
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. భారత్‌లో నేడు సగటు ఆయుర్ధాయం పెరిగినప్పటికీ, జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న వాయు, ఆహార కాలుష్యం కారణంగా దేశంలో మునుపెన్నడూ లేని విధంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వృద్ధులే కాకుండా యుక్త వయస్సులో ఉన్నవారు కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రి బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడానికి సరైన వయసు ఏది? హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వెయిటింగ్ పీరియడ్.. Waiting period
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని వ్యాధులకు 30-90 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పరిహారం క్లెయిమ్స్ చేయలేరు. కంటి శుక్లం, మూత్రనాళంలో రాళ్లు, మోకాళ్ల మార్పిడి, కీళ్లనొప్పులు మొదలైన అనేక వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. చాలా బీమా కంపెనీలు కనీసం కొన్ని జబ్బులకు వెయిటింగ్ పీరియడ్‌ను వర్తింపజేస్తుంటాయి. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటే మెడికల్ ఎమర్జెన్సీ గురించి చింతించకుండా వెయిటింగ్ పీరియడ్‌ను ఈజీగా దాటేయవచ్చు.
తక్కువ ప్రీమియం.. Low premium
బీమా ప్రొవైడర్ వసూలు చేసే ప్రీమియం మొత్తం, పాలసీదారుడి ప్రస్తుత వయసుపై ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకునేవారు యుక్త వయసులోనే పాలసీని ఎంచుకుంటే, తక్కువ ప్రీమియంతోనే గట్టెక్కవచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల యువకుడు రూ.5 లక్షల విలువ గల ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే, ప్రీమియం దాదాపుగా రూ.5,500-6,000 వరకు ఉంటుంది. అదే 35 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకున్నప్పుడు బీమా ప్రీమియం సుమారుగా రూ.7,000-7,500కు పెరిగిపోతుంది. 45 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారుగా రూ.8,500-9,000 వరకు ఉండొచ్చు. అదే 60 ఏళ్ల సీనియర్ సిటిజన్ పాలసీ తీసుకుంటే రూ.15,000-21,000 వరకు అవుతుంది. అందువల్ల యుక్త వయసులోనే ఆరోగ్య బీమాను తీసుకోవడం చాలా మంచిది.
మెడికల్ చెకప్.. Medical checkup
యవ్వనంలో ఆరోగ్య బీమా పాలసీ కోసం దరఖాస్తు చేసుకుంటే, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా వారి ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి బీమా ప్రొవైడర్లు. అంతేకాకుండా రిస్క్ పరిమితిని బట్టి బీమా సంస్థలు పాలసీని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. యుక్త వయసులో బీమా తీసుకునే వారికి ఈ పరిస్థితి ఉండదు. యవ్వనంలో ఆరోగ్య సమస్యలు తక్కువ కాబట్టి మీ బీమా పాలసీ తిరస్కరించే అవకాశం సాధారణంగా ఉండదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ.
కవరేజ్.. coverage
యవ్వనంలో ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా కవరేజీని పొందొచ్చు. అవసరం ఏర్పడినప్పుడు ఆస్పత్రిలో చేరడమే కాకుండా డే-కేర్ విధానాలు, ప్రీ/పోస్ట్-హాస్పిటలైజేషన్, ఓపీడీ ఖర్చులు మొదలైనవి కూడా బీమా సంస్థ కవర్ చేస్తుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సాధారణంగా బాధ్యతలు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగత ఆరోగ్య బీమాను ఎంచుకుని ఆపై అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. రైడర్స్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా మీ పాలసీ పరిధిని మరింతగా పెంచుకోవచ్చు. అంతేకాకుండా యవ్వనంలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం వల్ల క్యాపింగ్ మొదలైన పరిమితులు లేకుండా ఆరోగ్య రక్షణను పొందవచ్చు.
ట్యాక్స్ బెనిఫిట్స్.. Tax benefits
యుక్త వయసులో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం వల్ల పాలసీదారుడు ఎక్కువ కాలం పాటు ట్యాక్స్ ప్రయోజనాలను పొందొచ్చు. తద్వారా చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 80D ప్రకారం, పాలసీదారుడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల వరకు పన్ను మినహాయింపులను క్లెయిం చేసుకోవచ్చు.
నో క్లెయిమ్ బోనస్.. No Claim Bonus
ఆరోగ్య బీమా పాలసీ రెన్యువల్ చేసుకునేటప్పుడు గతేడాదిలో ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోతే, బీమా సంస్థలు ‘నో క్లెయిం బోనస్’ను అందిస్తాయి. అంటే, క్లెయిమ్ లేని ప్రతి ఏడాదీ మీ బీమా హామీ మొత్తం పెరుగుతుంటుంది. యుక్తవయసులో పాలసీ తీసుకున్నవారికి క్లెయిమ్స్ ఉండే అవకాశం తక్కువ కాబట్టి, ఈ బోనస్‌ను వినియోగించుకోవచ్చు. ఈ బోనస్ వల్ల మీ బీమా కవరేజ్ మొత్తం పెరుగుతుంది. ఇది క్లెయిం చేసే సందర్భంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్ బీమా మొత్తంలో 5 శాతం నుంచి 100 శాతం వరకు కూడా ఉండవచ్చు.
65 ఏళ్లు దాటినా నో ప్రోబ్లమ్.. No problem beyond 65 years
ఐఆర్డీఏ ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని ఇటీవలే ఎత్తివేసింది. కనుక ఇకపై సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయస్సుల వారూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు.
(IRDAI) కీలక మార్పులు.. (IRDAI) Key Changes
– ఆరోగ్య బీమాకు సంబంధించి.. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక మార్పులు చేసింది. బీమా కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. పాలసీల కొనుగోలుకు ఉన్న వయో పరిమితి తొలగించింది. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. అంతకుముందు కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయాలంటే.. గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలుగా ఉండేది. ఇక మీదట వయసుతో ఎలాంటి సంబంధం లేకుండానే ఎవరైనా ఆరోగ్య బీమా పొందే వెసులుబాటు ఉంటుంది. ఇక మీదట అన్ని వయసుల వారికీ బీమా సంస్థలు పాలసీల్ని జారీ చేయొచ్చు.
– ఇకపై అన్ని వయస్కుల వారికీ ఆరోగ్య బీమాను ఇన్సూరెన్స్ కంపెనీలు జారీ చేయొచ్చు. సీనియర్ సిటిజెన్లు, పిల్లలు, గర్భిణులు, విద్యార్థులు సహా కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ డిజైన్ చేయొచ్చు.’ అని IRDAI తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
– సీనియర్ సిటిజెన్లు వంటి నిర్దిష్ట వయస్కుల వారికి ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని.. వారి ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక ఛానెల్ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించింది. IRDAI తాజా నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.
– దీనితో పాటు ఆరోగ్య బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ ఇంకొన్ని మార్పులు కూడా చేసింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్స్ తగ్గించింది. అంతకుముందు నాలుగేళ్లుగా ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్‌ను ఇప్పుడు మూడేళ్లకు కుదించింది. ఈ నిబంధనతో ఒకవేళ 3 సంవత్సరాలు నిరంతరం ప్రీమియం మొత్తం చెల్లిస్తే.. ముందస్తు వ్యాధుల్ని కారణంగా చూపి క్లెయిమ్స్ బీమా సంస్థలు తిరస్కరించేందుకు వీలు పడదు. మారటోరియం వ్యవధిని 8 సంవత్సరాల నుంచి ఐదేళ్లకు తగ్గించింది.
– ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). ఇప్పటికే ఒకే చోట పాలసీలన్నీ అందుబాటులో ఉండేలా బీమా సుగమ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజేషన్ చేయడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది. అంటే ఇకపై అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానికి పద్ధతిలో (E-Insurance) పాలసీలను అందించాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సహా అన్ని బీమా పాలసీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కొత్త ఆర్థిక ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి.
– ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ (EIA) అనే ఆన్‌లైన్ ఖాతాలో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. ఈ అకౌంట్ సాయంతో పాలసీదారులు ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆన్‌లైన్‌లోనే యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడుల కోసం డీమ్యాట్ అకౌంట్ ఎలా పని చేస్తుందో ఈ ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ సైతం అలాగే పని చేస్తుంది. దీంతో పాలసీల నిర్వహణ మరింత సౌలభ్యంగా, సౌకర్యంగా మారుతుంది. ఇన్సూరెన్స్ పాలసీలకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో వీటి వినియోగాన్ని సులభతరం చేసేందుకు ఐఆర్‌డీఏఐ చర్యలు తీసుకుంటోంది.
క్లెయిమ్‌ల కోసం మారటోరియం వ్యవధి తగ్గింపు
Reduction of moratorium period for claims
క్లెయిమ్‌ల కోసం మారటోరియం వ్యవధిని తగ్గించడం వల్ల ఎక్కువ సంఖ్యలో పాలసీదారులు ప్రయోజనం పొందుతారు. ఈ వ్యవధిని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించారు. ఐఆర్‌డీఏఐ 60 నెలల నిరంతర కవరేజీ తర్వాత, బీమా కంపెనీ బహిర్గతం చేయకపోవడం, తప్పుగా సూచించడం వంటి కారణాలతో కస్టమర్ ఏ క్లెయిమ్‌ను తిరస్కరించదు. మోసం రుజువైతేనే బీమా కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. వరుసగా 60 నెలల పాటు ప్రీమియం చెల్లింపును మారటోరియం పీరియడ్ అంటారు.
5 సంవత్సరాల తర్వాత కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించదు
After 5 years the company will not reject the claim
ఇది ఒక ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. పాలసీదారుడు తన హెల్త్ పాలసీ ప్రీమియంను వరుసగా ఐదు సంవత్సరాలు చెల్లిస్తున్నాడనుకుందాం. అటువంటి పరిస్థితిలో బీమా కంపెనీ పాలసీదారు తన ఆరోగ్యం గురించి దాచిన సమాచారాన్ని కలిగి ఉందనే కారణంతో అతని దావాను తిరస్కరించదు. పాలసీదారు ఆసుపత్రిలో చేరడానికి కారణం మరేదైనా కారణం అయినప్పటికీ మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం వంటి ముందస్తు పరిస్థితుల గురించి సమాచారం అందించకపోవడం ఆధారంగా బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరిస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించడమే కాకుండా, బహిర్గతం చేయనందున పాలసీని రద్దు చేస్తాయి.
గతంలో మారటోరియం కాలం 8 ఏళ్ల తర్వాత ముగిసేది
Previously, the moratorium period ended after 8 years
ఈ నిబంధన అమల్లోకి రావడానికి ఈ ఏడాది మార్చి 31 వరకు పాలసీదారులు గతంలో 8 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆరేళ్లలోపు వారు దీనికి అర్హులవుతారు. “పాలసీ హోల్డర్‌కు అనుకూలంగా ఇది ఒక పెద్ద ముందడుగు. 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం పట్టింది. ముందుగా ఉన్న పరిస్థితులు బయటపడేందుకు ఐదేళ్ల సమయం సరిపోతుంది” అని ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శిల్పా అరోరా అన్నారు.
పీఈడీ కోసం వెయిటింగ్ పీరియడ్
Waiting period for PED
ఆరోగ్య బీమా పాలసీలలో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు పేర్కొన్న వ్యాధి లేదా ఆరోగ్య స్థితికి సంబంధించిన కవరేజీని పొందడం ప్రారంభించిన సమయం ఇది. ఇప్పటి వరకు ఈ వెయిటింగ్ పీరియడ్ నాలుగేళ్లు ఉండేది. ఇప్పుడు దానిని 3 సంవత్సరాలకు తగ్గించారు. చాలా బీమా కంపెనీలు మూడు సంవత్సరాల కంటే తక్కువ నిరీక్షణ వ్యవధితో ఉత్పత్తులను అందిస్తాయి.
