విదేశీ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలు.. EPFO New Guidelines for International Workers
భారతదేశంలో పనిచేసే విదేశీ ఉద్యోగులు, అలాగే విదేశాల్లో పనిచేసి భారతీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న ఇంటర్నేషనల్ వర్కర్లకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ (PF) వ్యవహారాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ వర్గానికి చెందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేలా రూపొందించబడ్డాయి. ఇప్పటికే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు విదేశీ ఉద్యోగులకు PF డబ్బు బదిలీ చేయడం…
