ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వరలో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System
దేశవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఉద్యోగ జీవితాంతం నెలనెలా జమయ్యే ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును పదవీ విరమణ తర్వాత పొందేందుకు ఇప్పటివరకు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులకు ఇక ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటైర్మెంట్ అనంతరం క్లెయిమ్‌లు, పత్రాల పరిశీలన, కార్యాలయాల చుట్టూ తిరుగుడు, సాంకేతిక సమస్యలు వంటి అనేక అడ్డంకులతో నిధుల ఉపసంహరణ ప్రక్రియ చాలా మందికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో…

