
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే అదో గొప్పగా, క్రేజీగా ఫీలవుతారు చాలా మంది. బ్యాంకు అకౌంట్లు పెరగడం వల్ల మనకు వచ్చే ఆదాయం కానీ, లాభం కానీ ఏమీ ఉందడు. తిరిగి నష్టమే.. కానీ ఈ విషయాన్ని గుర్తించక చాలా మంది అనేక బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తుంటారు. కానీ ఇన్ని బ్యాంకు అకౌంట్లు తెరవాలన్న నిబంధన ఏదీ లేదు. సాధారణంగా ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్లయినా తెరవ వచ్చు. కానీ ఒక బ్యాంకు లో మాత్రం ఒక వ్యక్తి ఒక్క అకౌంటే తెరవడానికి వీలవుతుంది. వేరు వేరు బ్యాంకుల్లో ఎన్ని అకౌంట్లయినా తీసుకోవచ్చు. మనకు అంత అవసరం ఉంటే పర్వాలేదు కానీ అకౌంట్ల సంఖ్య పెరిగితే నష్టమే తప్ప ఒరిగేదేమీ లేదు.
what will happen if we have more bank accounts
ఉద్యోగాలు మారేవారికి ఆయా సంస్థల నిబంధనలు బట్టి వేరు వేరు పొదుపు అకౌంట్లు తెరవాల్సి ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి జాయింట్ అకౌంట్ తెరుస్తాం. ప్రభుత్వ పథకాల కోసం ఒకటి, ఖర్చులకు ఒకటి… ఇలా అనేక అకౌంట్లు తెరుస్తాం. కానీ తర్వాత వాటిని అలాగే వదిలేస్తాం. వాటిని వాడకపోయినా కొనసాగిస్తాం. సరిగ్గా ఇలా చేసే వారికే జరిగే నష్టం తెలియదు. అన్ని బ్యాంకు ఖాతాలను నిర్వహించలేక ఇబ్బంది పడుతుంటారు. ఏ ఏ అకౌంట్‌తో ఏం చేస్తున్నారో అన్న విషయంలో క్లారిటీ లేక గందరగోళానికి గురవుతుంటారు. వాటిపై చార్జీలు ఎంతో తెలియక నష్టపోతుంటారు. సరదాకో, ఫ్రెండ్స్ చెప్పారనో, ఆన్లైన్లో ఆఫర్లు కనిపించాయనో కొత్త కొత్త అకౌంట్లు తెరిస్తే ఇక మనకు మిగిలేది సున్నానే..
సాధారణంగా ఒక బ్యాంకు అకౌంట్ కలిగి ఉంటే పడే చార్జీలు చాలా అధిక మొత్తం లో ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అకౌంట్ తెరిచే ముందు జాగ్రత్త వహించాలి.ఇటీవల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లపై వస్తున్న రకరకాల ఆఫర్లు కొత్త బ్యాంకు అకౌంట్లను తెరిస్తే అధిక మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నట్టు ప్రకటిస్తుండడంతో కొందరు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త అకౌంట్ తెరవడం క్షణాల్లో పని కావడంతో బ్యాంకుల పని మరీ సులువయ్యింది.two bank accounts are enoughరెండు ఖాతాలు చాలు…మనకు ఉండే సాధారణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు ఖాతాలు తెరవాలి. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించిన అన్ని అవసరాలకు రెండు పొదుపు ఖాతాలు సరిపోతాయి. శాలరీ అకౌంట్ ఒకటి ఉంటే ఖర్చులకు, ఇతర వ్యవహారాలకు ఒకటి సరిపోతుంది. లేని పక్షంలో మూడో అకౌంట్‌కు వెళ్లవచ్చు. దీన్ని పొదుపు, డీ మ్యాట్, మ్యూచువల్ ఫండ్స్ తదితరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా ఆ బ్యాంకులు ప్రతి మూడునెలలకోసారి పంపించే బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎంత చార్జీలు పడ్డాయో, ఏ ఏ విషయాలపూ మనకు ఫైన్ వేశారో తెలుసుకోవాలి. ఏదైనా తేడా జరిగితే బ్యాంకు వారిని ప్రశ్నించడానికి అవకాశం దొరుకుతుంది.పెద్ద మొత్తాల్లో లావాదేవీలు నిర్వహించే వారు, వ్యాపారవేత్తలు వాళ్ళ అవసరాల నిమిత్తం ఎక్కువ అకౌంట్లు వాడాల్సి వస్తుంది. వాళ్ళు ఈ విషయాల్లో అవగాహనతో ఉండడం అవసరం.