ఉద్యోగాలు మారుతుంటే రుణం దొరుకుతుందా? బ్యాంకుల రుణాలు ఆమోదిస్తాయా? Will Banks Approve Loans If You Frequently Change Jobs?
ప్రస్తుతం ఉద్యోగ రంగంలో మార్పులు (Frequently Change Jobs) వేగంగా జరుగుతున్నాయి. ఒకే సంస్థలో పదేళ్లు, ఇరవైేళ్లు పని చేసే కాలం క్రమంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు మెరుగైన జీతం, పదోన్నతి, కొత్త అవకాశాలు, పని వాతావరణం కోసం తరచుగా ఉద్యోగాలు మారుతున్నారు. ఐటీ, స్టార్టప్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉద్యోగ మార్పులు సాధారణంగా మారిపోయాయి. అయితే, ఉద్యోగ మార్పులు కెరీర్ అభివృద్ధికి మంచివే అయినా, బ్యాంకుల దృష్టిలో ఇవి ఎప్పుడూ సానుకూల…
