అబోడ్ జప్తు – అంబానీ సామ్రాజ్యంలో మరో మలుపు..! ED Attaches Anil Ambani’s Luxury Residence
భారత కార్పొరేట్ చరిత్రలో ఒకప్పుడు “వేగం, విస్తరణ, వైభవం”కు ప్రతీకగా నిలిచిన పేరు అనిల్ అంబానీ. టెలికాం నుంచి విద్యుత్, మౌలిక వసతుల నుంచి ఆర్థిక సేవల వరకూ విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం. కానీ అదే సామ్రాజ్యం ఇప్పుడు విచారణలు, కేసులు, అటాచ్‌మెంట్‌ల నడుమ నిలబడింది. ముంబయి నగరంలోని పాలీ హిల్‌లో ఉన్న అతి విలాసవంతమైన నివాసం ‘అబోడ్’ జప్తు వార్త, ఈ ప్రయాణంలో మరో కీలక మలుపుగా మారింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద,…
