2027 ఏప్రిల్ నుంచి ఈసీఎల్ నిబంధనలు.. బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు.. Banking Sector Transformation with ECL Rules from April 2027
భారత బ్యాంకింగ్ రంగంలో మరో కీలక మలుపు తిరగబోతోంది. గతంలో బ్యాంకులు రుణాలు ఇచ్చిన తర్వాత వాటి వసూళ్లు, మొండి బాకీలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై ఆధారపడి వ్యవహరించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. రుణం ఇచ్చిన తర్వాత సమస్యలు వస్తే స్పందించడం కాదు.. సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పుడే ముందుగానే నిధులు సిద్ధం చేసుకోవాల్సిన కొత్త విధానం తీసుకురాబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే ‘ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్’ లేదా ‘ఈసీఎల్’ విధానం….
