బొగ్గుతో ఇంధనం.. కేంద్రం సరికొత్త ప్లాన్..!! Coal to Fuel: Centre’s Brand-New Plan..!
దేశం ఎదుగుదల అంటే కేవలం రహదారులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు మాత్రమే కాదు.. ఆ అభివృద్ధికి వెన్నెముకలా నిలిచేది ఇంధన భద్రత. విద్యుత్ లేకుండా పరిశ్రమలు కదలవు. చమురు లేకుండా రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది. గ్యాస్ లేకుండా ఎరువుల పరిశ్రమలు మూతపడతాయి. అందుకే ఏ దేశమైనా తన ఇంధన అవసరాలను ఎలా తీర్చుకుంటోంది అన్నదే ఆర్థిక బలానికి ప్రమాణంగా మారుతోంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. అయితే అభివృద్ధి…

