రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం.. టాటా నుంచి ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’.. Tata Launches ‘Shubh Flexi Pension Plan’ for Financial Security After Retirement
ఉద్యోగ జీవితాన్ని ముగించిన తర్వాత ఆర్థికంగా సురక్షితంగా జీవించడం ప్రతి ఒక్కరి లక్ష్యం. ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల నెలా జీతం రూపంలో వచ్చే ఆదాయం పదవీ విరమణ తర్వాత ఒక్కసారిగా ఆగిపోతుంది. కానీ ఖర్చులు మాత్రం తగ్గవు. అంతేకాదు, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య వ్యయాలు పెరగడం, జీవన వ్యయం పెరుగుతుండటం వంటి అంశాలు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భారం మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవితాంతం నిరంతర ఆదాయం అందించే పెట్టుబడి పథకాలకు ప్రాధాన్యం పెరుగుతోంది….
