లోన్ అనేది బతకడానికి కాదు.. ఎదగడానికి! Loans: Not for Surviving… But for Growing!

అప్పు అంటే కష్టాల్లో పడటం అనే భావన గ‌తంలో అంద‌రికీ ఉండేది. కానీ ఇప్పుడు భారత యువత ఆలోచన పూర్తిగా మారుతోంది. లోన్ బతకడానికి కాదు.. ఎదగడానికి అని వారు భావిస్తున్నారు. హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన 2025 సర్వేలో ఇదే స్ప‌ష్టంచేసింది. దేశవ్యాప్తంగా 17 పెద్ద నగరాల్లో వేల మందిని సర్వే చేసి నివేదిక రూపొందించింది.

సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయంటే..What the Survey Results Reveal…

– 46% మంది ఇప్పుడు మొబైల్, ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులు కొనడానికి లోన్ తీసుకుంటున్నారు.
– 25% మంది కొత్త బిజినెస్ పెట్టడానికి లేదా పాత బిజినెస్ పెంచుకోవ‌డానికి అప్పు చేస్తున్నారు.

రాబోయే రెండేళ్ల‌లో.. In the Next Two Years…

రాబోయే రెండేళ్ల‌లో 34% మంది సొంత బిజినెస్ కోసం లోన్ తీసుకోబోతున్నారు. 28% మంది సొంత ఇల్లు కొనడానికి లోన్ ప్లాన్ చేస్తున్నారు. అబ్బాయిలు (35%)ఎక్కువగా బిజినెస్ లోన్ కోసం ఆలోచిస్తున్నారు. అమ్మాయిలు (32%) ఇల్లు కొనడం కోసం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పట్నా (52%), రాంచీ (47%), ఢిల్లీ (37%) లో ఇల్లు కొనాలని ఎక్కువమంది భావిస్తున్నారు. Tier-2 నగరాల్లో ప్ర‌జ‌లు కూడా ఇల్లు కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు.

ఆన్‌లైన్ లోన్ .. Online Loans

ఈ రోజుల్లో 51% మంది ఆన్‌లైన్ లోన్‌ను ఇష్టపడుతున్నారు. బ్యాంక్‌కి వెళ్లి లోన్ తీసుకునేవారు 30% మాత్రమే. యువతలో 50–54% ఆన్‌లైన్ లోన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. పూణె, లూధియానా త‌దిత‌ర ప్రాంతాల్లో 64% ఫోన్ ద్వారా లోన్ తీసుకుంటున్నారు. ముంబై, లక్నో, జైపూర్ మాత్రం ఈ విష‌యంలో వెనుకంజలో ఉన్నాయి.

EMI కార్డులు & షాపింగ్ యాప్స్.. EMI Cards & Shopping Apps

EMI కార్డు దేశంలో అత్యంత ప్రాధాన్యం పొందిన లోన్ సాధనం (65% మంది ఇష్టపడుతున్నారు). షాపింగ్ యాప్‌లలో ఇన్‌బిల్ట్ లోన్ (Embedded Finance) కూడా 49% మంది ఉపయోగిస్తున్నారు. 46% మంది నెలవారీ EMI తగినంత ఉందా అని ముందే ఆలోచిస్తున్నారు. 66% మంది వడ్డీ ఎక్కువగా ఉన్నా.. నమ్మకమైన కంపెనీ నుండి మాత్రమే లోన్ తీసుకుంటున్నారు.

నెర‌వేర‌తున్న కలలు ..Dreams Coming True

51% మంది లోన్ ద్వారా త‌మ క‌ల‌ల‌ను నెర‌వేర్చుకుంటున్నారు. 65% మంది చదువు, ఇల్లు, బిజినెస్ వంటి పెద్ద లక్ష్యాలకు లోన్ ఒక మెట్టు (Step) అని భావిస్తున్నారు. కాగా 84% మంది లోన్ యాప్స్ ఎక్కువగా డేటా తీసుకుంటాయని భయపడుతున్నారు. కేవలం 27% మందే డేటాను స‌క్ర‌మంగా వినియోగించుకుని లోన్ పొందుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు భారత యువత లోన్‌ను ఎదగడానికి సాధనంగా చూస్తోంది, బతకడానికి కాదు.అన్ని వయసుల, నగరాల, లింగాల వారీగా, ఆన్‌లైన్ లోన్, EMI కార్డులు, షాపింగ్ ఆప్స్ ఈ మార్పుకు దారితీస్తున్నాయి. ఇది కొత్త ఆర్థిక ఆలోచన, కొత్త దిశ అని చెప్పొచ్చు.

ప‌ర్స‌న‌ల్ లోన్ ఆఫ‌ర్లు వ‌స్తే ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి? Personal Loan Offers: What to Do and Precautions to Take

వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పర్సనల్ లోన్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి ఆఫర్ తక్షణమే తీసుకోవద్దు. కొన్ని ముఖ్య జాగ్రత్తలు & సూచనలు తెలుసుకోవడం చాలా అవసరం.

1) సూపర్ లొ నంబర్లు, ప్రోమోషనల్ ఆఫర్లు కనిపించినా వాస్తవ వడ్డీ రేట్లు ఎంత అని తెలుసుకోవాలి. ఫిక్స్డ్ vs ఫ్లోటింగ్ రేట్ల మధ్య తేడాలను అర్థం చేసుకోవాలి. EMI పెరుగుదల వల్ల భవిష్యత్ లో మదుపుపై ఒత్తిడి పడకూడదు.

2) నెలవారీ EMI మీ ఆర్థిక సామర్థ్యానికి తగ్గనట్టే ఉండాలి. అదనపు ఖర్చులు, ఇతర లోన్లు ఉన్నా కూడా EMI సులభంగా చెల్లించగలిగేలా ప్లాన్ చేయాలి.

