రోజురోజుకూ నింగినంటుతున్న బంగారం ధర అమాంతం తగ్గింది. ఒక్కరోజు వ్యవధిలో 10 గ్రాముల వద్ద రూ.6వేలు వరకూ తగ్గింది. దీంతో మార్కెట్ వర్గాలు, కొనుగోలుదారులు , పెట్టుబడిదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న మార్పులు , డాలర్ బలోపేతం, స్థానిక డిమాండ్ లోపం వంటివి మన దేశంలో బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్న పెట్టుబడిదారులు, గోల్డ్ ఇన్వెస్టర్లు ఈ స్థితిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,28150కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,17,500 లుగా ఉంది. మంగళవారంతో పోలిస్తే రూ.6వేలు తగ్గింది. కాగా కిలో వెండి ధర రూ.1,65000 లుగా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,27,200 , 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,16,600 లకు చేరింది. కిలో వెండి ధర రూ.1,62,000 లుగా ఉంది.
