ప్రతీ ఇంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక చిన్న దేశంలాంటిదే. నెలవారీ జీతం, ఇంటి అద్దె, ఈఎంఐలు, నిత్యావసర సరుకులు, కొద్దిగా పెట్టుబడులు… ఇలా అన్ని ఖర్చులు సాఫీగా సాగుతున్నట్లు అనిపిస్తుంటే, అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు ఎదురైనపుడు మనం అప్పులపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. పిల్లల టర్మ్ ఫీజులు, వాహన మరమ్మతులు, ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం, కారు సర్వీసింగ్ వంటి ఖర్చులు అనుకోకుండా వస్తాయి. చేతిలో డబ్బు లేకపోతే క్రెడిట్ కార్డు లేదా స్నేహితుల దగ్గర నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. నిజానికి, ఇవన్నీ అసలు అనుకోని ఆపదలు కాదని మనకు తెలుసు. ఏడాదికోసారి వచ్చే ఖర్చులు అని తెలిసినప్పటికీ, వాటికోసం ముందుగానే డబ్బు వేరుగా ఉంచకపోవడం వల్ల, ఈ ఖర్చులు ఎదురైనప్పుడు ఇబ్బంది పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ‘సింకింగ్ ఫండ్’ (Sinking Fund )అనే పద్ధతి ఉంది.
సింకింగ్ ఫండ్ అంటే ఏమిటంటే? What Exactly Is a Sinking Fund?
భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చే ఖర్చుల కోసం… ఇప్పుడు కొద్దికొద్దుగా డబ్బును వేరుగా పెట్టడం సింకింగ్ ఫండ్(Sinking Fund ). అప్పు తీసుకొని, వాయిదాల్లో చెల్లించే బదులు… ముందే వాయిదాల్లో డబ్బు నిలుపుకోవడం. పెద్ద ఖర్చు వచ్చేసరికి అప్పులు తీసుకోవాల్సిన అవసరం రాకుండా చేయడం. నిజానికి, సింకింగ్ ఫండ్ అనే పదం కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చింది. పెద్ద కంపెనీలు బాండ్లు జారీ చేసి అప్పులు తీసుకుంటాయి. అప్పు తీర్చే గడువు వచ్చేసరికి ఒక్కసారిగా భారం పడకుండా ఉండేందుకు, లాభాల్లో నుంచి కొంత మొత్తాన్ని ప్రత్యేక నిధికి మళ్లిస్తారు. దీన్ని అనుసరించి మన వ్యక్తిగత జీవితంలోనూ సింకింగ్ ఫండ్ విధానాన్ని అమలు చేయవచ్చు.
అత్యవసర నిధి vs సింకింగ్ ఫండ్ Emergency Fund vs Sinking Fund
చాలామంది పొదుపు ఖాతాలో డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. కానీ ప్రతి రూపాయికీ ఒక లక్ష్యం ఉండాలి.
అత్యవసర నిధి (Emergency Fund): అనుకోని ఆపదలు, అత్యవసర ఖర్చుల కోసం. ఉదాహరణకు ఉద్యోగం పోవడం, అత్యవసర వైద్య ఖర్చులు. సాధారణ ఖర్చుల కోసం దానిని వాడకూడదు.
సింకింగ్ ఫండ్ (Sinking Fund ): ఇది ముందే తెలిసిన ఖర్చుల కోసం. ఉదాహరణకు పండగ ఖర్చులు, ఇంటికి రంగులు, వాహన మరమ్మతులు, పిల్లల ఫీజులు, బీమా ప్రీమియం. ఈ మొత్తాన్ని అవసరాలకు అనుగుణంగా వాడాలి.
ఎందుకు అవసరం? Why Is It Necessary?
