
ఆర్బీఐ వడ్డీ రేటును మళ్ళీ పెంచింది. బ్యాంకులకి ఇచ్చే నిధులపై ఆర్బీఐ వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ పెంచి 4.9 శాతానికి చేర్చింది. తాజా మార్పులకు అనుగుణంగా బ్యాంకులు వినియోగదారులకు మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. దీనివల్ల ఇంటిలోన్, వాహనాల లోన్ పై ఈఎంఐ భారం ఎక్కువ పడుతుంది. ద్రవ్యోల్బణం వృధ్ధిలోకి తెచ్చేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్బీఐ తెలిపింది. అంటే ఈ వడ్డీ రేట్లు ఇంకా పెరగవచ్చు.
కరోనా ముందు స్థాయికే..
కరోనా ముందు వృధ్ధిరేటు తగ్గిపోవడంతో వడ్డీరేటును 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ తగ్గిస్తూ వచ్చింది. కరోనా మొదట్లో 2020 లో మార్చి, మే నెలల్లో 75 బేసిస్ పాయింట్ల, 40 బేసిస్ పాయింట్ల చొప్పున కోత వేసింది. 2019 నుంచి 2020 మే లోపు వడ్డీరేటును 250 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఆ తర్వాత 11 సార్లు ద్వైమాసిక సమీక్ష జరిగినా, రేట్లు సవరించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే లో 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేసింది. ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతం చేసింది. 5 వారాల్లో వడ్డీ రేటు 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. రెపో రేటుకు తగ్గట్టుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్లను కూడా 50 బేసిస్ పాయింట్ల పెంచి వరుసుగా 4.65 శాతం, 5.15 శాతానికి ఆర్బీఐ చేర్చింది.
why inflation increases
ద్రవ్యోల్బణ అంచనా 6.7 శాతం..
ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడంతో మనపై ప్రభావం పడుతోందని ఆర్‌బీఐ తెలిపింది. సరఫరా అవరోధాలు మరింత తీవ్రమైతే, ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, కమొడిటీలు, ఇంధన ధరలు పెరగొచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాలను 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రేట్ల పెంపు తప్పదు.
* వడ్డీ రేటును పెంచడం వల్ల గృహ రుణాలు భారమవుతాయని దానివల్ల తక్కువకాలంలోనే ఇళ్లకు గిరాకీ తగ్గుతుంది. వడ్డీ రేటు పెంచడం వల్ల రాబోయే నెలల్లో ఇళ్లకు గిరాకీ తగ్గవచ్చు. అందుబాటు ధర, మధ్యశ్రేణి ఇళ్లపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇళ్లు కట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. వడ్డీ రేట్లు పెంచడం వల్ల నెలవారీ ఈఎంఐల భారం పెరిగి, స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిర్మాణదారులు కూడా కొత్త ప్రాజెక్టుల కట్టడానికి ఆసక్తి చూపించరు. ఇళ్ళపై రేటు తక్కువ కాలంలోనే ప్రభావం ఉంటుంది.
* ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే ఉక్కు, సిమెంట్, వంటి ముడిపదార్దాల ధరలు తగ్గుతాయి. సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు ఇచ్చే లోన్స్ ను ఎక్కువ చేయడం వల్ల పట్టణాల్లో నిర్మాణాలకు మద్దతు లభిస్తుంది. ధరలు బాగా పెరుగుతున్న సమయంలో వడ్డీరేట్లు పెంచవలిసి వచ్చింది. దానిని సర్దుబాటు విధానం ఉపసంహరించుకోవడం కూడా ఇందుకే. ఇదే సమయంలో వృధ్ధికి ఆటంకం కలగకుండా చూస్తోంది.
* బీమా ప్రీమియం, బిల్లుల చెల్లింపు, నెలవారీ చెల్లించాల్సిన చందా రుసుముల వంటి వాటికి ఆటో డెబిట్ సదుపాయన్ని చాలామంది వినియోగించుకుంటున్నారు. రూ.5,000 మించిన ఇలాంటి లావాదేవీలకు పాస్ వర్డ్ ను వినియోగదారులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పరిమితిని రూ.15,000కు పెంచారు. ఇంతకు మించితే ఓటీపీ చెప్పవలిసి ఉంటుంది.
* ఇంటిపై రుణాలను ఇవ్వడానికి సహకార బ్యాంకులకు పరిమితి పెరిగింది. మనకి సహకార బ్యాంకులు ఎక్కువగా ఇచ్చే గృహ రుణ పరిమితిని రూ.1.40 కోట్లకు ఆర్బీఐ పెంచింది. ఇంతకుముందు ఇది రూ.70 లక్షలుగా ఉండేది. గతంలో ఒక వ్యక్తికి రూ.30 లక్షల వరకు గృహ రుణం ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువగా రూ.75 లక్షల వరకు గృహ రుణం ఇవ్వొచ్చని తెలిపింది. ఇళ్ళ ధరలు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని , వినియోగదారుల అవసరాల రీత్యా రుణ పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది.
* యూపీఐకు క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకు పొదుపు ఖాతా, కరెంటు ఖాతాకు సంబంధించి డెబిట్ కార్డులను మాత్రమే యూపీఐకు అనుసంధానం చేసే వీలుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డులను కూడా యూపీఐకు అనుసంధానం చేయడం వల్ల చెల్లింపులకు మరింత వీలు కల్పించినట్లు ఆర్బీఐ తెలిపింది. తగిన వ్యవస్థను రూపొందించాక ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామంది. యూపీఐ లావాదేవీలకు రుసుం లేదు. అయితే క్రెడిట్ కార్డు సంస్థలు లావాదేవీకి అనుగుణంగా ఛార్జీ చేస్తుంటారు. ఈ రెండింటి అనుసంధానం, ఛార్జీల విషయం బ్యాంకుల పరిధే.
* డిజిటల్ రుణ యాప్ ల నుంచి అప్పులు తీసుకున్న వినియోగదారులకు, ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయవల్సిందిగా ఆర్బీఐ సూచించింది. తద్వారా నమోదైన రుణ సంస్థలపై నే ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.