Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

బాండ్లపై పెరుగుతున్న ఆసక్తి! సెబీ హెచ్చ‌రిక‌లు! Rising Interest in Bonds! SEBI Issues Fresh Warnings

Posted on 28/11/2025 By admin No Comments on బాండ్లపై పెరుగుతున్న ఆసక్తి! సెబీ హెచ్చ‌రిక‌లు! Rising Interest in Bonds! SEBI Issues Fresh Warnings

పెట్టుబడుల ప్రపంచంలో ఒక్కోసారి ఒక్కో పథకం ప్రత్యేకంగా వెలుగులోకి వస్తుంది. వాటిల్లో బాండ్లు ఒకటి. మొబైల్‌ ఫోన్‌లో కొన్ని నిమిషాల్లోనే బాండ్లను కొనగలిగే అవకాశాలు రావడంతో యువ పెట్టుబడిదారులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు వీటిపట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. స్థిరమైన రాబడి, తక్కువ హెచ్చుతగ్గులు అనే ప్రత్యేకతల వల్ల వీటి డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపధ్యంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) పెట్టుబడిదారులకు కొన్ని కీలక సూచనలను జారీ చేసింది. ముఖ్యంగా గుర్తింపు లేని లేదా నియంత్రణ లేకుండా సేవలు అందిస్తున్న డిజిటల్‌ ప్లాట్‌ఫారంలను తప్పించుకోవాలని స్పష్టంగా చెప్పింది. రాబడి ఎక్కువ చూపిస్తూ ఆకర్షించే సంస్థల జోలికి వెళ్లొద్దని హెచ్చరించింది.

మ్యూచువల్‌ ఫండ్లకు బ‌ల‌మైన పోటీ.. Strong Competition to Mutual Funds

నేటి పెట్టుబడిదారులు, ముఖ్యంగా నెలవారీగా రాబడి రావాలని కోరుకునేవారు, బాండ్లను మంచి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. పెన్షన్‌ పొందుతున్నవారు, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే కుటుంబాలు, తక్కువ రిస్క్‌తో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇలాంటి వర్గాలకు బాండ్లు నచ్చుతున్నాయి. గ్యారంటీతో కూడిన వడ్డీ రేట్లు, మార్కెట్‌ తరహా హెచ్చుతగ్గులు లేకపోవడం వీటి ప్రధాన ఆకర్షణ. అదే సమయంలో, కొన్ని బాండ్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే అధిక వడ్డీని అందించడం మరో ముఖ్య కారణం. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు బలమైన పోటీనిస్తున్నాయి.

డిజిటల్‌ బాండ్‌ ప్లాట్‌ఫారంలలో కనిపించే బాండ్లు .. Bonds Offered on Digital Bond Platforms

– కార్పొరేట్ బాండ్లు (ప్రధానంగా NBFCలు)

– ప్రభుత్వ సెక్యూరిటీలు (G-Secs)

– PSU బాండ్లు

బాండ్లు ఇచ్చే రాబడులు .. Returns Offered by Bonds

– AAA రేటింగ్‌ ఉన్న కార్పొరేట్‌ & ప్రభుత్వ బాండ్లు: 7% – 9%

-ఎన్‌బీఎఫ్‌సీ బాండ్లు: 10% – 12%

– ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తరహా బాండ్లు: 5% – 6%

– ప్రభుత్వ సెక్యూరిటీలు (దీర్ఘకాలం): 6% – 7.5%

– PSU టాక్స్‌-ఫ్రీ బాండ్లు: 5.5% – 6.5%

రేటింగ్ ప్ర‌కారం చూసుకుంటే.. Based on Credit Ratings…

– AAA రేటింగ్‌ – భద్రత ఎక్కువ
– C లేదా D రేటింగ్ ఉంటే రిస్క్‌ అత్యధికం . వాటికి దూరంగా ఉండాలి

