Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers! FEATURE NEWS
  • యువతను ముంచేస్తున్న ‘కంఫర్ట్ ట్రాప్’..! సౌకర్యాల ఉచ్చు – కలలను మింగేస్తున్న మౌన శక్తి! Comfort Trap Engulfing Youth..! The Snare of Comfort – A Silent Force Devouring Dreams! FEATURE NEWS
  • పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం! PPF Account Holders Get a Big Advantage: Low-Interest Loan Facility Explained FEATURE NEWS
  • ఎస్‌బీఐ ఎఫ్‌డీ: రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో ఎంత లాభమంటే? SBI Fixed Deposit: How Much Will ₹4 Lakh Grow in 5 Years? FEATURE NEWS
  • యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా.. క్షణాల్లో డబ్బు చేతిలోకి! UPI-Based PF Withdrawals: Instant Access to Your Savings! FEATURE NEWS
  • గ్రాట్యుటీ లెక్క మారనుందా.. ఉద్యోగులకు లాభమేనా? Gratuity Rules Set to Change… Gain for Employees? FEATURE NEWS
  • హెడ్‌ ఆఫీస్‌–బ్రాంచీల మధ్య సేవలకు జీఎస్‌టీఏ వ‌ర్తిస్తుందా? GST on Services Between Head Office and Branches? FEATURE NEWS
  • టీవీ మార్కెట్‌కు ధరల షాక్‌.. కొనుగోళ్లకు బ్రేక్‌? TV Market Faces Price Shock… Will Demand Slow Down? FEATURE NEWS
  • ఏమిటీ కార్పొరేట్‌ ఎఫ్‌డీ? రిస్క్ ఉన్నా.. రిటర్న్‌ అధికమేనా? What is a Corporate FD? Despite the Risk, Are the Returns Higher? FEATURE NEWS
  • హోం లోన్ కాదు… గృహ నిర్మాణ రుణంతో సొంతింటి కలను నిజం చేసుకోవ‌చ్చ‌ని తెలుసా? Dreaming of Your Own House? Not Just a Home Loan… Consider a Construction Loan! FEATURE NEWS

కొవిడ్ తరహా భారీ ప్యాకేజీ..! ‘క్రెడిట్ గ్యారెంటీ’ ప‌థ‌కానికి కేంద్రం సిద్ధం .. COVID-Style Mega Package..! Centre Gears Up for ‘Credit Guarantee’ Scheme

Posted on 07/04/2026 By admin No Comments on కొవిడ్ తరహా భారీ ప్యాకేజీ..! ‘క్రెడిట్ గ్యారెంటీ’ ప‌థ‌కానికి కేంద్రం సిద్ధం .. COVID-Style Mega Package..! Centre Gears Up for ‘Credit Guarantee’ Scheme

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి అనిశ్చితి దశలోకి ప్రవేశిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను, వాణిజ్యాన్ని, సరఫరా గొలుసులను ప్రభావితం చేస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల నుంచి రవాణా వ్యయాల పెరుగుదల వరకు ప్రతి అంశం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా సమయంలో తీసుకొచ్చిన విధానాల మాదిరిగానే ఇప్పుడు కూడా భారీ స్థాయిలో క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని(‘Credit Guarantee’) అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

రూ.2.5 లక్షల కోట్ల భారీ స్కీమ్ – ఎవరికోసం? ₹2.5 Lakh Crore Scheme – Who Benefits?
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను(‘Credit Guarantee’) సిద్ధం చేస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌ఎంఈలు (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్), చిన్న వ్యాపారాలు, ఎగుమతి రంగం, యుద్ధ ప్రభావిత పరిశ్రమలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఈ స్కీమ్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. అంటే వ్యాపారులు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే, ప్రభుత్వం 90 శాతం వరకు ఆ బాధ్యతను తీసుకుంటుంది. గరిష్ఠంగా ఒక్క సంస్థకు రూ.100 కోట్ల వరకు ఈ గ్యారెంటీ లభించే అవకాశం ఉంది. ఈ గ్యారెంటీని ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (NCGTC) ద్వారా అమలు చేస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.17,000 నుంచి రూ.18,000 కోట్ల వరకు నిధులను కేటాయించనుంది.

కరోనా పాఠాలు – మళ్లీ అదే మార్గం.. Lessons from COVID – Repeating a Proven Strategy
2020లో కరోనా మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కుదుపుకు గురైంది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’లో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వ్యాపారాలకు 100 శాతం గ్యారెంటీతో రుణాలు అందించారు. బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వం పూర్తిగా హామీ ఇచ్చింది. పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణాలు లభించాయి. దీని వల్ల లక్షలాది చిన్న వ్యాపారాలు నిలదొక్కుకున్నాయి. ఇప్పుడు అదే అనుభవాన్ని ఆధారంగా చేసుకుని కొత్త స్కీమ్‌ను(‘Credit Guarantee’) రూపుదిద్దుతున్నారు. అయితే ఈసారి 100 శాతం కాకుండా 90 శాతం గ్యారెంటీ మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఎంఎస్‌ఎంఈలకు ప్రాణాధారం ఎందుకు? Why MSMEs Need Immediate Support
భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ జీడీపీలో పెద్ద భాగాన్ని ఇవే సమకూరుస్తాయి. కోట్లాది మందికి ఉపాధి కల్పించే రంగం ఇదే. అయితే యుద్ధ ప్రభావం మొదటగా తాకేది ఈ రంగాన్నే. ముడి సరుకుల ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం, ఎగుమతుల్లో అనిశ్చితి – ఇవన్నీ కలిసి చిన్న వ్యాపారాలను కుదేలు చేసే పరిస్థితి తీసుకొస్తాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (‘Credit Guarantee’)ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందితే, వ్యాపారాలు నిలబడటమే కాకుండా, మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

యుద్ధ ప్రభావం – ఎక్కడెక్కడ? Impact of West Asia Conflict – Across Sectors
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా, తయారీ, వ్యవసాయం వంటి అన్ని రంగాలపై వ్యయం పెరుగుతోంది. అదేవిధంగా ఎగుమతులపై కూడా ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేసే రంగాలు ఆర్డర్లు తగ్గడం, చెల్లింపులు ఆలస్యం కావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలకు తక్షణ సహాయం అవసరం. అదే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తోంది.

ఇంధన ధరలపై ప్రభుత్వ చర్యలు.. Government Steps to Control Fuel Impact
యుద్ధ ప్రభావం వల్ల పెరిగిన చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 మేర తగ్గించింది. అలాగే డీజిల్‌పై లీటరుకు రూ.21.50, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై లీటరుకు రూ.29.50 ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచే ప్రయత్నం చేసింది. కీలక పెట్రో కెమికల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని మినహాయించడం ద్వారా తయారీ రంగానికి కొంత ఊరట కల్పించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ హామీ.. Finance Ministry’s Assurance
యుద్ధ ప్రభావిత రంగాలను ఆదుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటామని, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (‘Credit Guarantee’)అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగానికి కొత్త ఉత్సాహం.. Boost for Banking Sector
ఈ స్కీమ్ ద్వారా (‘Credit Guarantee’)బ్యాంకింగ్ రంగానికీ ఊరట లభించనుంది. సాధారణంగా రిస్క్ ఎక్కువగా ఉన్న రంగాలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకంజ వేస్తాయి. కానీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే ఆ భయం తగ్గుతుంది. దీంతో రుణాల పంపిణీ వేగవంతమవుతుంది. వ్యాపారాలకు అవసరమైన నిధులు సులభంగా అందుబాటులోకి వస్తాయి.

భవిష్యత్తు దిశ – స్థిరమైన ఆర్థిక వ్యవస్థ.. Future Outlook – Towards Economic Stability
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తక్షణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, దీర్ఘకాలిక స్థిరత్వానికి కూడా దోహదపడతాయి. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (‘Credit Guarantee’)ద్వారా వ్యాపారాలు నిలబడితే, ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి. వినియోగం పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.

సంక్షోభంలో అవకాశాలు.. Opportunities in Crisis
ప్రతి సంక్షోభం (‘Credit Guarantee’)ఒక అవకాశాన్ని కూడా తీసుకువస్తుంది. కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడినట్లే, ఇప్పుడు కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కంఫర్ట్ జోన్‌లో ఉండకుండా, సవాళ్లను స్వీకరించే వ్యాపారాలకు ఈ పథకం ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వ మద్దతుతో కొత్త దిశగా అడుగులు వేయడానికి ఇదే సరైన సమయం. సంక్షోభం తాత్కాలికం…కానీ సరైన నిర్ణయాలు శాశ్వత మార్పుకు నాంది అవుతాయి.

15
FEATURE NEWS Tags:Boost for Banking Sector, Finance Ministry’s Assurance, Future Outlook – Towards Economic Stability, Government Steps to Control Fuel Impact, Impact of West Asia Conflict – Across Sectors, Lessons from COVID – Repeating a Proven Strategy, Opportunities in Crisis, Why MSMEs Need Immediate Support, ₹2.5 Lakh Crore Scheme – Who Benefits?

