బహుళ రుణాలను ఎలా ఎదుర్కోవాలి? How to Manage Multiple Loans?

పెరుగుతున్న జీవనశైలి ఆకాంక్షల కారణంగా చాలా మంది బహుళ రుణాలు (Multiple Loans) తీసుకుంటున్నారు. వ్యక్తిగత ఖర్చులు, కారు, ఇల్లు కొనుగోలు, చదువులు, బిజినెస్ మొదలైన అవసరాల కోసం బ్యాంకులు , ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకుంటున్నారు. అయితే తక్కువ సమయానికి అనేక రుణాలు తీసుకోవడం కొన్నిసార్లు తప్పనిసరిగా జరుగుతుంది. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో రుణ భారం పెరిగి ఆర్థిక బాధ్యతలు కూడా మరింత ఎక్కువవుతాయి. అందుకే బ‌హుళ‌ రుణాల నిర్వహణలో జాగ్రత్త అవసరం. క్రెడిట్ కార్డు రుణాలు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు, వాహన రుణాలు లాంటి బహుళ రుణాలు .. ఒకేసారి భారం పెంచితే ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. క్రెడిట్ స్కోరు నష్టం జ‌రుగుతుంది.

రుణాల మొత్తం తెలుసుకోవాలి..Know the Total Amount of Your Loans

ముందుగా మీరు తీసుకున్న అన్ని రుణాల మొత్తం(Multiple Loans), వడ్డీ రేట్లు, EMIల తేదీలు తెలుసుకోవాలి. ఒక లిస్ట్ తయారు చేసి స్పష్టంగా రుణ భారాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. తొలుత మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు, EMIలను లెక్కించండి. ముఖ్య ఖర్చులు, EMIలు ముందుగా చెల్లించి మిగిలిన ఖర్చులను తగ్గించడం ద్వారా రుణ భారం తగ్గించవచ్చు. క్రెడిట్ కార్డ్ రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి అధిక వడ్డీ రుణాలను ముందుగా తీర్చడం ద్వారా మొత్తం వడ్డీ భారం తగ్గుతుంది. పలు రుణాలను విలీనం చేయ‌డం వ‌ల్ల (ఒక‌ పెద్ద రుణంగా మార్చడం) ఒక్క EMI మాత్రమే చెల్లించాలి . దీంతో మొత్తం వడ్డీ భారం తగ్గుతుంది. నగదు ప్రవాహం సులభం అవుతుంది. ప్ర‌తి EMIని సకాలంలో చెల్లించడం ముఖ్యం. బ్యాంక్ ద్వారా ఆటో‑డెబిట్ ఏర్పాటు చేస్తే, ఆలస్యం వల్ల వచ్చే వడ్డీ పెరుగుదలను నివారించవచ్చు. వడ్డీ రేట్లను బ్యాంక్‌తో పునఃచర్చించడం ద్వారా EMIలు తగ్గడం సాధ్యమవుతుంది.

అదనపు ఆదాయం .. అత్య‌వ‌స‌ర నిధి ..Additional Income & Emergency Fund

బోనస్, పన్ను రీఫండ్ వంటి అదనపు ఆదాయాన్ని రుణాల (Multiple Loans) ముందస్తు చెల్లింపులకు వినియోగించడం వల్ల, వడ్డీ భారం తగ్గించుకోవ‌చ్చు. రుణాల భారం నుంచి వేగంగా బయటపడవచ్చు.ఆప‌ద‌ల స‌మ‌యాల్లో రుణ చెల్లింపులు నిలిచిపోకుండా 3–6 నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధిని ముందుగానే సిద్ధం చేయాలి. మునుపటి రుణాలను పూర్తి చేయకుండానే కొత్త రుణాలు తీసుకోవడం భారం పెంచుతుంది. కాబట్టి కొత్త రుణాలపై జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా రుణాల నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తే, ఆర్థిక భారం తగ్గి, క్రెడిట్ స్కోరు కూడా సురక్షితం అవుతుంది.