ఈ జాగ్ర‌త్త‌లు తప్పనిసరి.. These Precautions Are a Must

డిజిటల్‌ ప్లాట్‌ఫారంలను ఎంచుకునే ముందు ఈ జాగ్రత్తలు ఎంతో కీలకం. ప్ర‌ధానంగా సెబీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకోవాలి. స్టాక్‌ బ్రోకర్ రిజిస్ట్రేషన్ లేకుంటే వాటికి దూరంగా ఉండడం మంచిది. 12% కంటే ఎక్కువ రాబడి చూపిస్తే సందేహించాలి. 20% రాబడి చూపిస్తే అది స్పష్టమైన హెచ్చరికగా భావించాలి. స్థిర కంపెనీలు ఇంత అధిక రేట్లకు రుణాలు తీసుకోవు. కాబట్టి “అదిరే రాబడి” చూపించే బాండ్లు చాలా ప్రమాదకరం. ఇదే స‌మ‌యంలో రేటింగ్‌లను గమనించాలి. రేటింగ్ ఏజెన్సీల రిపోర్టులు తప్పనిసరిగా చూడాలి. రేటింగ్ లేకుండా ఉన్న బాండ్లను అస్సలు ఎంచుకోవద్దు. సెబీ నిబంధనలకు మించి రాబడి హామీలిచ్చే సంస్థలు నమ్మదగినవి కావు.

బాండ్ల ప్రయోజనాలు.. Benefits of Investing in Bonds

స్థిరమైన రాబడి, రిస్క్ తక్కువగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది వైవిధ్యమైన మార్గంగా చెప్పొచ్చు.
రిటైర్డ్‌ వారికి ఇవి అనుకూలం. పోర్ట్‌ఫోలియోలో బ్యాలెన్స్‌ కల్పించగలవు. బాండ్లలో పెట్టుబడి మంచిదే… కానీ జాగ్రత్త తప్పనిసరి. ఆర్థిక స్థిరత్వం, నెలవారీ ఆదాయం కోరుకునేవారికి బాండ్లు నిజంగా ఒక మంచి ఎంపిక. కానీ అధిక రేటింగ్, సెబీ అనుమతి ఉన్న ప్లాట్‌ఫారంలు, నమ్మకమైన సంస్థలు .. ఇవే భద్రతకు మార్గం. అధిక రాబడి కోసం రిస్క్‌ ఉన్న బాండ్లవైపు పరుగులు తీయకుండా… భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. మీ పెట్టుబడి సురక్షితం కావాలంటే.. బాండ్లు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి!

డివర్సిఫికేషన్‌ను మర్చిపోవద్దు .. Don’t Forget Diversification

అన్ని డబ్బులు బాండ్లలో పెట్టుబడి పెట్టడం తప్పు. 40% – ఈక్విటీ, 30% – డెట్/బాండ్లు, 20% – గోల్డ్, 10% – అత్యవసర నిధికి విభ‌జించాలి.

లిక్విడిటీ రిస్క్ .. Liquidity Risk You Shouldn’t Ignore

స్టాక్‌ల మాదిరి బాండ్లలో ట్రేడింగ్‌ పెద్దగా ఉండదు. మీరు బాండ్‌ను అమ్మాలనుకున్నప్పుడు కొనుగోలుదారులు లేకపోవచ్చు. ఉన్నా సరైన ధర ఇవ్వకపోవచ్చు. ఇదే లిక్విడిటీ రిస్క్. చిన్న కంపెనీల బాండ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

పన్నులు … Tax Implications to Keep in Mind

బాండ్ల నుంచి వచ్చే వడ్డీ మీ ఆదాయానికి జత కలిపి, మీ ట్యాక్స్‌ స్లాబ్‌ ప్రకారం పన్ను విధిస్తారు. మీరు 30% స్లాబ్‌లో ఉంటే వడ్డీపై 30% పన్ను చెల్లించాల్సి వ‌స్తుంది.

రిస్క్‌ తగ్గించేందుకు ఏం చేయాలి? How to Reduce Risk While Investing in Bonds

బాండ్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. చిన్నకాల బాండ్లు ఎంచుకోవాలి. 1–5 సంవత్సరాల బాండ్లు వడ్డీ రిస్క్‌ను తగ్గిస్తాయి. ప్రభుత్వ బాండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. సురక్షితత పరంగా G-Secs‌ లేదా RBI బాండ్లు ఉత్తమం. కంపెనీ బాండ్లైతే రేటింగ్‌ తప్పనిసరిగా చూడాలి. AA, AAA రేటింగ్స్‌ ఉన్నవే ఎంచుకోవాలి. బాండ్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఒక్క బాండ్‌ను కొనడం కంటే బాండ్‌ మ్యూచువల్‌ ఫండ్లు సురక్షిత మార్గం. రేట్లు పెరుగుతున్న దశలో బాండ్లు దూరంగా పెట్టాలి. రేట్లు తగ్గే దశలో బాండ్లు మంచి రాబడిని ఇవ్వొచ్చు.

బాండ్లు ఎప్పుడు కొన‌డం మంచిది? Best Time to Invest in Bonds

స్టాక్‌ మార్కెట్ల ఒడిదుడుకులు పెరుగుతున్న వేళ, స్థిరమైన ఆదాయం అందించే పెట్టుబడుల కోసం ఎంతో మంది బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బాండ్లు ఎప్పుడు కొనడం మంచిదనే ప్ర‌శ్న‌కు.. ఆర్థిక నిపుణులు చెప్పే సమాధానం ఇలా ఉంది… బాండ్ల ధరలు–వడ్డీ రేట్లు ఒకదానికి ఒకటి విరుద్ధంగా కదలడం సర్వసాధారణం. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నప్పుడు బాండ్‌ ధరలు పెరుగుతాయి. అప్పుడు బాండ్లు కొనుగోలు చేస్తే మదుపరులకు మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ సమావేశాల్లో వడ్డీ కోతల సూచనలు కనబడితే, ఆ సమయం బాండ్‌ పెట్టుబడికి అనువైనదిగా సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు కూడా మరో మంచి సమయం. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తే.. కేంద్ర బ్యాంకులు సాధారణంగా వడ్డీ కోతలకు మొగ్గు చూపుతాయి. అదే సమయంలో బాండ్‌ మార్కెట్‌లో ధరలు బలపడటమే కాకుండా, దీర్ఘకాల బాండ్లు మరింత ఆకర్షణీయంగా మారతాయి. ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యే సమయంలో స్థిర ఆదాయం కోరుకునే మదుపరులు బాండ్లలోకి మళ్లడం సాధారణం. జియోపాలిటికల్‌ టెన్షన్‌, ఆర్థిక మందగమనం ఊహలు, స్టాక్‌ మార్కెట్‌ ఒత్తిడి ఉన్నప్పుడు ప్రభుత్వ బాండ్లు, AAA రేటెడ్‌ కార్పొరేట్‌ బాండ్లకు డిమాండ్‌ పెరుగుతుంది. మార్కెట్లో యీల్డ్స్‌ పెరిగితే బాండ్‌ ధరలు తాత్కాలికంగా తగ్గుతాయి. ఇది కొత్తగా ప్రవేశించే పెట్టుబడిదారులకు గోల్డెన్‌ ఛాన్స్. ఉదాహరణకు 10 ఏళ్ల గవర్నమెంట్‌ బాండ్‌ యీల్డ్‌ 7.5% దాటితే, చాలా మంది మదుపరులు దీన్ని కొనుగోలు అవకాశంగా భావిస్తారు.

బాండ్లులో ఎంత‌మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టాలి? How Much Should You Invest in Bonds?