3) బ్యాంకులు, NBFCs, ఫైనాన్స్ కంపెనీలను మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫిక్స్ చేసిన కాంట్రాక్ట్, Terms & Conditions వివరంగా చదవాలి. Hidden charges, prepayment penalties వంటి అంశాలు తెలుసుకోవాలి.

4) ఆన్‌లైన్ లోన్ తీసుకునే ముందు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. 51% మంది యూత్ ఇప్పుడు ఆన్‌లైన్ లోన్ ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. అయితే లోన్ యాప్‌లు డేటా ఎక్కువగా వాడుతాయని 84% మంది భయపడుతున్నారు. కేవలం 27% మంది మాత్రమే తెలుసు డేటా ఎలా వాడుతారో. ఫోన్‌లో లావాదేవీలు చేసే ముందు యాప్ నమ్మకమైనదా ? లేదా అన్న‌ది ధృవీకరించుకోవాలి.

5) లోన్ కేవలం అవసరాల కోసం తీసుకోవాలి. Show-off, ఖర్చులు తగ్గించడానికి కాదు. చదువు, ఇల్లు, బిజినెస్ — పెద్ద లక్ష్యాల కోసం లోన్ ఒక మెట్టు (Step) అని భావించాలి. EMI కార్డులు, షాపింగ్ ఆప్స్ (Embedded Finance) సరైన మాడ్యూల్స్‌లో మాత్రమే వాడాలి.

6) వడ్డీ రేట్ల మార్పు, అనుకోని పరిస్థితులు ముందే అంచనా వేయాలి. Personal Finance Budget తయారు చేసి, అదనపు ఖర్చులు తగ్గించే మార్గాలు పరిశీలించాలి. పర్సనల్ లోన్ ఆఫర్లు పాపులర్ అయినప్పటికీ… అధిక వడ్డీ, EMI సామర్థ్యం, నమ్మకమైన lender, ఆన్‌లైన్ సేఫ్టీ వంటి అంశాలు జాగ్రత్తగా పరిశీలించాలి. సరైన ప్లానింగ్, సున్నితమైన ఆలోచనతో మాత్రమే లోన్ తీసుకుంటే బతకడమే కాదు, ఎదగడానికి సాధనమ‌వుతుంది.

లోన్ పొంద‌డానికి అర్హ‌త‌లేమిటి? ఎక్క‌డ్ లోన్ తీసుకోవాలి? Loan Eligibility and Where to Borrow From

వ్యక్తిగత అవసరాలకు, విద్య, ఇల్లు, బిజినెస్ మొదలైన వాటికి లోన్‌ అనేది ఒక సాధనంగా మారింది. అయితే, సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమే. ఎక్కడి లోన్ తీసుకోవాలి, అర్హతలు ఏమిటి, జాగ్రత్తలు ఏవీ అన్నీ తెలుసుకోవడం అవసరం. సాధారణంగా 21–60 సంవత్సరాల మధ్య ఉన్న వారు లోన్ పొంద‌వ‌చ్చు. అయితే నెలవారీ స్థిర ఆదాయం ఉండాలి. salaried లేదా self-employed అయ్యి ఉండాలి. పాత లోన్ EMI చెల్లింపులు సరిగా ఉంటే మాత్రమే కొత్త లోన్ అందుతుంది. పన్ను & ID ధృవీకరణ: PAN, Aadhar, వేతన / ఆదాయ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. బ్యాంకుల్లో లోన్ పొంద‌డ‌మే సుర‌క్షితం. ఇవి న‌మ్మ‌క‌మైన ఆఫ‌ర్లు ఇస్తాయి. వ‌డ్డీరేట్లు కూడా కాస్త త‌క్కువ‌గా ఉంటాయి. ఇక NBFCs (Non-Banking Finance Companies) త్వ‌రిగ‌త‌గిన రుణాల‌ను మంజూరు చేస్తాయి. అయితే వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. ఆన్‌లైన్ లోన్ యాప్స్ లో అయితే ప్రాసెసింగ్ త్వరగా పూర్త‌వుతుంది. వడ్డీ రేట్లు, Processing Fee, Prepayment Charges, EMI Structure అన్ని పరిశీలించాలి.

ఎన్ని ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ పొందొచ్చు.. ? How Much Loan Can You Get?

వ్యక్తిగత అవసరాల కోసం సులభమైన Personal Loan ₹50,000 నుంచి ₹20 లక్షల వరకు పొందొచ్చు. వడ్డీ రేట్లు 10%–24% మధ్య ఉంటాయి. క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్ మంజూర‌వుతుంది. అయితే నెలవారీ ఆదాయానికి తగ్గట్టుగా EMIలు ప్లాన్ చేయాలి. హోమ్ లోన్ కోసం అయితే ₹5 లక్షల నుంచి ₹5–10 కోట్లు వరకు పొందే అవ‌కాశం ఉంది. tenure 5–30 సంవత్సరాలు పెట్టుకుంటే వడ్డీ రేట్లు 7%–10% మధ్య ఉంటాయి. వ్యక్తిగత ఆదాయం, క్రెడిట్ స్కోర్, గృహ విలువ ఆధారంగా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. కొత్త లేదా స్థిరమైన వ్యాపారం కోసం ₹1 లక్ష నుంచి ₹50 లక్షల వరకు అవ‌స‌రం. MSMEs, చిన్న వ్యాపారాలకు ప్రత్యేక లోన్ స్కీమ్‌లు కూడా ఉన్నాయి. వడ్డీ రేట్లు 9%–18% మధ్య ఉంటాయి. collateral ఆధారంగా మారవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *