జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇలాంటి సమయంలో భవిష్యత్తు భద్రత కోసం ఇన్సూరెన్స్ చాలా అవసరం. బీమా అనేది.. అనుకోని ప్రమాదాలు, వ్యాధులు లేదా ఆకస్మిక మరణం వంటి సంఘటనల వల్ల కుటుంబానికి కలిగే ఆర్థిక నష్టానికి సంరక్షణ ఇచ్చే పద్ధతి. ఒక వ్యక్తి ప్రతి నెలా లేదా సంవత్సరానికి ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తాడు. దానికి ప్రతిగా ఆ కంపెనీ, ఆ వ్యక్తికి ప్రమాదం జరిగితే లేదా మరణించిన తర్వాత కుటుంబానికి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ అనేది కేవలం పెట్టుబడి కాదు… భద్రతకు బీమా.
ముఖ్యమైన ఇన్సూరెన్స్ లు.. Important Insurance Plans
జీవిత బీమా (Life Insurance): మరణం తర్వాత కుటుంబానికి భద్రత.
ఆరోగ్య బీమా (Health Insurance): ఆసుపత్రి ఖర్చుల నుంచి రక్షణ.
వాహన బీమా (Vehicle Insurance): వాహన ప్రమాదాల సమయంలో నష్టం తగ్గిస్తుంది.
ప్రాపర్టీ బీమా (Property Insurance): అగ్ని, దొంగతనం లేదా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ.
ఎలా తీసుకోవాలి? How to Buy?
– మీ కుటుంబ బాధ్యతలు, ఆదాయం, భవిష్యత్ అవసరాలను బట్టి ఏ రకమైన ఇన్సూరెన్స్ అవసరమో నిర్ణయించాలి.
-మార్కెట్లో LIC, HDFC Life, ICICI Prudential, SBI Life, Max Life వంటి అనేక కంపెనీలు ఉన్నాయి. వీటి ఆఫర్లు, ప్రీమియం, బెనిఫిట్స్ పోల్చి సరైనది ఎంచుకోవాలి.
-ఇప్పుడు చాలా కంపెనీలు ఆన్లైన్లోనే పాలసీలు అందిస్తున్నాయి. అలాగే అనుభవజ్ఞులైన ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా కూడా కొనవచ్చు.
– ఆధార్, పాన్, ఫోటో, చిరునామా రుజువు వంటి పత్రాలు అవసరం. పాలసీ తీసుకునే ముందు Terms & Conditions తప్పనిసరిగా చదవాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు – ఆరోగ్యానికి ఆర్థిక కవచం
Health Insurance Policies – Financial Shield for Your Health!
ఇటీవలి కాలంలో వైద్య ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిన్న జ్వరం నుంచి పెద్ద ఆపరేషన్ వరకు ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య భీమా అనేది ప్రతి కుటుంబానికి అవసరమైపోయింది. ఒక్క అనారోగ్యం వస్తే పొదుపులు ఖాళీ కావడం సహజమే. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్యానికి ఆర్థిక భరోసా అని చెప్పవచ్చు. ఆసుపత్రి ఖర్చులు, శస్త్రచికిత్సలు, ఔషధ వ్యయాలు, వైద్య పరీక్షల ఖర్చులు వంటి వాటికి భీమా సంస్థ నుండి ఆర్థిక సహాయం పొందే పథకమే హెల్త్ ఇన్సూరెన్స్. పాలసీదారు చెల్లించే ప్రీమియం ఆధారంగా కంపెనీ ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది లేదా నేరుగా ఆసుపత్రికి చెల్లిస్తుంది (cashless facility). ఆరోగ్య భీమా చిన్న వయసులోనే తీసుకుంటే ప్రీమియం తక్కువగా, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ ప్రీమియం పెరుగుతుంది, అలాగే కొన్ని వ్యాధులకు కవరేజ్ ఆలస్యంగా లభిస్తుంది. నేటి రోజుల్లో ఆరోగ్య భీమా విలాసం కాదు – అవసరం. ఒక చిన్న ప్రమాదం కూడా వేలల్లో, లక్షల్లో ఖర్చు అయ్యే పరిస్థితి. అందుకే, సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అంటే కుటుంబానికి ఆర్థిక రక్షణ కవచం అందించడమే.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు
Precautions to Take Before Buying Health Insurance
పాలసీ Terms & Conditions తప్పనిసరిగా చదవాలి.
ఆసుపత్రుల కాష్‌లెస్ నెట్వర్క్ ఎంత ఉందో చూసుకోవాలి.
ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు వేటింగ్ పీరియడ్ తెలుసుకోవాలి.
క్లెయిమ్ ప్రాసెస్ సులభమా కాదా అని చెక్ చేయాలి.