Post navigation

Previous Post: యువతను ముంచేస్తున్న ‘కంఫర్ట్ ట్రాప్’..! సౌకర్యాల ఉచ్చు – కలలను మింగేస్తున్న మౌన శక్తి! Comfort Trap Engulfing Youth..! The Snare of Comfort – A Silent Force Devouring Dreams!
Next Post: HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers!

Related Posts

  • డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People! FEATURE NEWS
  • ఒమన్‌తో ఒప్పందం… ఎగుమతులకు ఊతం New Agreement with Oman Boost for Exports! FEATURE NEWS
  • మన్మోహ‌న్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు How did Manmohan affect the country’s economy FEATURE NEWS
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS
  • అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి పసిడి ధర .. తొలిసారిగా ఔన్సు 5000 డాలర్లకు.. రెండేళ్లలోనే ధర రెట్టింపు! Gold Hits Record High Internationally: Price Reaches $5,000 per Ounce for the First Time, Doubles in Two Years! FEATURE NEWS
  • టోల్ ప్లాజా దాటుతున్నారా? ఈ పత్రాలు లేకపోతే క‌ష్ట‌మే! No Valid Documents? Digital System Issues eChallan Instantly FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers!
  • కొవిడ్ తరహా భారీ ప్యాకేజీ..! ‘క్రెడిట్ గ్యారెంటీ’ ప‌థ‌కానికి కేంద్రం సిద్ధం .. COVID-Style Mega Package..! Centre Gears Up for ‘Credit Guarantee’ Scheme
  • యువతను ముంచేస్తున్న ‘కంఫర్ట్ ట్రాప్’..! సౌకర్యాల ఉచ్చు – కలలను మింగేస్తున్న మౌన శక్తి! Comfort Trap Engulfing Youth..! The Snare of Comfort – A Silent Force Devouring Dreams!
  • పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం! PPF Account Holders Get a Big Advantage: Low-Interest Loan Facility Explained
  • ఎస్‌బీఐ ఎఫ్‌డీ: రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో ఎంత లాభమంటే? SBI Fixed Deposit: How Much Will ₹4 Lakh Grow in 5 Years?
  • యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా.. క్షణాల్లో డబ్బు చేతిలోకి! UPI-Based PF Withdrawals: Instant Access to Your Savings!
  • గ్రాట్యుటీ లెక్క మారనుందా.. ఉద్యోగులకు లాభమేనా? Gratuity Rules Set to Change… Gain for Employees?
  • హెడ్‌ ఆఫీస్‌–బ్రాంచీల మధ్య సేవలకు జీఎస్‌టీఏ వ‌ర్తిస్తుందా? GST on Services Between Head Office and Branches?
  • టీవీ మార్కెట్‌కు ధరల షాక్‌.. కొనుగోళ్లకు బ్రేక్‌? TV Market Faces Price Shock… Will Demand Slow Down?
  • ఏమిటీ కార్పొరేట్‌ ఎఫ్‌డీ? రిస్క్ ఉన్నా.. రిటర్న్‌ అధికమేనా? What is a Corporate FD? Despite the Risk, Are the Returns Higher?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Geopolitical Tensions How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Market Expansion New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • Is power sector stocks are good..? ప‌వ‌ర్ సెక్టార్ స్టాక్స్‌లో పెట్టుబ‌డులు లాభ‌మేనా..? MARKET
  • charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం… FEATURE NEWS
  • పశ్చిమాసియాలో మంట‌లు.. ప్రపంచమంతటా ప్రకంపనలు.. Blazing West Asia, Tremors Across the World FEATURE NEWS
  • లోన్ అనేది బతకడానికి కాదు.. ఎదగడానికి! Loans: Not for Surviving… But for Growing! FEATURE NEWS
  • కొత్త ఆర్థిక సంవత్సరం.. మధ్యతరగతి ముందున్న కొత్త సవాళ్లు.. New Financial Year.. New Challenges for the Middle Class FEATURE NEWS
  • what are position opening, square off, short selling? పొజిష‌న్ ఓపెనింగ్‌, స్కేర్ ఆఫ్‌, షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి..? MARKET
  • మళ్లీ పెరిగిన‌ బంగారం ధర …Gold Prices Rise Again FEATURE NEWS
  • కుటుంబానికి ఆర్థిక భ‌రోసా కల్పిస్తున్నారా! Are You Truly Providing Financial Security to Your Family? FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme