సమయానికి చెల్లించారా? క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యమయ్యాయా? ఎంతవరకు కార్డు లిమిట్ వాడుతున్నారు? ఒకేసారి ఎన్ని లోన్లకు అప్లై చేస్తున్నారు? ఈ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలు సేకరించి… ఒక స్కోరుగా మలుస్తాయి.
సిబిల్ స్కోరు అంటే అసలు ఏమిటి? What Exactly Is a CIBIL Score?
సిబిల్ స్కోరు (Credit Score vs CIBIL Score) అనేది వేరే రకం స్కోరు కాదు. TransUnion CIBIL అనే క్రెడిట్ బ్యూరో ఇచ్చే క్రెడిట్ స్కోరుకే సిబిల్ స్కోరు అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ సంస్థను కేవలం ‘CIBIL’ అని పిలిచేవారు. తర్వాత అంతర్జాతీయ సంస్థ ట్రాన్స్‌యూనియన్ ఇందులో భాగస్వామ్యం కావడంతో TransUnion CIBILగా మారింది. భారత్‌లో క్రెడిట్ బ్యూరోలలో ఇది అత్యంత పాతది. బ్యాంకులతో దీర్ఘకాల అనుబంధం ఉండటంతో, చాలా బ్యాంకులు లోన్ మంజూరు చేసే ముందు సిబిల్ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటాయి. అందుకే “మీ సిబిల్ స్కోరు ఎంత?” అన్న ప్రశ్న బ్యాంకుల్లో సాధారణంగా వినిపిస్తుంది. ఇక్కడే చాలామందికి గందరగోళం. క్రెడిట్ స్కోరు, సిబిల్ స్కోరు రెండూ ఒకటేనని అనుకుంటారు. కానీ సాంకేతికంగా చెప్పాలంటే, సిబిల్ స్కోరు అనేది క్రెడిట్ స్కోరులో ఒక భాగం మాత్రమే. అంటే అన్ని సిబిల్ స్కోర్లు క్రెడిట్ స్కోర్లే. కానీ అన్ని క్రెడిట్ స్కోర్లు సిబిల్ స్కోర్లు కావు. సిబిల్ రిపోర్ట్‌లో కేవలం స్కోరు మాత్రమే ఉండదు. అది మీ పూర్తి ఆర్థిక బయోడేటా. మీ పేరు, చిరునామా, పాన్ వివరాలు, ఇప్పటి వరకు తీసుకున్న అన్ని లోన్లు, క్రెడిట్ కార్డుల వివరాలు, నెలవారీ చెల్లింపుల రికార్డు, ఏదైనా డిఫాల్ట్ జరిగిందా?, ఎన్ని సార్లు లోన్ కోసం ప్రయత్నించారు?, బ్యాంకులు లోన్ ఇవ్వాలా వద్దా అనేది… ఈ రిపోర్ట్ చూసే నిర్ణయిస్తాయి.
సిబిల్‌కు ఇంత ప్రాధాన్యత ఎందుకు? Why Is CIBIL Given So Much Importance?
మన దేశంలో క్రెడిట్ బ్యూరోలు (Credit Score vs CIBIL Score) నాలుగు ఉన్నా… బ్యాంకులు ఎక్కువగా నమ్మేది మాత్రం సిబిల్ స్కోరునే. దానికి కారణాలు సిబిల్ అత్యంత పాత క్రెడిట్ బ్యూరో. బ్యాంకులతో దీర్ఘకాల అనుబంధం, డేటా విస్తృతి ఎక్కువ. లోన్ నిర్ణయాల్లో సులభత . అందుకే చాలామంది బ్యాంకులు “CIBIL Score 750 పైగా ఉండాలి” అనే నిబంధన పెడతాయి.
క్రెడిట్ స్కోరు – సిబిల్ స్కోరు మధ్య అసలు తేడా.. The Real Difference Between Credit Score and CIBIL Score
క్రెడిట్ స్కోరు (Credit Score vs CIBIL Score) అనేది ఒక సాధారణ పదం. ఒక వ్యక్తి అప్పు తీర్చే సామర్థ్యాన్ని తెలియజేసే రేటింగ్. ఈ స్కోరును ఏ క్రెడిట్ బ్యూరో అయినా తన విధానాల ప్రకారం లెక్కించవచ్చు. Experian, Equifax, CRIF High Mark లాంటి సంస్థలు కూడా క్రెడిట్ స్కోర్లను జారీ చేస్తాయి. కానీ సిబిల్ స్కోరు మాత్రం కేవలం TransUnion CIBIL మాత్రమే ఇచ్చే రేటింగ్. ఈ ఒక్క కారణమే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. అంతర్జాతీయంగా వివిధ ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును ఒక సాధారణ ప్రమాణంగా చూస్తాయి. కానీ భారత్‌లో మాత్రం సిబిల్ స్కోరుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
సిబిల్ రిపోర్ట్‌లో ఏముంటుంది? What Does a CIBIL Report Contain?
సిబిల్ స్కోరు (Credit Score vs CIBIL Score) అంటే కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. దాని వెనుక ఉన్నది సిబిల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్‌లో మీ పూర్తి ఆర్థిక చరిత్ర నమోదు అయి ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాల నుంచి మొదలుకుని, ఇప్పటి వరకూ మీరు తీసుకున్న అన్ని లోన్లు, క్రెడిట్ కార్డులు, వాటి చెల్లింపుల రికార్డు, ఎక్కడైనా ఆలస్యం జరిగిందా లేదా డిఫాల్ట్ అయ్యిందా అన్న సమాచారం అంతా ఇందులో ఉంటుంది. బ్యాంకు అధికారి మీ లోన్ దరఖాస్తును పరిశీలించేప్పుడు ముందుగా చూసేది ఈ రిపోర్ట్‌నే. స్కోరు ఒక సంక్షిప్త సూచిక అయితే, రిపోర్ట్ పూర్తి కథ.
