ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ వివిధ అవసరాల కోసం ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ను వాడుతున్నారు. విద్య, వైద్యం, పెళ్లిళ్లు, శుభకార్యాలు,ఫోన్లు ఇతర వస్తువుల కొనుగోలుకు.. తక్షణ నగదు కోసం వాటిని వినియోగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ విధించే వడ్డీరేట్లు, ఇతరత్రా అంశాలను చాలామంది పరిశీలించడం లేదు. దీంతో ఈఎంఐలు చెల్లించేటప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారు.. తక్షణ నగదు కోసం ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ అందిస్తున్న సౌకర్యం ఆకర్షిస్తున్నప్పటికీ వాటి వలకల లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తప్పవు. అవగాహన, జాగ్రత్త, సమయానికి చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
నగదు ఎలా పొందొచ్చంటే.. How to Get Cash
మొబైల్ యాప్‌ల ద్వారా చిన్న మొత్తంలో (₹1,000 – ₹5 లక్షల వరకు) తక్షణంగా వ్యక్తిగత, ఆన్‌లైన్ లోన్ పొందవచ్చు. క్షణాల్లోనే ఆ యాప్‌ల నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమవుతుంది. మొబైల్ ఫోన్లో రిజిస్ట్రేషన్ + KYC పూర్తయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లేదా UPI లింక్ ద్వారా నిధులు వెంటనే పొందొచ్చు. ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ ఫీజులు, వడ్డీ రేట్లు సులభంగా తెలుసుకోవచ్చు.
సమయం ఆదా..Save Time
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ తో మీ సమయం ఆదా అవుతుంది. పేపర్ వర్క్ అవసరం లేదు. కిరాణా బిల్లులు, ఫోన్ బిల్లులు, ఎమర్జెన్సీ వ్యయం కోసం ఈ యాప్స్‌లో నిధులు పొందొచ్చు. డిజిటల్ Payment, UPI సామర్థ్యంతో వెంటనే రుణం పొందొచ్చు.
జాగ్రత్తలు ..Precautions
ఎప్పుడూ SEBI / RBI గుర్తింపు కలిగిన యాప్స్ మాత్రమే వాడాలి. వడ్డీ రేట్లు & ఫీజులు ముందు చూడాలి. లోన్ తీసుకున్న తర్వాత టైమ్‌కి తిరిగి చెల్లించటం అత్యంత ముఖ్యము. ఫ్రాడ్ యాప్స్ నుండి దూరంగా ఉండాలి. “3 రోజుల్లో డబుల్ మని” వంటి ప్రకటనలు నమ్మకూడదు. ఏవైనా నాన్-బ్యాంకింగ్ లోన్ యాప్స్ వాడేముందు రిజిస్ట్రేషన్ చూడాలి. UPI / బ్యాంక్ అకౌంట్ ద్వారా సులభంగా రిఫండ్ చేయగలగాలి. KYC / PAN / Aadhar వివరాలు సురక్షితం అని ధృవీకరించుకోవాలి. లోన్ తిరిగి సమయానికి చెల్లించాలి. లేకుంటే ఫీజులు, పాజిటివ్ క్రెడిట్ రిపోర్ట్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అవసరానికి మాత్రమే ఈ యాప్స్ నుంచి నగదు పొందాలి. లగ్జరీ ఖర్చులు లేదా అవసరం లేని సమయంలో లోన్ తీసుకోవడం ప్రమాదం.
రుణాలు అందించే యాప్స్..Apps That Provide Loans
CASHe – ఉద్యోగుల కోసం తక్షణ సొల్యూషన్, సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియ
PaySense – చిన్న వ్యక్తిగత లోన్లు, ఫ్లెక్సిబుల్ రిపేమెంట్ ఆప్షన్స్
EarlySalary – సాలరీ అడ్వాన్స్ , వ్యక్తిగత లోన్స్
MoneyTap – రీవాల్వింగ్ క్రెడిట్ లైన్, వెంటనే నగదు
NIRA – స్మార్ట్ లోన్ యాప్, ఎమర్జెన్సీ ఖర్చుల కోసం
వడ్డీ రేట్లు ఇలా .. Interest Rates Are Like This…
సాధారణంగా ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ లో వడ్డీ రేట్లు 15% – 30% వార్షికంగా ఉంటాయి. అయితే సాధారణ బ్యాంక్ లోన్ల కన్నా అవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని యాప్స్‌లో ఫీజులు కూడా వేరే విధంగా (సబ్‌స్క్రిప్షన్, లేటు చార్జీలు) ఉంటాయి.
సకాలంలో చెల్లించకపోతే .. If Not Paid on Time…
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ నుంచి రుణం పొందిన తర్వాత ప్రతినెలా నిర్ణీత తేదీల్లో ఈఎంఐ చెల్లించకపోతే లేటు చార్జీలు వేస్తారు. ఇవి ఎక్కువగానే ఉంటాయి. క్రెడిట్ రిపోర్ట్ ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో లోన్ పొందడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఫ్రాడ్ యాప్స్‌తో సమస్యలు అధికం. సర్వీస్ ఫీజులు, సబ్‌స్క్రిప్షన్ ఫీజులు మరింత పెరుగుతాయి తక్షణ లోన్ తీసుకున్న తర్వాత సమయానికి చెల్లించాలి. అలా చేయకపోతే, చిన్న లోన్ కూడా భారీ నష్టంగా మారవచ్చు.
