డిజిటల్, ఫైనాన్షియల్ గోల్డ్ వైపు అడుగులు .. పసిడి పెట్టుబడులకు కొత్త దారులు..!! Steps Towards Digital & Financial Gold.. New Avenues for Gold Investments..!
భారతీయ కుటుంబాల జీవన విధానంలో బంగారానికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. పుట్టిన బిడ్డకు తొలి బంగారు గొలుసు నుంచి పెళ్లిళ్లలో ఇచ్చే ఆభరణాల వరకు… పసిడి కేవలం లోహం కాదు, భావోద్వేగం కూడా. తరతరాలుగా సంపదకు చిహ్నంగా, కష్టకాలానికి అండగా, కుటుంబ గౌరవానికి ప్రతీకగా భారతీయులు బంగారాన్ని భావిస్తూ వచ్చారు. అందుకే దేశంలో పండగలు, శుభకార్యాలు, వివాహ సీజన్ వచ్చినప్పుడల్లా బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతుంటాయి. అయితే ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ మార్పులు,…

