విహారయాత్ర కోసం వ్యక్తిగత రుణం.. కలల ట్రిప్‌నకు మార్గమా? లేక ఆర్థిక భారమా? Personal Loan for Travel.. A Gateway to Your Dream Trip or a Financial Burden?
ఇప్పటి కాలంలో విహారయాత్రలు కేవలం విలాసం మాత్రమే కాదు.. చాలామందికి అవి జీవితంలో ఒక అవసరంలా మారిపోయాయి. వేగంగా మారుతున్న జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడులు, నిరంతర పోటీ, మానసిక ఆందోళనలు.. ఇవన్నీ కలిసి చాలా మందిని కొంతకాలం విరామం కోసం ప్రయాణాల వైపు మళ్లిస్తున్నాయి. ఒకప్పుడు ఏడాదికి ఒకసారి కుటుంబంతో కలిసి దగ్గరలోని పర్యాటక ప్రాంతానికి వెళ్లడమే పెద్ద విషయం. కానీ ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ పర్యటనలు మధ్యతరగతి కుటుంబాలకు కూడా సాధారణంగా మారుతున్నాయి. సోషల్ మీడియా…
