డిజిటల్ సిగ్నేచర్.. పత్రాలకు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
ప్రపంచం వేగంగా డిజిటల్ దిశగా పయనిస్తోంది. బ్యాంకింగ్, వ్యాపారం, ప్రభుత్వ సేవలు, విద్య, ఉద్యోగాలు.. ఇలా ప్రతీ రంగంలో ఆన్‌లైన్ వ్యవస్థలు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి ఎదురుచూసి చేసే పనులు ఇప్పుడు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ద్వారానే నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ఒప్పందాలు, దరఖాస్తులు, పన్ను పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, టెండర్లు అన్నీ డిజిటల్ రూపంలోనే మార్పిడవుతున్నాయి. అయితే సౌలభ్యం పెరిగిన కొద్దీ మోసాల భయం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పంపే పత్రాలను…