ఆర్థిక పరిపుష్టి ఉండాలి…Maintain Financial Discipline

రుణాలు(Multiple Loans) తిరిగి చెల్లించే సామర్థ్యం తప్పక కలిగి ఉండాలి. ప్రతి EMI, మీ ఇతర ఖర్చులు, అత్యవసర అవసరాలు అన్నీ కలిపి మీ నెలవారీ ఆదాయంలో తగిన స్థాయిలో ఉండాలి. మీ నెలవారీ ఆదాయంలో 40% కంటే ఎక్కువ EMIలకు కేటాయించ కూడదు. ఈ నియమాన్ని పాటించడం ద్వారా, ఇతర ఖర్చులు, అవసరాలు, అత్యవసర పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అన్ని EMIలు సమయానికి చెల్లించాలి. బ్యాంక్ ఆటో‑డెబిట్ ద్వారా EMI చెల్లింపు సులభమ‌వుతుంది. ఆలస్యం వల్ల వచ్చే వడ్డీ పెరుగుదలను నివారించవచ్చు. దీన‌వ‌ల్ల‌ క్రెడిట్ స్కోరు సురక్షితమ‌వుతుంది. కొత్త రుణం తీసుకునే ముందు, ఇప్పటికే ఉన్న రుణాల EMIలను లెక్కించి, వాటితో పాటు కొత్త రుణం కూడా manageable అవుతుందా అని నిర్ధారించండి. రుణాలన్నింటికి ఒక స్పష్టమైన repayment వ్యూహం ఉండాలి.

ఆల‌స్యంగా చెల్లిస్తే..Delay in Payments Can Affect Credit

(Multiple Loans) బహుళ రుణాలున్నప్పుడు ప్రతి EMI షెడ్యూల్ ప్రకారం చెల్లించడం అత్యవసరం. ఆలస్యం చేస్తే వడ్డీ పెరుగుతుంది. ఫైనాన్షియల్ రికార్డులో నెగటివ్ సూచన వస్తుంది. తద్వారా క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. పర్సనల్ లోన్ EMIలు తప్పక సమయానికి చెల్లించాలి. ఒక EMI మిస్ అయినా 50 పాయింట్లు వరకు స్కోరు తగ్గవచ్చు. ఇది భవిష్యత్తులో కొత్త రుణాలు లేదా క్రెడిట్ కార్డుల పొందడంలో సమస్యలు తలెత్తిస్తుంది. బ్యాంక్ ఆటో‑డెబిట్ ద్వారా EMI చెల్లించడం ఉత్త‌మం. రిమైండర్స్, రుణాల లిస్టు వాడి ప్రతి EMIని track చేసుకోవాలి. ఇది రుణాల డిఫాల్ట్ నుండి రక్షణ కల్పిస్తుంది.

రుణ ఏకీకరణ అంటే ఏమిటి? What is Loan Consolidation?

(Multiple Loans) రుణ ఏకీకరణ అంటే.. మీకు ఉన్న అనేక చిన్న రుణాలను ఒకే పెద్ద రుణంగా మార్చడం. వేర్వేరు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుండి తీసుకున్న రుణాలను కలిపి ఒకే EMI చెల్లించడం మేలు. తక్కువ వడ్డీ రేటుతో చెల్లింపులు చేయడం వల్ల, వడ్డీ భారం తగ్గుతుంది. అన్ని EMIలు ఒకే రుణంలో కలుపడం వల్ల నిబంధనలు సులభంగా నిర్వహించవచ్చు. రుణ ఏకీకరణతో EMIలు తగ్గుతాయి. అధిక రేటు ఉన్న క్రెడిట్ కార్డు రుణాలను తీర్చేసి, తక్కువ వడ్డీ రేటు రుణం ద్వారా నెలవారీ EMI తగ్గించవచ్చు. వేర్వేరు రుణాల వడ్డీ బాధ్య‌తను తగ్గించి, ఆర్థిక ఒత్తిడి తగ్గిస్తుంది. ఒక్క రుణం, ఒక్క EMI చెల్లించడం వల్ల అన్ని రుణాల bookkeeping సులభం అవుతుంది. మీకు తగినంత చెల్లించే సామర్థ్యం ఉంటే, రుణ ఏకీకరణ ద్వారా కొన్ని రుణాల వడ్డీ భారం తగ్గుతుంది. ఎక్కువ కాలపరిమితి (Tenure) ఎంచుకోవచ్చు. తద్వారా EMI తగ్గించి manageable గా ఉండేలా చేసుకోవచ్చు. కాగా అన్ని రుణ సంస్థలు రుణ ఏకీకరణ అందించవు. మీకు మంచి చెల్లింపు చరిత్ర (Payment History), అధిక క్రెడిట్ స్కోరు ఉంటే ఈ సౌక‌ర్యాన్ని అందిస్తాయి.