చాలామంది పెద్ద ఖర్చు దూరంలో ఉన్నప్పటికీ, దగ్గరలో ఉన్న చిన్న ఆనందాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఫలితం: ఏడాది చివర్లో పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సినప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సింకింగ్ ఫండ్ ఆందోళనను తగ్గిస్తుంది. ఉదాహరణకి విహార యాత్ర కోసం డబ్బు తీసుకోవాలి. సింకింగ్ ఫండ్(Sinking Fund )లో ఇప్పటికే పొదుపు చేసుకున్న డబ్బు ఉంటే… ఆ ఖర్చు మనసుకు భారమవ్వదు. మీరు ఆర్థిక ఒత్తిడికి గురికావకుండా, యాత్రను ఆనందంగా ఆస్వాదించగలరు.
వడ్డీ పరంగా లాభం…Interest Benefits
క్రెడిట్ కార్డులో 50,000 రూపాయలు తీసుకొని వాయిదాలుగా చెల్లిస్తే 14–16% వడ్డీ పడుతుంది. అదే డబ్బు సింకింగ్ ఫండ్(Sinking Fund )లో ముందే పొదుపు చేస్తే, 4–6% వడ్డీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఖర్చు చేయడానికి డబ్బు సిద్ధంగా ఉంటుంది. కానీ బడ్జెట్‌కు ఎటువంటి భారమూ పడదు.
ఎక్కడ దాచాలి? Where to Keep It?
సింకింగ్ ఫండ్ (Sinking Fund ) ప్రధాన ఉద్దేశ్యం సురక్షితంగా డబ్బు అందుబాటులో ఉండటం. రికరింగ్ డిపాజిట్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, ఫ్లెక్సీ డిపాజిట్ ఖాతాల్లో డబ్బు దాచుకోవచ్చు. ఇవి లాభాల కోసం కాకుండా.. అవసరానికి తక్షణ వినియోగానికి దోహదపడతాయి. ఉదాహరణకు మీరు రెండు సంవత్సరాల తర్వాత బైకు కొనాలని అనుకుంటే.. ప్రస్తుతం దాని ధర: రూ.1,30,000 అనుకుందాం. రెండు సంవత్సరాల తర్వాత దాని అంచనా ధర: రూ.1,50,000 అవుతుందనుకుందాం. ఈమేరకు మీరు నెలవారీగా రూ.6,250 చొప్పున పొదుపు చేయాలి. ఇలా చేసుకుంటే…ఎటువంటి అప్పు లేకుండా బైకు కొనవచ్చు. ఇంకా ఈ 24 నెలలలో కొంత వడ్డీ కూడా సంపాదించవచ్చు.
ఖర్చులను వర్గీకరించండి: తప్పనిసరి vs ఐచ్ఛిక… Categorize Expenses: Essential vs Optional
ముందుగా తెలుసు ఖర్చుల కోసం ఫండ్ (Sinking Fund )ఏర్పాటుచేయండి. లాభాలు గడపని, సురక్షితమైన సేఫ్ వేదికలను ఎంచుకోండి. నిరంతరంగా జమ చేస్తూ లక్ష్యాన్ని చేరుకోండి. దీనివల్ల అప్పులు తగ్గుతాయి. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. పెద్ద ఖర్చులు సమస్యగా మారవు. కుటుంబం, భవిష్యత్తు సురక్షితం అవుతుంది.
శక్తివంతమైన ఆర్థిక పద్ధతి.. A Powerful Financial Strategy
సింకింగ్ ఫండ్ (Sinking Fund )ఒక చిన్న శక్తివంతమైన ఆర్థిక పద్ధతి. మన ఖర్చులను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం వల్ల అవసరానికి తగిన డబ్బు సురక్షితంగా ఉంచుకోవచ్చు. పెద్ద అప్పులు లేకుండా లక్ష్యాలను చేరుకోవచ్చు. ఈ విధానం ప్రతి ఇంటి ఆర్థిక పరిస్థితిని సుస్థిరం చేస్తుంది. మీరు ప్రతి నెలా కొద్దిగా పెట్టుబడి పెడుతూ… రెండు–మూడు సంవత్సరాల్లో పెద్ద ఖర్చులను సులభంగా ఎదుర్కోగలుగుతారు. సింకింగ్ ఫండ్‌తో, మీ భవిష్యత్తు సురక్షితం, ఆర్థిక ఒత్తిడి లేని, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది.
