ఆరోగ్య బీమా వైపు ప్రజల చూపు… రూ.1.2 లక్షల కోట్లకు చేరిన ప్రీమియం.. People Turning Towards Health Insurance… Premiums Reach ₹1.2 Lakh Crore
ఆరోగ్య భద్రతపై ప్రజల్లో అవగాహన క్రమంగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వైద్య ఖర్చులు అమాంతం పెరగడం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భారం తప్పించుకోవాలనే అవసరం పెరగడం వంటి కారణాలతో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్-Health Insurance) వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తం విలువ రూ.1.2 లక్షల కోట్లను దాటడం గమనార్హం. ఇది గత సంవత్సరం 2023-24తో పోలిస్తే సుమారు 9 శాతం వృద్ధిని నమోదు…
