ఈరోజుల్లో వైద్య ఖర్చులు సామాన్యుడి చేతికి అందని స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక సాధారణ శస్త్రచికిత్సకే లక్షల్లో బిల్లు రావడం కొత్త విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఒక రక్షణ కవచంలా మారింది. ఉద్యోగం చేసే వారికి కంపెనీ ఇచ్చే కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంటే… అదనపు భద్రత కోసం చాలామంది వ్యక్తిగత పాలసీ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడే చాలా మంది చేసే ఒక చిన్న పొరపాటు… పెద్ద ఆర్థిక నష్టానికి దారితీస్తోంది. రెండు పాలసీలు (Health Insurance Policies) ఉన్నా… వాటిని ఎలా వాడుకోవాలో తెలియక, క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండు పాలసీలు… ఒకే చికిత్సకు ఉపయోగించవచ్చా? Can Two Policies Be Used for the Same Treatment?
ఇది చాలా మందికి ఉండే ప్రధాన సందేహం. ఒకే ఆసుపత్రి ఖర్చుకు రెండు వేర్వేరు పాలసీల (Health Insurance Policies) నుంచి డబ్బు పొందడం సాధ్యమేనా? అంటే అవును సాధ్యమే అని అంటున్నారు నిపుణులు . ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఆసుపత్రి బిల్లు రూ.8 లక్షలు వచ్చింది అనుకుందాం. అతని కార్పొరేట్ పాలసీ పరిమితి రూ.5 లక్షలైతే, మొదట ఆ పాలసీ ద్వారా రూ.5 లక్షలు క్లెయిమ్ చేయవచ్చు. మిగిలిన రూ.3 లక్షలను వ్యక్తిగత పాలసీ ద్వారా పొందవచ్చు. అంటే, ఒక పాలసీ సరిపోకపోతే… రెండోది ‘బ్యాకప్’లా పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కీలక నిబంధనలు పాటించాల్సిందే.
సమాచారం ఇవ్వకపోతే… క్లెయిమ్ రద్దే! Non-Disclosure Can Lead to Claim Rejection
రెండు పాలసీలు (Health Insurance Policies)ఉన్నప్పుడు, ఈ విషయం ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందుగానే తెలియజేయడం చాలా ముఖ్యం. చాలామంది ఈ విషయాన్ని చెప్పకుండా క్లెయిమ్ చేస్తారు. ఇదే పెద్ద తప్పు. బీమా కంపెనీలు ఇప్పుడు అన్ని వివరాలను క్రాస్ చెక్ చేస్తాయి. మీరు ఇతర పాలసీ గురించి చెప్పకపోతే, అది ‘మిస్‌రిప్రజెంటేషన్’గా పరిగణించి క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉంది.
లాభం కోసం కాదు… నష్టం తగ్గించుకోవడానికే.. Insurance is for Protection, Not Profit
ఇన్సూరెన్స్‌ను పెట్టుబడి లేదా లాభం పొందే సాధనంగా ఉపయోగించలేరు. మీరు చేసిన మొత్తం ఖర్చు కంటే ఎక్కువ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. రెండు పాలసీలు ఉన్నా, అవి కలిపి మీ అసలు ఆసుపత్రి బిల్లు మేరకే చెల్లిస్తాయి. అదనంగా డబ్బు పొందే అవకాశం ఉండదు.
డాక్యుమెంట్ల నిర్వహణ… అత్యంత కీలకం.. Documentation is Crucial in Claims
క్లెయిమ్(Health Insurance Policies) సమయంలో డాక్యుమెంట్ల పాత్ర ఎంతో కీలకం. మొదటి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒరిజినల్ బిల్లులు సమర్పించాలి. ఆ క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత, రెండో కంపెనీకి క్లెయిమ్ చేయాలంటే… మొదటి కంపెనీ ఇచ్చిన సెటిల్‌మెంట్ సమ్మరీ, అటెస్టెడ్ కాపీలు సమర్పించాలి. ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా… క్లెయిమ్ ఆలస్యం కావచ్చు లేదా తిరస్కరించబడవచ్చు.
