అక్టోబరులో యూపీఐ చెల్లింపులు.. సరికొత్త రికార్డులు.. UPI Payments in October Set New Records
దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అక్టోబర్ నెలలో యూపీఐ (Unified Payments Interface) ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం విలువ రూ.27 లక్షల కోట్లకు చేరింది. లావాదేవీల సంఖ్య పరంగా కూడా సరికొత్త రికార్డు నెలకొంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన వివరాల ప్రకారం, అక్టోబర్ నెలలో 138 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.17 లక్షల కోట్ల వద్ద…