బాండ్లులో ఎంత మొత్తం పెట్టాలనే విషయంలో ఒకే ఒక సూత్రం అందరికీ సరిపోదు. ఎందుకంటే వయసు, ఆదాయం, రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యాలు, లిక్విడిటీ అవసరం వీటన్నింటినీ బట్టి బాండ్‌ కేటాయింపు మారుతుంది. అయితే కొన్ని సామాన్యమైన నియమాలు మాత్రం పెట్టుబడిదారులకు సరైన మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. వయస్సు పెరిగే కొద్దీ బాండ్‌ వాటా పెంచాలి. ఉదాహరణకు వయస్సు 40 అయినవారికి ఈక్విటీ: 60%, బాండ్లు/డెట్‌: 40%, వయస్సు 55 అయితే ఈక్విటీ: 45%, బాండ్లు: 55% మేర పెట్టుబడులు పెట్టాలి. రిస్క్‌ తట్టుకోలేని వారికి పోర్ట్‌ఫోలియోలో 50–70% వరకు బాండ్లు సరిపోతాయి. రిస్క్‌ తీసుకునే వారికి 20–30% బాండ్‌ కేటాయింపు సరిపోతుంది. మీ లక్ష్యం 3–5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సినదే అయితే, ఈక్విటీకి వెళ్లే ముందు బాండ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు పిల్లల విద్య, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి ఖర్చులు, షార్ట్-టెర్మ్‌ సేవింగ్‌ ప్లాన్స్ ఇలాంటి వాటికి 60–80% వరకూ డెట్‌/బాండ్‌లు పెట్టడం మంచిది. దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ 15–20 సంవత్సరాల పెట్టుబడులు అయితే 30–40% బాండ్లు చాలు.

 

321
FEATURE NEWS Tags:Based on Credit Ratings…, Benefits of Investing in Bonds, Best Time to Invest in Bonds, Bonds Offered on Digital Bond Platforms, Don’t Forget Diversification, How Much Should You Invest in Bonds?, How to Reduce Risk While Investing in Bonds, Liquidity Risk You Shouldn’t Ignore, Returns Offered by Bonds, Strong Competition to Mutual Funds, Tax Implications to Keep in Mind, These Precautions Are a Must

Post navigation

Previous Post: మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now?
Next Post: జీడీపీ జోష్‌..!ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి! GDP Surge! Growth Hits Six-Quarter High

Related Posts

  • ఖాతాలో డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి నగదు రాలేదా? ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలంటే..! Money Debited but Not Dispensed from ATM? Here’s What to Do in Such Situations! FEATURE NEWS
  • సూక్ష్మ రుణాలు తగ్గుముఖం..!16.8 శాతం క్షీణత‌! Micro Loans Decline…! A Sharp 16.8% Drop FEATURE NEWS
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • 45-50 ఏళ్లలో పదవీ విరమణ ప్రణాళిక.. ఆలస్యమైనా ఆర్థిక భద్రత సాధ్యమే.. Retirement Planning at 45-50.. It’s Never Too Late to Build Financial Security FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • చిటికెలో రుణంతో జ‌ర భ‌ద్రం Secure with a loan in a pinch FEATURE NEWS
  • త్వరగా రిటైర్మెంట్ అవ్వాల‌నుకుంటున్నారా? అయితే 25x బడ్జెట్ సూత్రం మీకోసమే..! Want to Retire Early? The 25x Budget Rule Is for You! FINICAL PLANNING
  • మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడికి కార‌ణ‌మేంటి What is the reason for the intense pressure in the market? MARKET
  • కొత్త‌గా డీ మ్యాట్ ఓపెన్ చేశారా.. అయితే ఇలా చేయండి Have you opened a new demat MARKET
  • 35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60 FEATURE NEWS
  • LIC ఐపీవో.. పాల‌సీదారుల‌కు 10 శాతం రాయితీ 10 percent discount to policy holders in lic ipo MARKET
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఆన్‌లైన్‌ చెల్లింపులా.. కాస్త జాగ్ర‌త్త‌.. రుసుముల మోత త‌ప్ప‌దు! Online Payments? Stay Alert… Hidden Charges Can Hit Hard! FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme