నష్టాల నుంచి లాభాల బాటలోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
ఒకప్పుడు మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులు ( Public Sector Banks ) ఇప్పుడు మళ్లీ బలంగా నిలబడుతున్నాయి. నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టిన ఈ బ్యాంకులు వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరంలోనూ అద్భుత ఫలితాలు నమోదు చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే కొత్త మైలురాయిగా నిలిచింది. ఇది ఇప్పటివరకు…