క్యాష్‌లెస్, రీఎంబర్స్‌మెంట్… తేడా తెలుసుకోవాలి .. Cashless vs Reimbursement Explained
రెండు పాలసీలు (Health Insurance Policies)ఉన్నప్పుడు, మొదటి క్లెయిమ్ క్యాష్‌లెస్‌గా ఉండొచ్చు. అంటే ఆసుపత్రి బిల్లు నేరుగా బీమా కంపెనీ చెల్లిస్తుంది. కానీ రెండో క్లెయిమ్ మాత్రం తప్పనిసరిగా ‘రీఎంబర్స్‌మెంట్’ రూపంలోనే ఉంటుంది. అంటే ముందుగా మీరు ఖర్చు చేసి, తర్వాత డాక్యుమెంట్లు సమర్పించి డబ్బు తిరిగి పొందాలి. ఈ విషయాన్ని ముందుగానే అర్థం చేసుకుంటే క్లెయిమ్ సమయంలో గందరగోళం ఉండదు.
కార్పొరేట్ పాలసీ… శాశ్వతం కాదు.. Corporate Policy is Not Permanent
చాలామంది ఉద్యోగం ఉన్నంతకాలం కార్పొరేట్ పాలసీ ఉన్నందున వ్యక్తిగత పాలసీ అవసరం లేదని భావిస్తారు. ఇది పెద్ద అపోహ. ఉద్యోగం మారినా, రిటైర్ అయినా కార్పొరేట్ పాలసీ వెంటనే ముగుస్తుంది. ఆ సమయంలో కొత్తగా పాలసీ తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా వయసు పెరిగినప్పుడు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అందుకే కార్పొరేట్ పాలసీని ప్రధానంగా ఉపయోగించి, వ్యక్తిగత పాలసీని బ్యాకప్‌గా ఉంచుకోవడం ఉత్తమం.
నో క్లెయిమ్ బోనస్… దీర్ఘకాల లాభం .. No Claim Bonus: A Long-Term Advantage
వ్యక్తిగత పాలసీని ఉపయోగించకుండా ఉంచితే ‘నో క్లెయిమ్ బోనస్’ లభిస్తుంది. దీని వల్ల మీ కవరేజీ పెరుగుతుంది లేదా ప్రీమియం తగ్గుతుంది. కాబట్టి చిన్న ఖర్చులకు కార్పొరేట్ పాలసీని వాడి, పెద్ద అవసరాల కోసం వ్యక్తిగత పాలసీని ఉంచుకోవడం ఆర్థికంగా లాభదాయకం.
పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సినవి.. Things to Check Before Buying a Policy
ఆరోగ్య బీమా తీసుకోవడం అంటే కేవలం ప్రీమియం చూసి నిర్ణయం తీసుకోవడం కాదు. భవిష్యత్తులో వచ్చే వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని తగిన కవరేజీ ఎంచుకోవాలి. కనీసం రూ.10 లక్షల వరకు కవరేజీ ఉండటం మంచిది. ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులపై వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. కొన్ని చికిత్సలకు 2 నుంచి 4 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రులు నెట్‌వర్క్‌లో ఉన్నాయో లేదో కూడా చెక్ చేయాలి. కో-పేమెంట్, రూమ్ రెంట్ పరిమితులు తక్కువగా ఉన్న పాలసీలను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే ఆసుపత్రిలో చేరే ముందు, తర్వాత ఖర్చులు ఎన్ని రోజుల వరకు కవర్ అవుతాయో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా—మీ ఆరోగ్య వివరాలను పూర్తిగా వెల్లడించాలి. లేదంటే క్లెయిమ్ తిరస్కరణకు దారి తీస్తుంది.
అవగాహన ఉంటేనే పూర్తి లాభం.. Awareness Ensures Full Benefit
రెండు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు(Health Insurance Policies) ఉండటం ఒక అదనపు భద్రత. కానీ వాటిని సరిగ్గా వాడుకోకపోతే ప్రయోజనం ఉండదు. అయితే చిన్న పొరపాటు.. ముఖ్యంగా సమాచారం ఇవ్వకపోవడం, డాక్యుమెంట్లలో లోపాలు ఉంటే మీ క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరించే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే నియమాలు తెలుసుకోండి… సరైన ప్రణాళికతో పాలసీలను వాడుకోండి… అప్పుడే ఆరోగ్య బీమా నిజమైన రక్షణగా నిలుస్తుంది.

