నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు.. Relief After Losses… Domestic Markets Rebound
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, యుద్ధ భయాలు, పెట్టుబడిదారుల అనిశ్చితి వంటి కారణాలతో గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సోమవారం ట్రేడింగ్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా పడిపోయి పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేశాయి. అయితే మంగళవారం పరిస్థితి కొంతమేర మారింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో కొద్దిపాటి సానుకూల సంకేతాలు…
