చాలా మంది రిటైర్ మెంట్ ప్లానింగ్ అంటే అరవై ఏళ్లకు కదా అని అనుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువ మంది త్వరగా సెటిల్ అవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. తక్కువ వయసులోనే ఆర్థిక లక్ష్యాలను వీలైనంత త్వరగా చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మంచి సంపాదన, పొదుపు ప్లానింగ్, పెట్టుబడి పథకాలలో నగదు పెట్టడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. కేవలం 12 నుంచి 13 ఏళ్లు బాగా కష్టపడి 35 ఏళ్లు వచ్చే నాటికి లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారు.
కొన్ని నివేదికల ప్రకారం
మనందరం కూడా బాగా చదువుకుంటాం. మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనుకుంటాం. లేదా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటాం. 60 ఏళ్ళు వచ్చేదాకా ఆ పని చేస్తూ రిటైర్ అవ్వాలనుకుంటాం. బేసిక్ గా ఇలానే బతకాలని అనుకుంటాం. మన ఇండియాలోనే కాదు ప్రపంచమంతా కూడా ఇదే సిద్ధాంతం సరైనదని నమ్ముతుంది. దాన్నే అనుసరిస్తుంది కూడా. అయితే దాదాపు 38 శాతం మంది భారతీయులు మాత్రం పదవీ విరమణ ప్రణాళికకు సరైన వయసు 35 ఏళ్లలోపు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. మరో 49 శాతం మంది డబ్బు సంపాదించినప్పుడే రిటైర్‌మెంట్ ప్లాన్ కోసం ఆలోచిస్తున్నారు. అయితే ఇది అందరికీ సాధ్యమా అంటే.. సాధ్యమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. కానీ అందుకు కచ్చితమైన ప్లానింగ్, సరైన పథకాలలో పెట్టుబడి పెట్టడం అవసరమని చెబుతున్నారు. 12-13 సంవత్సరాలు మాత్రమే పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేయడం కలలా కనిపిస్తున్నప్పటికీ అది సాధించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
ఆర్థిక అలవాట్లలో మార్పులు
Changes in financial habits
ఆర్థిక లక్ష్యాన్ని సాధించడం మీ తొలి ప్రాధాన్యతగా ఉండాలి. ఆర్థిక అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. మీరు సంపాదిస్తున్న డబ్బులో అధిక మొత్తం సురక్షిత పెట్టుబడుల్లో పెట్టాలి. ఆదాయంలో 70% ఆదా చేయడం కూడా ప్రారంభించాలి. మీ ఖర్చులు తగ్గించుకోవాలి. మీరు చేస్తున్న త్యాగాలు మీ లక్ష్యానికి మద్దతుగా ఉంటాయని తెలుసుకోండి. ఇది మొదట కష్టంగా ఉండొచ్చు. కానీ కాలక్రమేణా సులభమవుతుంది.
అదనపు ఆదాయం
Additional income
మీకు స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ.. మీ ఆదాయాన్నిపెంచుకోవడానికి ప్రయత్నించాలి. సైడ్ ఇన్‌కమ్ కోసం పనిచేయాలి. ఇందుకోసం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇందుకోసం మీరు ఒక సైట్‌ను ప్రారంభించవచ్చు . అదేవిధంగా సొంత యూ ట్యూబ్ చానల్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఫ్రీలాన్స్ రైటింగ్ కూడా చేయవచ్చు. మీ కార్యాలయంలో కూడా ఓటీ చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. తద్వారా పదోన్నతుల కోసం డిమాండ్ చేయొచ్చు. ఎక్కువ ఆదాయం, ఎక్కువ పొదుపులు, మంచి పథకాలలో పెట్టుబడులు వంటివి మీ సులభమైన రిటైర్‌మెంట్‌కు ఎంతగానో దోహదపడతాయి.
మంత్లీ బడ్జెట్ ప్లాన్
Monthly budget plan
నెలకొకసారి మన ఖర్చులను సమీక్షించుకోవాలి. మీ డబ్బును దేని కోసం ఎక్కువగా ఖర్చుపెడుతున్నారో తెలుసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. కొంచెం అవగాహన చాలా పెద్ద మార్పును కలిగిస్తుంది. మీ సరదా ఖర్చులు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లు, బయట తినడం వంటి చిన్న ఖర్చులపై సమీక్షించుకుని వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మీ జీవనశైలి లో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రిటైర్‌మెంట్ ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండదు.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవాలి
Take a term insurance plan
ఖర్చులు సగానికి తగ్గించి.. ఆ మొత్తాలను సేవింగ్స్ లో పెట్టుబడి పెడితే కేవలం 10 సంవత్సరాల్లోనే రిటైర్ అవ్వచ్చు. ఇదే సమయంలో ప్రతిఒక్కరూ తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవాలి. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అది ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీకి ఒక రక్షణగా నిలుస్తుంది. ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని సెక్యూర్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఎఫోర్డబుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వే. దీని మెయిన్ బెనిఫిట్ ఏంటంటే.. మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి సరిపడా అమౌంట్ ఒకేసారి చెల్లిస్తారు. దీనివల్ల వారి లివింగ్ ఎక్స్పెన్సెస్ వారి లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవడంలో ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఉంటుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సూపర్ ఎఫోర్డబుల్ జస్ట్ రూ.600 నుంచి రూ.700 ఒక నెలలో కడితే చాలు రెండు కోట్ల కవరేజ్ మీరు పొందొచ్చు.
