మోటారు బీమా పాలసీ తీసుకున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Have You Taken a Motor Insurance Policy? Then Know These Important Points!
ఇప్పటి జీవనశైలిలో మోటారు వాహనం అనేది విలాసం కాదు… అవసరం. ఉదయం ఆఫీసుకు వెళ్లడం మొదలుకుని, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం, ఇంటి సరుకులు తెచ్చుకోవడం వరకు ప్రతి పనిలోనూ బైక్, కారు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో ఒక వాహనం ఉంటే గొప్పగా భావించేవారు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో రెండు, మూడు వాహనాలు ఉండటం సర్వ సాధారణంగా మారిపోయింది. వాహనం పెరిగినట్టే, ప్రమాదాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనంతో పాటు ఆర్థిక భద్రత…
