నగదు రహిత (UPI Charges)చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐపై ఛార్జీల అంశం ఇప్పుడు వినియోగదారుల్లో చర్చకు దారితీస్తోంది. రూ.2,000కు మించిన కొన్ని యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అంశంపై కేంద్రం చేసిన ప్రకటనతో.. అసలు ఈ రుసుములు ఎవరు చెల్లించాలి? కస్టమర్లపైనా భారం పడుతుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే సాధారణ వినియోగదారుడు చేసే చెల్లింపుపై నేరుగా ఈ ఛార్జీ ఉండదని కేంద్రం స్పష్టం చేస్తోంది. వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఈ రుసుములను వసూలు చేస్తారు. మరి వివిధ సందర్భాల్లో ఈ ఛార్జీలు ఎలా ఉంటాయో చూద్దాం.
రూ.50 వేల ఫోన్ కొంటే..Buying a ₹50,000 Smartphone
మీరు రూ.50 వేల విలువైన (UPI Charges) ఫోన్‌ను కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించారని అనుకుందాం. ప్రకటించిన 0.4 శాతం MDR రేటు ప్రకారం ఈ లావాదేవీకి రూ.200 రుసుము వస్తుంది. అయితే ఈ మొత్తాన్ని కస్టమర్ అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫోన్ విక్రేత నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఈ ఛార్జీని వసూలు చేస్తాయి. అంటే ఫోన్ ధర రూ.50 వేలు అయితే.. కస్టమర్ యూపీఐ ద్వారా రూ.50 వేలు మాత్రమే చెల్లిస్తారు.
రూ.3 వేల పెట్రోల్ పోయించుకుంటే..Paying ₹3,000 for Fuel
కారులో రూ.3 వేల పెట్రోల్ (UPI Charges) పోయించుకున్నారని అనుకుందాం. కస్టమర్‌గా మీరు యూపీఐ ద్వారా రూ.3 వేలు చెల్లిస్తే అంతే మొత్తం చెల్లించాలి. అదనంగా ఎలాంటి ఛార్జీ ఉండదు. అయితే అదే పెట్రోల్ బంక్‌ను మీరే నిర్వహిస్తూ, వ్యాపారి కోణంలో ఈ లావాదేవీని చూస్తే MDR వర్తిస్తుంది. ఈ ఉదాహరణలో రూ.5 స్థిర MDR రుసుము ఉంటుంది. దాన్ని వ్యాపారి చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్‌పై మాత్రం అదనపు భారం ఉండదు.
కొన్ని చెల్లింపులకు రూ.5 స్థిర రుసుము.. ₹5 Fixed MDR for Specific Payments
బీమా (UPI Charges) ప్రీమియం, పెట్రోలు, డీజిల్ కొనుగోలు, ప్రభుత్వ విద్యుత్, నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్, పాఠశాల, కళాశాల ట్యూషన్ ఫీజు వంటి నిర్దిష్ట చెల్లింపుల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు శాతంతో సంబంధం లేకుండా రూ.5 స్థిర MDR వర్తిస్తుంది. ఈ రుసుమును సంబంధిత వ్యాపార సంస్థ లేదా సేవలందించే సంస్థ భరించాల్సి ఉంటుంది. వినియోగదారుడు మాత్రం చెల్లించాల్సిన అసలు మొత్తాన్నే యూపీఐ ద్వారా చెల్లిస్తారు.
రెస్టారంట్లో రూ.5 వేల బిల్లు అయితే.. ₹5,000 Restaurant Bill
స్నేహితులతో కలిసి (UPI Charges) రెస్టారంట్‌కు వెళ్లి రూ.5 వేల బిల్లు వచ్చిందనుకుందాం. దాన్ని యూపీఐ ద్వారా చెల్లించినా వినియోగదారుడికి అదనపు ఛార్జీ ఉండదు. 0.4 శాతం MDR ప్రకారం ఈ లావాదేవీకి రూ.20 రుసుము వచ్చినప్పటికీ.. దాన్ని రెస్టారంట్ భరించాల్సి ఉంటుంది. కస్టమర్ మాత్రం బిల్లు మొత్తమైన రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తారు.
స్నేహితుడికి రూ.50 వేలు పంపితే? Sending ₹50,000 to a Friend
యూపీఐ (UPI Charges)ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి డబ్బు పంపడం విషయంలో పరిస్థితి వేరు. అత్యవసరంగా స్నేహితుడికి రూ.50 వేలు పంపారని అనుకుందాం. ఇలాంటి పర్సన్ టు పర్సన్ (P2P) బదిలీలపై MDR ఉండదు. ఎంత మొత్తాన్ని పంపినా వ్యక్తిగత బదిలీలకు ఎలాంటి రుసుములు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అంటే రూ.50 వేలు పంపితే పంపిన వ్యక్తి నుంచి గానీ, అందుకున్న వ్యక్తి నుంచి గానీ MDR వసూలు చేయరు.
రూ.లక్ష యూపీఐ చెల్లింపు చేస్తే? What Happens on a ₹1 Lakh UPI Payment?
ఒక వ్యాపార (UPI Charges)సంస్థకు యూపీఐ ద్వారా రూ.లక్ష చెల్లించారని అనుకుందాం. 0.4 శాతం MDR ప్రకారం చూస్తే ఈ లావాదేవీపై రూ.400 రుసుము రావాలి. అయితే రూ.75 వేల నుంచి అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీల విషయంలో ఒక్కో చెల్లింపుపై MDRను గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేశారు. అందువల్ల రూ.లక్ష చెల్లింపుపై వ్యాపార సంస్థ నుంచి గరిష్ఠంగా రూ.300 మాత్రమే వసూలవుతుంది. ఈ మొత్తాన్ని కస్టమర్ నేరుగా చెల్లించాల్సిన అవసరం లేదు.
కస్టమర్‌పై భారం పడుతుందా? Will Customers Ultimately Bear the Cost?
ఇక్కడే అసలు (UPI Charges)ప్రశ్న మొదలవుతోంది. MDR ఛార్జీలను వ్యాపారులు తమ కస్టమర్లపై బదిలీ చేయకుండా చూడాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. యూపీఐ అప్లికేషన్ ప్రొవైడర్లు వినియోగదారులపై ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా అంతర్గత ఛార్జీలు విధించడంపై నిషేధం ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనల అమలు ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. ఇప్పటికే కొన్ని వ్యాపార సంస్థల్లో క్రెడిట్ కార్డు చెల్లింపులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కార్డు ద్వారా చెల్లిస్తే అదనంగా రుసుము చెల్లించాలంటూ కొన్ని చోట్ల బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. ఇదే తరహాలో భవిష్యత్తులో MDR భారాన్ని కూడా వినియోగదారులపై మోపే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
యూపీఐ నుంచి నగదువైపు మళ్లుతారా? Could Merchants Return to Cash Payments?
యూపీఐ (UPI Charges)చెల్లింపులపై MDR అమల్లోకి వస్తే.. కొందరు వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల కంటే నగదు లావాదేవీల వైపు మళ్లే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలకు ప్రతి లావాదేవీపై రుసుము అదనపు వ్యయంగా మారవచ్చన్న అభిప్రాయాలున్నాయి. అయితే కస్టమర్ కోణంలో చూస్తే ఫోన్ కొనుగోలు చేసినా, రెస్టారంట్లో భోజనం చేసినా, పెట్రోలు పోయించుకున్నా.. వ్యక్తిగతంగా చెల్లించే యూపీఐ మొత్తానికి అదనపు ఛార్జీ ఉండదన్నదే కేంద్రం వివరణ. వ్యాపారి చెల్లించాల్సిన MDRను కస్టమర్‌పై బదిలీ చేయకుండా చూడటం బ్యాంకులు, సంబంధిత సంస్థల బాధ్యతగా ఉంటుంది. అందువల్ల యూపీఐ వినియోగదారులు రూ.2,000 దాటిందంటే వెంటనే అదనపు ఛార్జీ పడుతుందని భావించాల్సిన అవసరం లేదు. లావాదేవీ వ్యక్తిగత బదిలీనా? వ్యాపార చెల్లింపా? ఏ విభాగానికి చెందింది? అన్నదానిపై రుసుము విధానం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా యూపీఐ ద్వారా చెల్లించే ప్రతి పెద్ద మొత్తంపైనా కస్టమర్ జేబు నుంచి నేరుగా ఛార్జీ కట్ అవుతుందని భావించడం సరైనది కాదు.
