
how much tax on EPF profits
వేతన జీవుల భవిష్యత్తు అవసరాల కోసం ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం కోత పడుతుంది. ఈ
ఉద్యోగి వాటాకు సమానం నిష్పత్తిలో సంస్థ లేదా ప్రభుత్వం కూడా డబ్బులు కలిపి ఈ పీఎఫ్( ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్) గా జమ చేస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే ఎవరైనా వ్యక్తులు కూడా ఉద్యోగాలకు సంబంధం లేకుండా పీపీఎఫ్( పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ను కూడా దాచుకోవచ్చు. అన్ని పొదుపు పథకాల్లోకెల్లా అత్యధిక మొత్తం వడ్డీ రాబడి ఇచ్చేవి పీఎఫ్ పథకాలే కావడంతో వీటిపైనే అందరూ భరోసా పెట్టుకుంటారు. ఇలా వచ్చే వడ్డీపై ఇప్పటి వరకూ ఎటువంటి పన్ను ఉండేది కాదు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పీఎఫ్ వడ్డీపై కూడా పన్ను చెల్లించాలని నూతన ఆదేశాలు జారీ చేసింది.
how much EPF amount is tax free
2,50,000 దాటితే..
ఈ పీఎఫ్, పీపీఎఫ్ ద్వారా జమ చేసే మొత్తం రూ.2,50,000 కన్నా దాటితే వచ్చే వడ్డీపై ట్యాక్స్ పే చేయాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ఇది ఉద్యోగులను కొంచెం కలవరపెట్టే విషయమే అని చెప్పాలి.
2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ టీడీఎస్ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
* 2022 ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ ఖాతాలో పన్ను, పన్నేతర ఖాతాలను నిర్వహిస్తూ ఏటా జమ రూ.2.5 లక్షలు దాటితే, వడ్డీపై పన్ను విధిస్తుంది. ఉద్యోగి జమ రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఆ నగదు జమపై వచ్చే వడ్డీపై టీడీఎస్ అమలవుతుంది. ఉద్యోగి ఖాతాకు పాన్ అనుసంధానమైతే 10 శాతం లేదా 20 శాతం పన్ను పడుతుంది.
* పీఎఫ్ వడ్డీ సంవత్సరానికి ఒకసారి జమ చేసినప్పటికీ, ఖాతా నిర్వహణ ప్రతి నెలా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగి ఖాతాలో పన్నేతర, పన్ను పేరిట రెండు కాంపొనెంట్స్ ఏర్పాటు చేసి, ప్రతి నెలా వడ్డీని లెక్కించి ఆ మొత్తంపై పన్ను గణిస్తారు. ఈ పన్ను ఏటా ఆదాయ పన్ను శాఖకు ఈపీఎఫ్ వో జమ చేస్తుంది.
పన్ను పరిధిలోకి వచ్చే మొత్తంపై మాత్రమే..
ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం నుంచి ఉద్యోగి వాటా స్వచ్ఛంద వాటాతో కలిపి నెలకు రూ.30 వేలు పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు అతని ఖాతాలో రూ.3.6 లక్షలు జమ అవుతాయి. ఇందులో రూ.2.5 లక్షలు పన్నేతర ఖాతా, మిగిలిన రూ.1.10 లక్షలు పన్ను పరిధి ఖాతాలోకి వెళ్తాయి. అంటే ఉద్యోగి డిసెంబర్ చందా నాటికి మొత్తం రూ.2.7 లక్షలు అవుతుంది. ఈ లెక్కన అప్పటికే పన్ను ఖాతాలో రూ.2.5 లక్షల సీలింగ్ దాటినందున, ఆ నెల నుంచి మిగిలిన సొమ్ము పన్ను ఖాతాలోకి జమ అవుతుంది. ఈ లెక్కన 8.1 శాతం వడ్డీ చొప్పున లెక్కపెడితే, పన్ను ఖాతాలోని రూ.2.5 లక్షలకు సంవత్సరానికి రూ.14,044 వడ్డీ అవుతుంది. ఈ వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. పన్ను ఖాతాలో రూ.1.10 లక్షల జమకు 4 నెలలకు రూ.2362 వడ్డీ వస్తుంది. ఈ వడ్డీపై 10 శాతం టీడీఎస్ జమ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు 240 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పీఎఫ్ అమౌంట్ ను సంవత్సరం మధ్యలో తీసుకుంటే పన్ను పరిమితులు మారుతాయి.