Maximum age limit for purchase policy has expired
ఇప్పటి వరకు బీమా కంపెనీలు 65 ఏళ్లలోపు వ్యక్తికి రెగ్యులర్ హెల్త్ కవరేజీని అందించడం తప్పనిసరి. నియమాలను మార్చడం ద్వారా ఆరోగ్య పాలసీని కొనుగోలు చేయడానికి గరిష్ట వయస్సు షరతు తీసివేసింది. నిబంధనల మార్పు తర్వాత ఇప్పుడు కస్టమైజ్డ్, ఇన్నోవేటివ్ పాలసీలు మార్కెట్లోకి రానున్నాయని బీమా కంపెనీలు చెబుతున్నాయి. అంటే సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పాలసీలను ప్రవేశపెడతాయన్నమాట. ఇది ఇప్పుడు బీమా కంపెనీలు తమ రెగ్యులర్ పాలసీ నిర్దిష్ట వయో పరిమితి కోసం నిర్ణయించుకునే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. దీనర్థం ఆ వయోపరిమితి కంటే ఎక్కువ ఉన్న వ్యక్తుల కోసం లక్ష్య విధానాలను ప్రవేశపెట్టవచ్చు.
– హెల్త్ ఇన్సురెన్స్ అనగానే మనకి గుర్తుకువచ్చేది క్లెయిమ్స్ చేసే టైమ్ లో చాలా అడ్డంకులు వస్తాయని… అయితే ఇక నుంచి ఆ ఇబ్బందిలేదు. కాగా ఈ సంవత్సరంలో కొత్తగా హెల్త్ ఇన్సురెన్స్ లో మార్పులు జరిగాయి. ఇంతకముందు మనం ముందు నుండే ఏదైనా వ్యాధితో బాధపడితే.. ఆ విషయాన్ని ఇన్సురెన్స్ తీసుకున్నప్పుడు నోటిఫై చేయకపోతే ఇన్సురెన్స్ వర్తించదుని అనేవారు. మనకి వయసు పైబడిన తర్వాత ఇన్సురెన్స్ ఇవ్వం అనేవారు. అయితే ఇప్పుడా సమస్యలేదు.
-Pre Existing Disease అంటే ముందే మనకి ఏదైనా రోగం ఉన్నట్లయితే ఆ రోగానికి సంబంధించి మినిమమ్ వెయిటింగ్ పిరియడ్ 4సంవత్సరాలు ఉండేది. అంటే మనం ఇన్సురెన్స్ తీసుకున్న తర్వాత ఆ వ్యాధి కారణంగా ఏ సమస్య వచ్చిన ఇన్సురెన్స్ క్లెయిమ్ అనేది రాదు. కానీ ఇప్పుడు 4సంవత్సరాలు ఉండే వెయిటింగ్ పిరియడ్ 3సంవత్సరాలు కి పెట్టారు.దానితో పాటుగా Specific Disease కూడా చాలా ఎక్కువ టర్మ్ ఉండేది. దానిని కూడా 3సంవత్సరాలుకి తీసుకువచ్చారు.
– ఇంతకముందు AYUSH treatment అనేది అన్ని చోట్ల ఉండేది. AYUSH treatmentకి లిమిటెడ్ గా డబ్బులు కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి లిమిట్స్ లేవు.
– పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇప్పుడు ఇన్సురెన్స్ తీసుకోవచ్చు. మనకి ముందుగానే ఏదైనా వ్యాది ఉండి మనం ఇన్సురెన్స్ తీసుకున్నప్పుడు మెన్సన్ చేయకపోతే ఇంతకు ముందు క్లెయిమ్ చేసేవాళ్లు కాదు .
– పాలసీ మద్యలో ఆపకుండా కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు కడితే ఆ తర్వాత తప్పకుండా మనకి ఇన్సురెన్స్ ప్రొవైడ్ చేయాల్సిందే.
-మనం ఇంతకముందు చెప్పని వ్యాధి ఏదైనా ఉంటే దానిని 8సంవత్సరాలుMoratorium లో తీసేసె వాళ్లు. ఇప్పుడు దానిని 5సంవత్సరాలికి తగ్గించారు. తర్వాత దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంతకుముందు చాలా సమస్యలు వచ్చాయి. ఇన్సురెన్స్ కి సంబంధించి IRDA తగ్గించుకుంటూ వస్తుంది.
– మనం పాలసీని తీసుకున్నప్పుడు రూల్స్ అన్నింటినీ చెక్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సురెన్స్ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలి.