ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితంలో బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనం బ్యాంకులో డబ్బులు సేవ్ చేసుకుంటాం. లోన్స్ తీసుకుంటాం. క్రెడిట్ కార్డులు తీసుకుంటాం. ఇంకా బ్యాంకుల ద్వారానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇక రోజు మనం చేసే ఫోన్ పే, google పే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. అయితే బ్యాంకులు అనేవి సేవా దృక్పథం కలిగి ఉంటాయని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే.
ప్రతీ బ్యాంకు కూడా చేసేది బిజినెస్. బ్యాంకు టార్గెట్ కూడా ప్రతి సంవత్సరం తమ ప్రాఫిట్స్ ను పెంచుకోవడమే. ఆ ప్రయత్నంలో భాగంగానే బ్యాంకులు చాలా విషయాల్ని (Be careful in Banks) కస్టమర్ల దగ్గర దాస్తూ ఉంటాయి. దానివల్ల చాలా మంది తమ ఫైనాన్షియల్ జర్నీలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తమ డబ్బును తమ సమయాన్ని దాంతో పాటు తమ మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు. బ్యాంకుల ఎజెండా అనేది అందరికీ ఒక రకంగానే ఉంటుంది. అది మనిషి మనిషికీ మారదు.
బ్యాంకులు మీకు చెప్పని విషయాలు
Things Banks Won’t Tell You
బ్యాంకులో పని చేసేవారు సేల్స్ పీపుల్. బ్యాంకులో పనిచేసే ఆఫీసర్, రిప్రెజెంటేటివ్ తదితరులు మీకు వారి బ్యాంకుకు సంబంధించిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఆఫర్ చేస్తారు. అది ఇన్సూరెన్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్, క్రెడిట్ కార్డు, డిమాట్ అకౌంట్ కావచ్చు. మీకు వేరే ఆప్షన్స్ ఇవ్వరు. వేరే బ్యాంకు కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీకు తగిన విధంగా ఉన్నప్పటికీ వాటి గురించి అస్సలు చెప్పరు. ఒకవేళ మీరు అడిగినా కూడా అవి వేస్ట్ ప్రొడక్ట్స్ అనే చెప్తారు. ఎందుకంటే వారు తమ బ్యాంకు ప్రొడక్ట్స్ గాని సర్వీసెస్ గాని అమ్మడం వల్ల బ్యాంకు వారికి ఇన్సెంటివ్స్, రిఫరల్ కమిషన్స్ ఇస్తూ ఉంటుంది.
– సూటిగా చెప్పాలంటే బ్యాంకులు మీ రిక్వైర్మెంట్ కు తగిన విధంగా ప్రొడక్ట్స్ ఆఫర్ చేయవు. వారి రిక్వైర్మెంట్ కు తగిన విధంగా మీకు ఆఫర్ చేస్తూ ఉంటాయి. అంటే మీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ గాని.. గోల్స్ గాని బ్యాంకులు పట్టించుకోవు.
ఖాతాదారుని బట్టే వడ్డీ రేట్లు
* హోమ్ లోన్ వడ్డీ రేట్లు బ్యాంకు ఖాతాదారుని బట్టి మారుతాయి. ఇది బ్యాంకులు ఎవరికీ చెప్పని ఒక పెద్ద గండికోట రహస్యం. మీరు నాలుగు సంవత్సరాల కిందట బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. ఈ సంవత్సరం మీ హోమ్ లోన్ వడ్డీ రేటు 9% గా ఉంది . ఇప్పుడు మీరు ఇంకొక స్థలంలో ఇల్లు కట్టాలని బ్యాంకుకి వెళ్లి తిరిగి హోమ్ లోన్ కోసం అప్లై చేస్తే .. 8.5% వడ్డీ రేటుకు హోమ్ లోన్ ఇస్తామని చెప్తారు. అయితే మా పాత లోన్ కి కూడా 8.5% వడ్డీ రేటుకు మార్చమని కోరుతారు. కానీ అది కొత్త లోన్స్ కు మాత్రమే వర్తిస్తుంది. పాత లోన్స్ కు వర్తించదని బ్యాంకు వాళ్ళు చెప్తారు. జనరల్ గా హోమ్ లోన్స్, ప్లాట్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ వడ్డీ రేట్ల విషయంలో మీరు నెగోషియేట్ చేయొచ్చు. వేరే బ్యాంకు హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటానుని మీరు చెబితే ఈ పని చాలా సులువు అవుతుంది . ఈసారి మీరు బ్యాంకు కి వెళ్లి ట్రై చేయండి. కచ్చితంగా మీ పని అవుతుంది. మీరు ఒక బ్యాంకు లాంగ్ టర్మ్ కస్టమర్ అయి ఉన్నా, లేదంటే హై వాల్యూ కస్టమర్ అయి ఉన్నా కూడా ప్రతి ఒక్క లోన్ విషయంలో, క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్ లాంటి వడ్డీల విషయంలో కూడా నెగోషియేషన్ చేయవచ్చు.
