భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
వంటగదిలో కూరగాయల నుంచి బంగారు దుకాణాల్లో ఆభరణాల వరకు.. ధరల మంట సామాన్యుడి జేబును కాల్చేస్తోంది. గత కొన్ని నెలలుగా కాస్త నియంత్రణలోకి వస్తోందనుకున్న ద్రవ్యోల్బణం మళ్లీ తలెత్తింది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, పసిడి ఆభరణాలు, వంటింటి అవసరాల ధరలు పెరగడంతో ఏప్రిల్‌లో రిటెయిల్ ద్రవ్యోల్బణం ( Retail Inflation ) 3.48 శాతానికి చేరింది. మార్చిలో ఇది 3.40 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరింత పెరగడం వినియోగదారుల్లో ఆందోళన పెంచుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల…