2025లో టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు
Top Health Insurance Policies in 2025
ఆప్టిమా రిస్టోర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ HDFC ERGO Optima Restore
సూపర్ రిస్టోర్ బెనిఫిట్ (సమయం పూర్తవకముందే కవరేజ్ మళ్లీ యాక్టివ్ అవుతుంది)
10 లక్షల నుండి 1 కోటి వరకు ఇన్సూరెన్స్ సొమ్ము
ఆరోగ్య చెకప్ ప్రతి ఏడాది ఉచితం
కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ (రిలిగేర్) ప్లాన్ Care Health Insurance (Religare)
కుటుంబం మొత్తానికి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్
ఆసుపత్రి ఖర్చులు, ఐసీయూ ఛార్జీలు పూర్తి కవరేజ్
ఫ్రీ హెల్త్ చెకప్, ట్యాక్స్ బెనిఫిట్లు
నివా బుపా (మాక్స్ బుపా) హెల్త్ కంపానియన్ ప్లాన్ Niva Bupa (Max Bupa) Health Companion
ప్రీమియం తక్కువ, కవరేజ్ ఎక్కువ
కాష్‌లెస్ హాస్పిటల్ సదుపాయం దేశవ్యాప్తంగా
లైఫ్‌లాంగ్ రీన్యువల్ అవకాశం
ICICI లాంబార్డ్ హెల్త్ కేర్ ప్లస్ ప్లాన్ ICICI Lombard Health Care Plus
పెద్ద వయసు వారికీ సరైన ఆప్షన్
ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు త్వరగా కవరేజ్
కస్టమర్ సర్వీస్‌లో విశ్వసనీయత
స్టార్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా (Star Health Family Health Optima)
ఒకే పాలసీతో మొత్తం కుటుంబానికి రక్షణ
కాష్‌లెస్ నెట్వర్క్ ఆసుపత్రులు ఎక్కువ
కొత్తగా పుట్టిన శిశువుకు కూడా కవరేజ్
ఆరోగ్య భీమా ఎందుకు? Why Health Insurance?
ఇటీవలి సంవత్సరాల్లో వైద్య సేవల ఖర్చులు 30% వరకు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఒక సాధారణ ఆపరేషన్ కూడా పది–పదిహేను లక్షలు ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపులు ఒక్క సారి ఖాళీ కావచ్చు.అందుకే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే “ఆరోగ్య సమస్య వచ్చినా మనసుకు ప్రశాంతత, కుటుంబానికి భద్రత” అని భావించవచ్చు. చాలా కంపెనీలు 5 నుండి 10 లక్షల వరకు కవరేజ్ అందిస్తాయి. కొన్ని పాలసీలు 1 కోటి వరకు సొమ్ము భీమా కూడా ఇస్తున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ రిస్క్‌ను బట్టి ప్రీమియం నిర్ణయిస్తాయి. వయసు పెరిగేకొద్దీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ప్రీమియం కూడా రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, 30 ఏళ్ల వయసులో ₹10 లక్షల హెల్త్ పాలసీకి సంవత్సరానికి ₹8,000 ఉంటే 50 ఏళ్ల వయసులో అదే పాలసీకి ₹20,000–₹25,000 వరకు చెల్లించాల్సి వస్తుంది.
పన్ను ప్రయోజనాలు కూడా
ఆరోగ్య భీమా తీసుకున్నవారికి Income Tax Act 80D కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
అంటే ఆరోగ్య రక్షణతో పాటు పన్ను ఆదా కూడా. 2025 సెప్టెంబర్ 22 నుండి వ్యక్తిగత ఆరోగ్య భీమా ప్రీమియంపై 18% జీఎస్టీ పూర్తిగా తొలగించబడింది.
సరైన పాలసీ ఎంచుకోవడం ఎలా? How to Choose the Right Policy?
పాలసీ తీసుకునే ముందు Terms & Conditions చదవాలి.
ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు వేటింగ్ పీరియడ్ ఎంత ఉందో తెలుసుకోవాలి.
కాష్‌లెస్ నెట్వర్క్ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి.
క్లెయిమ్ ప్రాసెస్ సులభతను పరిశీలించాలి.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేయకూడని తప్పులు
Mistakes to Avoid in Health Insurance
– పాలసీని అర్థం చేసుకోకుండా తీసుకోవడం
– తక్కువ ప్రీమియం కోసం కవరేజ్ తగ్గించడం
– ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులు దాచిపెట్టడం
– వేటింగ్ పీరియడ్ తెలియకపోవడం
– కాష్‌లెస్ హాస్పిటల్స్ లిస్ట్ చూడకపోవడం
– ఫ్యామిలీ అవసరాలకు సరిపడే ప్లాన్ ఎంచుకోకపోవడం
– రీన్యువల్ మర్చిపోవడం
– క్లెయిమ్ ప్రాసెస్ తెలియకపోవడం
ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు వేటింగ్ పీరియడ్
Waiting Period for Pre-Existing Diseases
డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉన్నవారికి సాధారణంగా 2–4 సంవత్సరాల వేటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ కాలం పూర్తయ్యే వరకు ఆ వ్యాధులకు కవరేజ్ రాదు. అందుకే చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే ఆ వేటింగ్ పీరియడ్ పూర్తయిపోయి, తరువాత పూర్తి రక్షణ లభిస్తుంది.
కనీసం 10 లక్షల కవరేజ్…Minimum Coverage of ₹10 Lakh
ఇన్సూరెన్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కనీసం ₹10 లక్షల కవరేజ్ ఉన్న హెల్త్ పాలసీ తీసుకోవడం ఉత్తమం.పెద్ద నగరాల్లో నివసించే వారు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నవారు అయితే ₹15–₹20 లక్షల వరకు తీసుకోవడం మంచిది. కుటుంబ భీమా (Family Floater)లో ఈ మొత్తం మరింత అవసరం.
కుటుంబ పరిమాణం ఆధారంగా నిర్ణయం
ఒకరికి మాత్రమే: ₹5–₹10 లక్షలు సరిపోతుంది
భార్యాభర్తలు ఇద్దరికీ: ₹10–₹15 లక్షల కవరేజ్
నాలుగు మంది కుటుంబం: ₹15–₹25 లక్షలు ఉత్తమం
వృద్ధ తల్లిదండ్రులు కలిపి: కనీసం ₹25 లక్షల కవరేజ్ అవసరం