అనవసర పాలసీలు
Unnecessary policies
బ్యాంకులు పనికిరాని ఇన్సూరెన్స్ పాలసీలను అంటగడతాయి. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి హోమ్ లోన్ తీసుకున్నాడు , బ్యాంకు ఏం చెప్పిదంటే.. దాంతో పాటు కచ్చితంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలని. దీంతో గత్యంతరం లేక రమేష్ పాలసీ తీసుకున్నాడు(Be careful in Banks). కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి పర్సనల్ ఫైనాన్స్ పై కొంత అవగాహన పెరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే తక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కు చాలా ఎక్కువ ప్రీమియం కడుతున్నానని గ్రహించాడు.
చాలా బ్యాంకులు ఏం చెబుతున్నాయంటే.. హోమ్ లోన్ తీసుకుంటే.. వారి దగ్గరే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని కండిషన్ పెడుతున్నాయి. 10 సంవత్సరాలు ప్రీమియం కట్టి వదిలేస్తే 20 సంవత్సరాలు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుందని చెబుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఎక్కువ ఉండే ఉద్యోగులకు కూడా యూలిప్స్ అంటకడుతున్నాయి. కొన్ని బ్యాంకుల్లో బిజినెస్ లోన్ వస్తే.. 10% ఇంట్రెస్ట్ రేట్ తో పాటు 2% ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టి ₹50,000 ప్రీమియం కూడా వసూలు చేస్తున్నారు.
క్రెడిట్ కార్డులతో ఉచ్చు
బ్యాంకులు తమ బిజినెస్ స్టార్ట్ చేసేది క్రెడిట్ కార్డ్స్ తోనే . అందుకే ఖాతాదారులకు ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అంటగడుతుంటాయి. బ్యాంకులు సంవత్సరానికి 24% నుంచి 48% వరకు వడ్డీ వసూలు చేస్తుంటాయి. అంతే కాకుండా ఇంకా వడ్డీ మీద వడ్డీ వేస్తుంటాయి. లేట్ ఫీ కూడా వసూలు చేస్తాయి. క్రెడిట్ కార్డు నుంచి క్యాష్ డ్రా చేస్తే కస్టమర్ దగ్గర నుండి భారీగా వసూలు చేస్తాయి. బ్యాంకులకు ఇవన్నీ లాభాలు. అందుకే క్రెడిట్ కార్డులు తీసుకోమని వెంటపడతాయి.
– లైఫ్ టైం ఫ్రీ అనగానే మనకు పోయేది ఏమి లేదు కదా అని చాలా మంది క్రెడిట్ కార్డులు వాటిని తీసుకుంటారు. వాటి చార్జీలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ గాని ఎవ్వరూ చదవరు. కానీ ఇవన్నీ చూసుకుంటే మనకు చాలా నష్టం అనే విషయం అవగతం అవుతుంది.
