Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge

Posted on 04/03/2026 By admin No Comments on చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge

ప్రపంచం మొత్తం ఒకే సారి ఉలిక్కిపడిన సందర్భాలు చరిత్రలో చాలా అరుదు. అలాంటి సందర్భాల్లో చమురు (Oil Turmoil) ఒకటి. ఎక్కడో ఒక మూల యుద్ధం మొదలైతే… దాని ప్రభావం నేరుగా మన జేబులపై పడుతుంది. నిన్న మొన్నటివరకు వార్తలకే పరిమితమైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. వెనెజువెలా వంటి ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంపై అమెరికా చర్యలు పెద్దగా కదలిక రేపలేదు. కానీ ఇరాన్‌పై దాడి, హోర్ముజ్‌ జలసంధి మూసివేత వార్త రాగానే ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా గుబురుగా మారాయి. ఇదే ప్రశ్నను ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు…

చమురు అంటే కేవలం ఇంధనం కాదు.. Oil Is More Than Fuel
చమురు (Oil Turmoil)అనేది కేవలం వాహనాల్లో వేసే ఇంధనం మాత్రమే కాదు. అది దేశాల మధ్య రాజకీయ ఆయుధం. ఆర్థిక వ్యవస్థలకు ప్రాణవాయువు. ఒక దేశ బడ్జెట్‌ నుంచి సామాన్యుడి వంటింటి ఖర్చు వరకు అన్నింటినీ ప్రభావితం చేసే శక్తి చమురుకే ఉంది. అందుకే అంతర్జాతీయ రాజకీయాల్లో చమురు ప్రవాహం నిలిచిపోతుందన్న సంకేతం వచ్చిన క్షణంలోనే మార్కెట్లు గజగజలాడతాయి. వెనెజువెలా ఉదాహరణ దీనికి స్పష్టమైన నిదర్శనం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం అయినా, అక్కడి రాజకీయ అస్థిరత, పాతబడిపోయిన సాంకేతికత, అంతర్జాతీయ ఆంక్షలు… ఈ అన్నింటి వల్ల ఆ దేశం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించలేకపోతోంది. అందుకే అక్కడ ఏం జరిగినా మార్కెట్లు పెద్దగా స్పందించవు.

ఒపెక్‌ దేశాలే ప్రపంచ చమురు జీవనాడి.. OPEC – The Nerve Centre of Oil World
ప్రపంచ చమురు (Oil Turmoil)మార్కెట్‌ను నిజంగా శాసించేది ఒపెక్ దేశాలే. మధ్యప్రాచ్యంలోని ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వంటి గల్ఫ్‌ దేశాలతో పాటు వెనెజువెలా, ఆఫ్రికాలోని కొన్ని చమురు దేశాలు కలసి ఏర్పడిన ఈ సమాఖ్య… ఉత్పత్తి తగ్గిస్తే ధరలు పెరుగుతాయి, పెంచితే ధరలు పడిపోతాయి. అంతటి ప్రభావం వీరిది. ఇక రష్యాను కలుపుకొని మాట్లాడితే ఇవే OPEC+ దేశాలు. ప్రపంచ చమురు నిల్వల్లో, ఉత్పత్తిలో, ఎగుమతుల్లో మెజారిటీ వాటా వీరిదే. ప్రపంచంలో ఉన్న సుమారు 1.7 ట్రిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వల్లో ఎక్కువ భాగం ఈ దేశాల చేతుల్లోనే ఉంది.

నిల్వలే కాదు… ఉత్పత్తే అసలు శక్తి.. Production Matters More Than Reserves
సాధారణంగా మనం ఒక అపోహలో ఉంటాం. “ఎక్కువ నిల్వలున్న దేశమే శక్తివంతం” అని. కానీ వాస్తవం అది కాదు. ఎంత చమురు(Oil Turmoil) నేల కింద ఉందన్నదానికంటే… రోజుకు ఎంత చమురు బయటకు తీస్తున్నారన్నదే అసలు విషయం. వెనెజువెలాలో 300 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిల్వలున్నా… అక్కడి చమురు ‘హెవీ క్రూడ్’. దాన్ని వెలికితీయడానికి ఖర్చు ఎక్కువ, సాంకేతికత కష్టం. పైగా రాజకీయ సంక్షోభం, ఆంక్షలు కలిసి ఉత్పత్తిని దెబ్బతీశాయి. అందుకే ప్రపంచ మార్కెట్‌పై అక్కడి ప్రభావం పరిమితం. దీనికి పూర్తి భిన్నంగా అమెరికా ఉంది. నిల్వల పరంగా తొమ్మిదో స్థానంలో ఉన్నా, ఆధునిక సాంకేతికతతో భూగర్భ పొరల నుంచి షేల్ ఆయిల్‌ను వెలికితీస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలుస్తోంది.

