పదవీ విరమణ ప్రణాళికలో మారుతున్న దృక్పథం..
ఒకప్పుడు పదవీ విరమణ (Retirement Planning) అంటే ఉద్యోగ జీవితానికి ముగింపు, ఆ తర్వాత ప్రశాంత జీవితం అనే భావన ఉండేది. ఉద్యోగంలో ఉన్నంత కాలం సంపాదించి, రిటైర్మెంట్ వచ్చిన తర్వాత పిల్లల అండతో లేదా బ్యాంకు డిపాజిట్ల వడ్డీతో మిగతా జీవితాన్ని గడపాలని పెద్దలు భావించేవారు. కానీ కాలం మారింది. కుటుంబ వ్యవస్థలు మారాయి. ఆర్థిక పరిస్థితులు మారాయి. జీవన విధానం మారింది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాతి జీవితాన్ని చూసే దృక్పథం పూర్తిగా మారిపోయింది….