మనీ నాలెడ్జ్.. Money knowledge
హై ఇన్కమ్ ఉంటేనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. మనం ఎంత తక్కువ సంపాదించినా ఎంత ఎక్కువ సేవ్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం . వాస్తవంగా మనం ఎంత కావాలంటే అంత సేవ్ చేయొచ్చు. అదేవిధంగా ఖర్చులు కూడా పెట్టాలి తప్పు లేదు. కానీ ఆ ఖర్చు మన అనవసరమైన వాటికి పెడుతున్నామా లేదా అన్న విషయాన్ని గుర్తించాలి. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ మీనింగ్ ఉండేలా ఆలోచించాలి. అదేవిధంగా ఎవరికైతే మనీ మీద మంచి నాలెడ్జ్ ఉందో వారితో మాట్లాడండి. వాళ్ళ దగ్గర సేవింగ్ ఆప్షన్స్ ఏమున్నాయో మీరు కూడా తెలుసుకుని వారితో డిస్కస్ చేయండి.
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ(ఫైర్)
Financial Independence Retire Early (Fire)
ఫైర్ ఫిలాసఫీ సింపుల్ గా ఒకటే చెప్తుంది. అర్థం లేని ఖర్చులను కంట్రోల్ చేయండి. ఎక్కడ అవసరమో అక్కడ ఇన్వెస్ట్ చేయండి. మీకు ఉపయోగపడే, మీకు నచ్చే పని చేస్తూ ఒక సైడ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోండి . ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుసుకోండి. సేవింగ్ టార్గెట్ పెట్టుకోండి. దాన్ని రీచ్ అవ్వడానికి శాయశక్తుల కృషి చేయండి.
– ఉదాహరణకి హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కపుల్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు సంవత్సరానికి రూ. 25 లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే కూక ట్ పల్లిలో ఒక త్రీ బీహెచ్ కే తీసుకుని రెండు కార్లు మెయింటైన్ చేస్తున్నారు. వీకెండ్ పార్టీస్.. ఫారెన్ ట్రిప్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చేస్తూ ఇయర్ కి రెండు లేదా మూడు లక్షలు మాత్రమే సేవ్ చేయగలుగుతున్నారు. కానీ ఫైర్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసిన తర్వాత చీపర్ ఏరియాలో టు బీ హెచ్ కే కి షిఫ్ట్ అయిపోయారు. ఒక కార్ ని అమ్మేసి ఎక్కువగా మెట్రో వాడటం స్టార్ట్ చేశారు. వీకెండ్ పబ్స్ అండ్ క్లబ్స్ కట్ చేసి హోమ్ పార్టీస్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇంటర్నేషనల్ టూర్స్ బదులు లోకల్ టూరిజం ని ప్రిఫర్ చేయడం మొదలు పెట్టారు . వీకెండ్ లో కోడింగ్ క్లాసెస్ నడుపుతూ సైడ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి రూ. 12 నుంచి రూ.15 లక్షల దాకా సేవ్ చేయగలుగుతున్నారు. వాళ్ళ టార్గెట్ 45 ఇయర్స్ కి రిటైర్మెంట్. ఖర్చులను తగ్గించుకుని సేవింగ్స్‌ను పెంచుకోవడం వల్ల యర్లీ రిటైర్‌మెంట్‌ను వాళ్లు సాధించగలిగారు.
ఫైర్ ప్రిన్సిపల్..Fire Principal
ఫైర్ ప్రిన్సిపల్ అంటే జీవితంలో ఎంజాయ్‌మెంట్ ఉండదని కాదు. క్వాలిటీ, ఓవర్ క్వాంటిటీ ఖర్చు పెట్టేటప్పుడు వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అనేది ఆలోచించాలి. టైం అనేది చాలా ప్రీషియస్ అసెట్ . ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల మనకి లైఫ్ లో ఫ్రీడమ్ వస్తుంది. అందుకే మీ ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. మీ డబ్బుని సరైన చోట ఇన్వెస్ట్ చేయాలి. మూడోది మీరు ఒక సైడ్ ఇన్కమ్ స్ట్రీమ్ ని మొదలు పెట్టాలి. జీవితాంతం ఈఎంఐ బిల్స్ కట్టడం కోసం బతకడం కాకుండా మీకు నచ్చినట్లు మీరు బతకడమే ఫైర్ ప్రిన్సిపల్ ముఖ్య ఉద్దేశం.