750 మార్క్ ఎందుకు మాయ సంఖ్యగా మారింది? Why Has 750 Become a “Magic Number”?
సాధారణంగా బ్యాంకులు 750 కంటే ఎక్కువ స్కోరు (Credit Score vs CIBIL Score)ఉన్నవారిని భద్రమైన రుణగ్రహీతలుగా భావిస్తాయి. ఈ స్థాయిలో స్కోరు ఉంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. స్కోరు తగ్గిన కొద్దీ వడ్డీ పెరుగుతుంది. మరీ తక్కువగా ఉంటే లోన్ తిరస్కరణ ఎదురవుతుంది. అందుకే ఆర్థిక నిపుణులు చెప్పేది ఒక్కటే – “మీ ఆదాయం ఎంత ఉన్నా, మీ స్కోరు బాగోలేకపోతే ప్రయోజనం ఉండదు.”
750 మార్క్ ఎందుకు కీలకం? Why Is the 750 Score So Important?
సాధారణంగా 750 పైగా స్కోరు → మంచి రుణ అవకాశాలు
700–749 → రుణం దొరకొచ్చు, కానీ షరతులు కఠినం
650–699 → అధిక వడ్డీ లేదా గ్యారంటీ అవసరం
650 కంటే తక్కువ → లోన్ తిరస్కరణ అవకాశం ఎక్కువ
భారత్‌లో ఎందుకు సిబిల్‌కే ఎక్కువ విలువ? Why Is CIBIL Given More Importance in India?
అంతర్జాతీయంగా క్రెడిట్ స్కోరు (Credit Score vs CIBIL Score)అనే భావన ఒకటే అయినా, భారత్‌లో మాత్రం సిబిల్ స్కోరు ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. దానికి కారణం బ్యాంకింగ్ వ్యవస్థతో ఉన్న దీర్ఘకాల అనుబంధం. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ రుణ విధానాలను సిబిల్ రేటింగ్ ఆధారంగానే రూపొందించుకున్నాయి. అందుకే క్రెడిట్ బ్యూరోలు ఎన్నో ఉన్నా, సిబిల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.
మీ స్కోరు పెరగాలంటే… How to Improve Your Credit Score
మీ స్కోరు (Credit Score vs CIBIL Score) పెరగడం అనేది ఒక్కరోజులో జరిగే పని కాదు. అది మీ ఆర్థిక అలవాట్ల ప్రతిబింబం. ప్రతి నెలా ఈఎంఐలు సమయానికి చెల్లించడం, క్రెడిట్ కార్డు బిల్లులను నిర్లక్ష్యం చేయకపోవడం, అవసరం లేకుండా పదే పదే లోన్‌కు అప్లై చేయకపోవడం, లిమిట్‌కు మించి కార్డులు వాడకపోవడం… ఇవన్నీ కలిసి మీ స్కోరును క్రమంగా మెరుగుపరుస్తాయి. అదే విధంగా చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఒకసారి బిల్లు మిస్ అయితే, అది రికార్డులో మచ్చగా మిగిలిపోతుంది. అతి తక్కువ మొత్తానికి అయినా డిఫాల్ట్ అయితే, స్కోరు తీవ్రంగా పడిపోతుంది.
క్రెడిట్ స్కోరు – భవిష్యత్తుకు తాళం చెవి.. Credit Score: The Key to Your Financial Future
నేటి రోజుల్లో క్రెడిట్ స్కోరు(Credit Score vs CIBIL Score) కేవలం లోన్‌కు పరిమితం కాదు. ఇల్లు కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, ఆర్థిక ప్రపంచంలో మీ విశ్వసనీయతను నిర్ణయించేది ఇదే. అందుకే దీన్ని తేలికగా తీసుకోకూడదు. మొత్తానికి క్రెడిట్ స్కోరు – సిబిల్ స్కోరు మధ్య తేడా అర్థమైతే గందరగోళం తొలగిపోతుంది. క్రెడిట్ స్కోరు ఒక విస్తృత భావన అయితే, సిబిల్ స్కోరు దానిలో ఒక భాగం. భారత్‌లో బ్యాంకులు ఎక్కువగా నమ్మేది అదే. ఆ నిజం తెలుసుకుని, మీ ఆర్థిక ప్రయాణాన్ని క్రమశిక్షణతో కొనసాగిస్తే… రుణాలు మీ ముందు తలుపులు తెరుస్తాయి.
చిన్న తప్పులు – పెద్ద నష్టాలు .. Small Mistakes, Big Financial Losses
ఒక్కసారి బిల్లు మిస్ అయితే ఏమవుతుంది? స్కోరు తగ్గుతుంది. చిన్న మొత్తానికి అయినా డిఫాల్ట్ అయితే? రికార్డ్‌లో మచ్చ పడుతుంది. అవసరం లేకుండా పదే పదే లోన్‌కు అప్లై చేస్తే? బ్యాంకులకు అనుమానం పెరుగుతుంది. ఇవి అన్నీ కలిసి… మీ ఆర్థిక నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.
మీ స్కోరు పెరగాలంటే… How to Improve Your Credit Score
మీ స్కోరు(Credit Score vs CIBIL Score) పెరగడం మంత్రం కాదు. అది అలవాట్ల ఫలితం. సమయానికి ఈఎంఐలు చెల్లిస్తే…., క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యం చేయకపోతే.., లిమిట్‌ను పూర్తి స్థాయిలో వాడకుండా నియంత్రిస్తే… అవసరం లేకుండా లోన్ అప్లికేషన్లు పెట్టకపోతే… మీ స్కోరు క్రమంగా మెరుగవుతుంది.