ఉదాహరణకు రమణ అనే వ్యక్తి ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు తీసుకున్నాడు.. రెన్యూవల్ ఫీ అని చెప్పి ₹500 వసూలు చేశారు. ఈ క్రమంలో ఒకసారి పేమెంట్ మిస్ అయింది. అంతే ₹1000 లేట్ ఫీజు, ఇంకా అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద 36% వడ్డీని ముక్కపిండి వసూలు చేశారు. మన దేశంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ కాబట్టి క్రెడిట్ కార్డ్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తూ ఉంది.

బ్యాంకులో వేసే చార్జీలు అనేకం
* బ్యాంకులు చాలా ఛార్జీలను మీకు తెలియజేయవు. మెయింటైన్స్ ఫీజు , ఏటీఎం విత్ డ్రాల్ ఫీజు , ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీలు వసూలు చేస్తుంటాయి. పాస్‌బుక్‌లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ₹200 నుండి ₹500 వరకు చార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి. ఇక లోన్స్ విషయానికి వస్తే .. ప్రాసెసింగ్ ఫీజు , ప్రీ పేమెంట్ పెనాల్టీస్, ఇంకా ఇతర చార్జీలు గురించి చెప్పరు.
– ఉదాహరణకు మమత అనే వ్యక్తి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంది. 20 సంవత్సరాల కోసం 8.5% వడ్డీ రేట్ తో అప్పుడు ఆమె దగ్గర నుండి 1% ప్రాసెసింగ్ ఫీజు అంటే ₹30000 వసూలు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఆ లోన్ ను క్లోజ్ చేసింది. అప్పుడు ఆమె దగ్గర నుండి 2% ప్రీ పేమెంట్ పెనాల్టీ అంటే ₹60000 వసూలు చేశారు. బ్యాంకులు చేస్తున్న ఇంకొక మోసం ఏంటంటే జీరో కాస్ట్ ఈఎంఐ లు. వస్తువుల్ని కొన్నప్పుడు కంపెనీలు వడ్డీని డిస్కౌంట్ రూపంలో ముందే ఇస్తుంటాయి. ఆ తర్వాత మనం బ్యాంకుకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అందువల్ల మనకు వడ్డీ జీరో అవుతుంది కదా అని అనుకుంటాం. కానీ ఆ వడ్డీ పై జీఎస్టీ వేస్తారన్న విషయం ఏ బ్యాంకు కూడా మీకు చెప్పదు.
వారికి లాభాలనిచ్చే ప్రోడక్ట్స్‌ని అంటగట్టడం
బ్యాంకులు మీకు లాభాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ గాని పుష్ చేయవు. వారికి లాభాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ గురించి మాత్రమే చెబుతుంటాయి. ఉదాహరణకు యూలి ప్స్, ఎండోమెంట్ ప్లాన్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్. ఇలాంటి వాటిని మీకు అవసరం లేకపోయినా సాధ్యమైనంత వరకు మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎందుకంటే వీటిల్లో బ్యాంకులకు కమిషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కమిషన్ తీసుకున్నా కూడా మీకు సర్వీస్ మాత్రం సరిగ్గా ఉండదు.
– ఉదాహరణకు మీరు బ్యాంకు ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వారు మీకు రెగ్యులర్ ఫండ్స్ ఆఫర్ చేస్తారు. అంతే కాకుండా ఆ ఫండ్ అనేది మీ అవసరాలకు సరైనదో కాదో, మీకు ఎంత వరకు అది రిటర్న్ ఇస్తుందో అనేది పట్టించుకోరు. పోనీ మీకు ఏదైనా సందే హం వచ్చి వారిని అడిగినా వారు స్పందించరు. నిజం చెప్పాలంటే వారికే వాటిపై సరైన అవగాహన ఉందడు. ఇదంతా పక్కన పెడితే చాలా మంది ఆటో డెబిట్ సెట్ అప్ చేసుకుంటారు ఫలానా డేట్ కు మీ అకౌంట్ లో డబ్బులు లే కపోతే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎటువంటి పెనాల్టీ వేయదు కానీ బ్యాంకు మాత్రం ఇన్ సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పి 25 శాతం చార్జ్ వసూలు చేస్తుంది. దీని గురించి కూడా బ్యాంకులు ముందుగా మనకు చెప్పవు.
క్రెడిట్ స్కోర్ గురించి చెప్పకపోవడం
ఏ బ్యాంకు కూడా క్రెడిట్ స్కోర్ గురించి వివరించదు. సిబిల్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు.. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఏ బ్యాంకు చెప్పదు. ఎందుకంటే బ్యాంకులు మునిగే వాడిని ఇంకా ముంచుతాయి. తేలే వారిని ఇంకా పైకి తీసుకొస్తాయి. మీకు సిబిల్ స్కోరు 820 ఉందనుకోండి.. 10% వడ్డీకే లోన్ ఇస్తారు. ఇంకొక అతనికి 700 సివిల్ స్కోర్ ఉందనుకోండి అతనికి 13% వడ్డీ తో లోన్ ఇస్తారు. ఇంత లాభం వస్తున్నప్పుడు బ్యాంకులు సిబిల్ స్కోర్ గురించి ఎందుకు ఎడ్యుకేట్ చేస్తాయి మరి?
* ఒకసారి బ్యాంకుకు మీ డబ్బు చేరిన తర్వాత అది ఎక్కడికి పోతుందన్న విషయం గురించి బ్యాంకులు మీకు చెప్పవు. అయితే ఆ డబ్బులను వారు వేరే వారికి లోన్స్ రూపంలో ఇస్తారు. ఆ లోన్‌లపై సుమారు 10,11 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. కానీ మీరు డిపాజిట్ చేసిన డబ్బుకు మాత్రం కేవలం 4 శాతం, అంతకన్నా తక్కువ వడ్డీని ఇస్తుంటాయి. అంతే కాకుండా మీ డబ్బుతో బ్యాంకులు ఇంకొక పని కూడా చేస్తాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో, స్టాక్ మార్కెట్‌లో ని చాలా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి.
* బ్యాంకులు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను రకరకాల కంపెనీలకు అమ్ముకుంటాయి (Be careful in Banks). అందుకే మీకు రోజూ లోన్స్ పేరిట ఫోన్లు వస్తుంటాయి. ఈ ఇబ్బందులు ఉండకూడదంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వారికి ముందే ఒక హెచ్చరిక చేయండి . నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరికైనా ఇస్తే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పండి.
* బ్యాంకులు మీకు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని. అయితే వాటికి టాక్స్ లు ఎలా పడతాయి, ఇన్ఫ్లేషన్ ప్రభావం రిటర్న్స్ పై ఎలా ఉంటుంది, ఎఫ్ డీ ని ముందుగానే బ్రేక్ చేస్తే పెనాల్టీ ఎంత కట్టాలి.. అన్న విషయాలను బ్యాంకులు ముందుగా చెప్పవు. ఉదాహరణకు కుమార్ అనే వ్యక్తి ఒక బ్యాంకులో ₹5 లక్షలు ఐదు సంవత్సరాల కోసం ఎఫ్ డీ చేశాడనుకుందాం. 6.5% వడ్డీ చొప్పున ఐదేళ్ల తర్వాత అతనికి వచ్చిన వడ్డీ ఎంత అంటే ₹182000. ఇన్ఫ్లేషన్ 6% లెక్కిస్తే అతడికి వచ్చేది 0.5% వడ్డీ మాత్రమే. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అతడు 30% ఇన్కమ్ టాక్స్ స్లాబ్ లో ఉన్నాడు. అంటే అతడికి చివరికి వచ్చే రిటర్న్స్ అనేది మైనస్ లో ఉన్నట్టే. ఇది సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లకు కూడా వర్తిస్తుంది.
ఫిర్యాదు చేయొచ్చు.. You Can File a Complaint
మీకు బ్యాంకు గురించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుండి బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ దాకా మీరు మీ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రీ సర్వీస్. కాబట్టి అందరూ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఈ విషయం కూడా ఏ బ్యాంకు మీకు చెప్పదు.