ప్రీ-క్లోజర్ అంటే ..?What is Pre-Closure?

ప్రీ-క్లోజర్ అనేది రుణాన్ని చివరి తేదీకి చేరక ముందే పూర్తిగా చెల్లించి క్లోజ్ చేయడం. కొన్ని రుణాలపై (Multiple Loans) ఇది జరిమానా లేకుండా సాధ్యమే. రుణాన్ని ముందుగానే క్లోజ్ చేయడం వల్ల EMI ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాలను ముందుగానే చెల్లించడం ద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు వ్యక్తిగత రుణం , ఇంటి రుణం ఉన్నప్పుడు, అధిక వడ్డీ ఉన్న వ్యక్తిగత రుణాన్ని ముందుగా క్లోజ్ చేయడం మేలు. దీనివ‌ల్ల‌బహుళ రుణాల నుండి వచ్చే ఆర్థిక గందరగోళం తగ్గుతుంది. ప్రీ-క్లోజర్ చేయాలంటే ముందుగా రుణాల జాబితా తయారు చేయాలి. ప్రతి రుణం వడ్డీ రేటు, EMI, ప్రీ-క్లోజర్ చార్జీలను గమనించాలి. అధిక వడ్డీ రుణాలను ముందుగా చెల్లించడం ద్వారా మీ ఖర్చు తగ్గుతుంది. కొన్ని రుణాలపై ప్రీ-క్లోజర్ రుసుములు ఉండవు. అందుకే వీటిని ముందుగా చెల్లించడం అత్యంత సులభం. రుణాల సంఖ్య ఎక్కువ ఉన్నవారికి ఈ వ్యూహం అత్యంత సహాయపడుతుంది.

ఆటోమేటిక్ చెల్లింపులు (AutoPay) ఎందుకు అవసరమంటే? Why Are Automatic Payments (AutoPay) Necessary?

బహుళ రుణాల(Multiple Loans) యుగంలో, ప్రతి నెలా అన్ని EMIలను సరైన సమయంలో చెల్లించడం చాలా కష్టం. కొన్నిసార్లు మర్చిపోవడం, మ‌రికొన్నిసార్లు తగిన మొత్తాన్ని సిద్ధం చేయకపోవడం త‌దిత‌ర కార‌ణాల‌తో EMIలను స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌చ్చు. ఇలా జ‌రిగితే జరిమానాలు మాత్రమే కాక, క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపవచ్చు. అందుకే EMI మర్చిపోకుండా రుణాలను సులభంగా చెల్లించ‌డం కోసం ఆటోపే స‌రైన ప‌ద్ధ‌తి. మీ బ్యాంకు ఖాతా ద్వారా ఆటోమేటిక్ EMI చెల్లింపులు సెటప్ చేయడం సులభమైన మార్గం. ఖాతాలో సరిపడా నిల్వ ఉన్నంత వరకు EMIలు డిఫాల్ట్ కావు. ఇది EMIలు మిస్ కాకుండా, క్రెడిట్ స్కోరు రక్షణకు సహాయపడుతుంది. మీ బ్యాంక్ ఆన్‌లైన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవ్వాలి. Loan/EMI AutoPay ఆప్షన్‌ని ఎంచుకోవాలి. మొత్తం EMI, డ్యూ డేట్, ఖాతా నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. వీలయితే, జీతం వచ్చిన వెంటనే EMI డెబిట్ అయ్యేలా సెటప్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *