స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top
స్వయంకృషితో ఎదిగిన 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ , హురున్ ఇండియా వెల్లడించింది. దీని ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్ ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ తొలిసారిగా అడుగుపెట్టారు. ఏకంగా టాప్-10లో వారు నిలిచారు. స్వయంకృషి, వ్యాపార నైపుణ్యం, ఆధునిక మార్కెట్ వ్యూహాలతో ఈ ఇద్దరూ దేశీయ విమానయాన (Self-Made Industrialists Reach the Top) రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ విలువ 2025లో రూ. 2.2 లక్షల కోట్లకు చేరడంతో, ఈ జాబితాలో వీరు మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
అగ్రస్థానంలో దీపిందర్ గోయల్ Deepinder Goyal at the Top
జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ వంటి సంస్థలను నిర్వహిస్తున్న ఎటర్నల్ మార్కెట్ విలువ రూ.3.2 లక్షల కోట్లకు చేరడంతో, ఈ జాబితా అగ్రస్థానంలో సంస్థ అధిపతి దీపిందర్ గోయల్ నిలిచారు. గతేడాది తొలిస్థానంలో ఉన్న డిమార్ట్ మార్కెట్ విలువ 13% తగ్గడంతో, ఆ సంస్థ అధినేత దమానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. పేటీఎం, లెన్స్‌కార్ట్ కూడా టాప్-10లోకి చేరి, భారత్‌లో టెక్ కన్జ్యూమర్ బ్రాండ్ల శక్తిని చాటాయి. రాజోర్‌పే, జెరోధా వంటి సంస్థలు టాప్-10 నుంచి బయటకు వెళ్లాయి. మొత్తం 200 కంపెనీల మార్కెట్ విలువ ఈసారి రూ.42 లక్షల కోట్లుగా నిలిచింది. బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,000 కోట్లు) విలువైన కంపెనీల సంఖ్య 121 నుంచి 128కి పెరిగింది. కొత్తగా 22 కంపెనీలు జాబితాలోకి చేరాయి. రూ.లక్ష కోట్లు పైగా విలువ కలిగిన కంపెనీలు 3 నుంచి 5కి పెరిగాయి. ఈ జాబితాలోని కంపెనీల కనీస విలువ గతేడాది రూ.3,400 కోట్లు ఉండగా, ఈసారి రూ.4,300 కోట్లకు పెరిగింది. ఈ ఫలితాలు భారతీయ టెక్ , కన్జ్యూమర్ బ్రాండ్‌ల వేగవంతమైన వృద్ధిని చాటుతున్నాయి.
మహిళా పారిశ్రామికవేత్తల్లో Among Women Industrialists…
మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ అగ్రస్థానంలో కొనసాగారు. మొత్తం 20 మంది మహిళల కంపెనీల మార్కెట్ విలువ ఈసారి రూ.3.3 లక్షల కోట్లకు చేరింది. ఈ ఫలితాలు భారతీయ మహిళా పారిశ్రామికవేత్తల శక్తిని, వ్యాపారంలో సాధించిన విజయంని చూపుతున్నాయి.
8వ స్థానంలో ముకేశ్ అంబానీ కుటుంబం Mukesh Ambani Family at 8th Position
ప్రపంచంలోని అగ్రశ్రేణి 25 సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ తాజాగా ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి ముకేశ్ అంబానీ కుటుంబం ఒక్కటే చోటు సంపాదించింది. ముకేశ్ కుటుంబ సంపద 105.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9.50 లక్షల కోట్లు). ఇక వాల్‌మార్ట్ అధినేత వాల్టన్ కుటుంబం సంపద 513.4 బి.డా. (సుమారు రూ.46.20 లక్షల కోట్లు)గా ఉంది. జాబితాలోని (Self-Made Industrialists Reach the Top) ఆయా కుటుంబాల సంపద విలువ మొత్తం గతేడాదికంటే 358.7 బి.డా. (సుమారు రూ.32.28 లక్షల కోట్లు) పెరిగి 2.9 లక్షల బి.డా. (సుమారు రూ.261 లక్షల కోట్ల) చేరింది. కనీస సంపద విలువ 46.4 బి.డా. (సుమారు రూ.4,17,600 కోట్లు), కాగా ఇది(Self-Made Industrialists Reach the Top) గతేడాదికంటే 9.7 బి.డా. (సుమారు రూ.87,300 కోట్లు) ఎక్కువ. ఈ జాబితా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, వారి స్థిరమైన సంపదను ప్రతిబింబిస్తుంది.
8 లక్షల మందికి ఉపాధి ఇచ్చే టాప్ కంపెనీలు.. Top Companies Providing Jobs to 8 Lakh People
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలోని ప్రధాన కంపెనీలు మొత్తం 8 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) 90,280 మంది. ఇండిగో 42,887 మంది కి ఉద్యోగాలు(Self-Made Industrialists Reach the Top) ఇచ్చాయి. ఇండిగో రూ.84,098 కోట్లు, డీమార్ట్ రూ.59,482 కోట్లు, ఎటర్నల్ రూ.21,320 కోట్లతో అత్యధిక ఆదాయం కలిగిన కంపెనీలుగా అవి నమోదయ్యాయి.