ఇరాన్‌ దగ్గరే అసలు నాడి.. Why Iran Triggers Panic
ఇరాన్‌ చమురు (Oil Turmoil)నిల్వల పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. కానీ దాని ప్రాధాన్యం నిల్వల వల్ల కాదు. భౌగోళిక స్థానం వల్ల. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు వెళ్లే మార్గం… హోర్ముజ్ జలసంధి. ఈ జలసంధి మూసివేస్తే… సౌదీ అరేబియా, ఇరాక్‌, కువైట్‌, యూఏఈ నుంచి బయల్దేరే చమురు నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలి. అంటే ప్రయాణ దూరం పెరుగుతుంది. సమయం పెరుగుతుంది. బీమా ఖర్చులు పెరుగుతాయి. చివరికి ఆ భారమంతా వినియోగదారుడిపై పడుతుంది. ఇరాన్‌పై దాడి జరిగిన క్షణమే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఒక్కసారిగా 83 డాలర్లకు చేరింది. కొన్ని వారాల క్రితం వరకు 70 డాలర్ల దిగువనే ఉన్న ధరలు… యుద్ధ భయంతో ఒక్కసారిగా ఎగబాకాయి.

వెనెజువెలా దాడి… ఎందుకు ప్రభావం లేదు? Why Venezuela Didn’t Shake Markets?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు (Oil Turmoil)ఉన్న దేశం వెనెజువెలా. అయినా అక్కడి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్‌ను ఎందుకు కదిలించలేకపోయాయి? కారణం చాలా స్పష్టం. వెనెజువెలా ఇప్పటికే అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించడం లేదు. ఉత్పత్తి తక్కువ. ఎగుమతులు పరిమితం. పైగా అక్కడి చమురు ఎక్కువగా అమెరికాకు వెళ్లేది. ఆ సరఫరా తగ్గినా ప్రపంచ మార్కెట్‌కు ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి. ఇరాన్‌ విషయంలో అలా కాదు. ఇరాన్‌ నేరుగా సరఫరా చేయకపోయినా… ఆ దేశం ఉన్న భౌగోళిక స్థానం వల్ల మొత్తం పశ్చిమాసియా చమురు ప్రవాహాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంది.

భారత్‌కు ఎంత ప్రమాదం? India’s Risk Exposure
భారత్‌కు అవసరమైన చమురులో (Oil Turmoil)దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోనూ 35 నుంచి 50 శాతం చమురు హోర్ముజ్‌ మార్గంలోనే వస్తుంది. కాబట్టి అక్కడ ఏ చిన్న అడ్డంకి ఏర్పడినా… భారత్‌ ఖర్చులు పెరగడం ఖాయం. అయితే ఇప్పటివరకు భయపడాల్సిన పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కారణం… భారత్‌ ముందస్తుగా ఏర్పాటుచేసుకున్న వ్యూహాత్మక చమురు నిల్వలు.

భూగర్భ రక్షణ కవచం.. Strategic Petroleum Reserves
యుద్ధాలు, సంక్షోభాల సమయంలో ఉపయోగించేందుకు భారత్‌ భూగర్భంలో భారీ చమురు(Oil Turmoil) నిల్వలను నిర్మించింది. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో ఉన్న ఈ నిల్వలు దాదాపు 9.5 రోజుల అవసరాలకు సరిపోతాయి. ఇవే కాకుండా చండిఖోల్‌, బికనేర్‌ వంటి కొత్త కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న కమర్షియల్ నిల్వలు కలిపితే… మొత్తం 74 నుంచి 80 రోజుల వరకు దేశానికి ఇంధన భద్రత ఉంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? Will Fuel Prices Rise?
అంతర్జాతీయంగా చమురు (Oil Turmoil)ధరలు పెరిగినా… దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే పెరిగే అవకాశాలు తక్కువ. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఆ సమయంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినా… దేశంలో తగ్గించలేదు. చమురు కంపెనీలు అప్పట్లో తమ మార్జిన్లను పెంచుకున్నాయి. ఇప్పుడు ధరలు పెరిగినా… ఆ భారాన్ని వినియోగదారుడిపై మోపకూడదన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. కొంత నష్టం వచ్చినా ఆయిల్ కంపెనీలే భరించే అవకాశం ఉంది.

యుద్ధాలు మారతాయి… చమురు రాజకీయం మారదు.. Oil Politics Never Changes
ప్రపంచంలో యుద్ధాలు కొత్తవి కావు. కానీ ప్రతి యుద్ధం ఒకేలా ఉండదు. చమురు నిల్వలు (Oil Turmoil)ఉన్న దేశం కంటే… చమురు ప్రవాహాన్ని నియంత్రించే దేశమే అసలు కీలకం. అందుకే వెనెజువెలా ఘటన మార్కెట్‌ను కదిలించలేకపోయింది. ఇరాన్‌ మాత్రం ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. ఈ ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. హోర్ముజ్‌ తెరుచుకుంటే ధరలు కాస్త తగ్గవచ్చు. కానీ యుద్ధ భయాలు కొనసాగితే… చమురు ధరల ఊగిసలాట కూడా కొనసాగడం ఖాయం.సాధారణ వినియోగదారుడికి ఇప్పటికైతే పెద్ద దెబ్బ పడకపోవచ్చు. కానీ ప్రపంచ రాజకీయాల్లో చమురు రాజకీయం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే…చమురు కదిలితే… ప్రపంచమే కదులుతుంది.

140
FEATURE NEWS Tags:India’s Risk Exposure, Oil Is More Than Fuel, Oil Politics Never Changes, OPEC – The Nerve Centre of Oil World, Production Matters More Than Reserves, Strategic Petroleum Reserves, Why Iran Triggers Panic, Why Venezuela Didn’t Shake Markets?, Will Fuel Prices Rise?

Post navigation

Previous Post: స్వ‌ల్పంగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌… పెట్టుబడిదారుల్లో టెన్షన్.. Gold Prices Ease Amid Global Uncertainty
Next Post: ఒక్క రోజు యుద్ధం ఖ‌ర్చెంత తెలుసా.. అమెరికా ఎంత వెచ్చిస్తుందంటే..? Do You Know the Cost of One Day of War? Here’s How Much the U.S. Spends

Related Posts

  • డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold? FEATURE NEWS
  • ఇండియాలో ఎంత బంగారం ఉందో తెలుసా? అమెరికాను దాటేశామా? Do You Know How Much Gold India Holds? Have We Surpassed the US? FEATURE NEWS
  • మీ వాహనానికి 15 ఏళ్లు దాటాయా..? రెన్యూవల్ చేయకపోతే భారీ ముప్పే! Vehicle RC Renewal After 15 Years – Rules, Process & Risks Explained FEATURE NEWS
  • గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply! FEATURE NEWS
  • స‌రిగా వినియోగిస్తే.. క్రెడిట్‌ కార్డు ఒక ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. ఆర్థిక మిత్రుడు కూడా..!! When Used Wisely… A Credit Card Is Not Just a Financial Tool, But a Financial Companion Too!! FEATURE NEWS
  • సోలార్ ఉత్పత్తుల దిగుమ‌తుల‌పై126 శాతం డ్యూటీ..! ట్రంప్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం! 126% Duty on Solar Imports! Trump Administration Takes a Key Decision FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • గృహ బీమా అవ‌స‌ర‌మా? Is Home Insurance Necessary? INSURANCE
  • క‌మొడిటీస్‌పై ఓ లుక్కేయండి what are commodities in  stock market MARKET
  • సుర‌క్షిత‌మైన‌వి పోస్టాఫీస్ సేవింగ్స్‌ post office saving schemes are safe FEATURE NEWS
  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ త‌ప్ప‌నిస‌రి. డిసెంబర్ 31 వరకే అవకాశం.. Linking PAN with Aadhaar Made Mandatory: Deadline Extended Till December 31 FEATURE NEWS
  • ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి! Things You Must Know Before Buying Health Insurance! INSURANCE
  • పెన్నీ స్టాక్స్ అంటే ఏవి what is penny stock MARKET
  • జనవరి 2026 లోపు ఇలా చేయండి ..! బీమా, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్‌, సిల్వ‌ర్‌, స్టాక్ మార్కెట్లలో పెట్టుబ‌డి వ్యూహాలు..! Investment Strategies, Insurance, Mutual Funds, and Stock Market Tips Until January 2026 FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme