Skip to content
dhanammoolam.com

dhanammoolam.com

money makes everything perfect

Primary Menu
  • INSURANCE
  • FEATURE NEWS
  • MARKET
  • NEWS
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS
Watch Video
  • FEATURE NEWS

జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు  national pension system changes

admin 04/10/2025
national-pension-system-a-detailed-guide

జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు

national pension system changes

ప్ర‌స్తుత‌ మార్కెట్‌ పరిస్థితుల్లో… ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం కొంతమందికి రిస్క్‌గా మారింది. మార్కెట్‌ చలనం ఎక్కువగా ఉండటం, రాబడులు ఊహించినంత స్థిరంగా రాకపోవడం కారణంగా పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు. అదే సమయంలో, ప్రభుత్వం అందిస్తున్న సురక్షిత, దీర్ఘకాలిక పొదుపు పథకాలు పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ ప్రభుత్వ పథకాల్లో నిరంతర పెట్టుబడులు పెడితే, 20–25 సంవత్సరాల వ్యవధిలో ఇండెక్స్‌ ఫండ్ల కంటే ₹3.6 కోట్లు ఎక్కువ రాబడి పొందవచ్చని వెల్లడించారు. నిపుణులు సూచిస్తున్నట్లు, పెట్టుబడులు ప్రారంభించే ముందు రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయడం , ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పరిశీలించడం మేలని సూచిస్తున్నారు.

ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం దండగే!

Investing in Index Funds Is Risky!

నేటి పెట్టుబడిదారులు ఎక్కువ లాభాల ఆశతో స్టాక్‌ మార్కెట్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, నిపుణులు చెబుతున్నట్లు ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌ చలనం ఎక్కువగా ఉండడం, లాంగ్‌టర్మ్‌ రాబడులు ఊహించినంతగా రాకపోవడం, ఫండ్ల నిర్వహణ ఖర్చులు ఉన్న కారణంగా ఈ ఫండ్లు అందరికీ సరిపోవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు మార్కెట్‌ రిస్క్‌, మరోవైపు రాబడుల అస్థిరత   మధ్య ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం కొంతమందికి దండగగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

జాతీయ పింఛన్‌ వ్యవస్థలో కీలక మార్పులు!

Key Changes in the National Pension System!

– నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) అనేది భారతీయ పౌరుల పదవీ విరమణ కోసం పొదుపును ప్రోత్సహించడానికి రూపొందించబడిన ప్రభుత్వ పథకం. ఇందులో చందాదారులకు ఒక ప్రత్యేకమైన శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) కేటాయించబడుతుంది. దీని ద్వారా వారు తమ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించుకుంటారు.

– కేంద్ర ప్రభుత్వం  జాతీయ పింఛన్‌ వ్యవస్థ (NPS)లో పలు కీలక మార్పులు చేసింది. ఈ మేర‌కు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్పులు పెట్టుబడిదారులకు మరింత పారదర్శకతతో పాటు లాభదాయకతను అందించనున్నాయని నిపుణులు  చెబుతున్నారు.  తాజా నిబంధనల ప్రకారం  పెట్టుబడి పరిమితులు పెంపు, ఆటో ఛాయిస్‌ ఆప్షన్‌లో సవరణలు,  రిటైర్మెంట్‌ తర్వాత ఉపసంహరణలో సౌలభ్యం కల్పించారు. ఇకపై పెట్టుబడిదారులు తమ రిస్క్‌ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఫండ్‌ అలొకేషన్‌ చేసుకునే వీలు ఉంటుంది. అంతేకాకుండా, NPS ఖాతాల నిర్వహణలో ఆన్‌లైన్‌ సౌకర్యాలు మరింత బలోపేతం చేయడంతో పాటు పోర్టబిలిటీ కూడా సులభతరం చేశారు. దీని వల్ల‌ ఉద్యోగ మార్పులు జరిగినా పింఛన్‌ ఖాతా యథాతథంగా కొనసాగుతుంది. దీర్ఘకాలిక రాబడుల కోసం NPS అత్యుత్తమ ఎంపికగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు.

NPSలో పెరుగుతున్న అవకాశాలు … Growing Opportunities in NPS

జాతీయ పింఛన్‌ వ్యవస్థ (NPS) మరింత ఆకర్షణీయంగా మారేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఇటీవల కీలక మార్పులు ప్రకటించింది.

తాజా మార్పులు:  Latest Changes

ఈక్విటీ పెట్టుబడుల గరిష్ట పరిమితి పెంపు: యువ పెట్టుబడిదారులకు ఎక్కువ రాబడుల అవకాశం

లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ మోడల్‌లో సవరణలు: వయస్సు పెరగడానికి అనుగుణంగా ఫండ్‌ అలొకేషన్ ఆటోమేటిక్‌గా మారుతుంది

అధిక పారదర్శకత: ఖాతాదారులు తమ ఫండ్‌లను ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా ట్రాక్‌ చేయగలరు

పోర్టబిలిటీ: ఉద్యోగ మార్పులు జరిగినా ఖాతా యథాతథంగా కొనసాగుతుంది

ఫండ్‌ నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలు: పెట్టుబడులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి నిబంధనలు

టైర్‌–1 ఖాతా..Tier-1 Account

పెన్షన్‌ భద్రత కోరుకునే ఉద్యోగులకు  జాతీయ పింఛన్‌ వ్యవస్థ (NPS) లోని టైర్‌–1 ఖాతా ప్రధాన ఆధారంగా మారుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు తప్పనిసరిగా తెరవాల్సిన ఈ ఖాతా ద్వారా దీర్ఘకాలిక పొదుపులు , పన్ను మినహాయింపులు లభిస్తాయి. టైర్‌–1 ఖాతాలో ప్రతి నెలా కనీసం ₹500 పెట్టుబడి పెట్టడం తప్పనిసరి. వార్షికంగా కనీసం ₹1,000 చెల్లిస్తే ఖాతా చురుకుగా కొనసాగుతుంది. ఈ ఖాతా నుంచి రిటైర్మెంట్‌ వయస్సు చేరేవరకు డబ్బు ఉపసంహరణకు పరిమితులు ఉంటాయి. తద్వారా నిరంతర పొదుపులు కొనసాగుతాయి. టైర్‌–1 ఖాతా ద్వారా పెట్టుబడిదారులు మార్కెట్‌ ఆధారిత రాబడులు పొందడమే కాకుండా, రిటైర్మెంట్‌ తర్వాత నిర్ధారిత పింఛన్‌ కూడా పొందే అవకాశం ఉంది. అదనంగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టంలోని 80C, 80CCD(1B) సెక్షన్‌ల కింద ₹2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం టైర్‌–1 ఖాతా తప్పనిసరి ఎంపికగా పరిగణించాలి.

కొత్త ప‌రిమితులు .. New Limits

టైర్‌–1 ఖాతా   పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఈక్విటీల (Equity) లో పెట్టుబడులకు కొత్త పరిమితులు (Cap) విధిస్తూ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.  టైర్‌–1 ఖాతాలో ఈక్విటీలలో గరిష్టంగా 75% వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ ఈ శాతం ఆటోమేటిక్‌గా తగ్గే విధంగా లైఫ్‌ సైకిల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మోడల్‌ అమలు చేయబడుతుంది. దీని వల్ల‌ రిటైర్మెంట్‌ సమయానికి రిస్క్‌ తగ్గి, స్థిరమైన రాబడులు లభించే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారుల రక్షణ కోసం,  మార్కెట్‌ ఒడిదుడుకుల ప్రభావం తగ్గించేందుకు  ఈ మార్పులు చేసిన‌ట్టుగా  పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్మెంట్‌ అథారిటీ (PFRDA) తెలిపింది.

నియమాలు కఠినం .. Strict Rules

జాతీయ పింఛన్‌ వ్యవస్థ (NPS)లోని టైర్‌1 ఖాతా ప్రధానంగా రిటైర్మెంట్‌ పొదుపుల కోసం రూపొందించబడింది. అందుకే ఈ ఖాతా నుంచి డబ్బు ఉపసంహరణ (Withdraw) పై కఠినమైన నియమాలు అమల్లో ఉన్నాయి.

– రిటైర్మెంట్‌ తర్వాత (60 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు)

రిటైర్మెంట్‌ వయస్సు చేరిన తర్వాత ఖాతా మొత్తం నుంచి కనీసం 40% అన్యుటీ (Pension Plan) కొనుగోలుకు ఉపయోగించాలి. మిగిలిన 60% మొత్తాన్ని పన్ను మినహాయింపుతో ఉపసంహరించుకోవచ్చు.

రిటైర్మెంట్‌కి ముందే ఉపసంహరణ (Partial Withdrawals):

ఖాతాదారుడు కనీసం 10 సంవత్సరాలు NPSలో కొనసాగి ఉంటే, జీవితంలో మూడు సార్లు వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం నిధుల 25% వరకు మాత్రమే అనుమతించబడుతుంది.

– రిటైర్మెంట్‌కి ముందే పూర్తి ఉపసంహరణ (Exit before 60 years):

60 సంవత్సరాలకు ముందే ఖాతాను మూసివేయాలంటే 80% మొత్తం అన్యుటీగా మార్చాలి, మిగిలిన 20% మాత్రమే నగదుగా తీసుకోవచ్చు.

దీర్ఘకాలిక భద్రతకు కొత్త దారి! A New Path to Long-Term Security

– పెన్షన్‌ కాలంలో ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారికి మార్కెట్‌ ఆధారిత కొత్త మార్గం తెరుచుకుంది. పెట్టుబడిదారుల రిటైర్మెంట్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇండెక్స్‌ ఫండ్‌లతో రిటైర్మెంట్‌ ప్లాన్లు ఆఫర్‌ చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు.

– ఈ ప్లాన్‌లో పెట్టుబడి చేసిన మొత్తం మార్కెట్‌ సూచీలు (Index)‌ ఆధారంగా పెరుగుతుంది. దీర్ఘకాలంలో మార్కెట్‌ పెరుగుదల వలన సగటు 10–12% వరకు రాబడులు లభించే అవకాశం ఉంది. రిటైర్మెంట్‌ సమయానికి పెద్ద మొత్తంలో ఫండ్‌ సిద్ధమవుతుంది.

ప్రధాన ప్రయోజనాలు … Key Benefits

లాంగ్‌టర్మ్‌ గ్రోత్‌: మార్కెట్‌ పెరుగుదలతో సమానంగా మీ పెట్టుబడి పెరుగుతుంది

తక్కువ ఖర్చు: యాక్టివ్‌ ఫండ్‌లతో పోలిస్తే ఖర్చులు తక్కువ

సులభ పెట్టుబడి: SIP ద్వారా నెలనెలా పెట్టుబడులు

రిటైర్మెంట్‌ సమయానికి పెద్ద ఫండ్‌: భవిష్యత్‌ ఖర్చులకు ఆర్థిక భరోసా

ఇండెక్స్‌ ఫండ్‌ ప్లాన్‌ vs జాతీయ పింఛన్‌ వ్యవస్థ (Index Fund Plan vs NPS )

రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రత కోసం పెట్టుబడిదారులు పలు మార్గాలను పరిశీలిస్తున్నారు. అందులో ఇండెక్స్‌ ఫండ్‌ ప్లాన్‌లు , జాతీయ పింఛన్‌ వ్యవస్థ (NPS) ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. రెండు పథకాలకూ ప్రత్యేకమైన ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి.

– ఇండెక్స్‌ ఫండ్‌ ప్లాన్‌లు మార్కెట్‌ సూచీల ఆధారంగా నడుస్తాయి. దీర్ఘకాలంలో సగటు 10%–12% వరకు రాబడి సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. లాక్‌-ఇన్‌ లేకపోవడం, ఎప్పుడైనా ఉపసంహరణ చేసుకునే వీలుండడం వీటి ప్రధాన ఆకర్షణ. అయితే మార్కెట్‌ ఒడిదుడుకులు ఎక్కువగా ఉండడంతో రిస్క్‌ కూడా అధికం.

– ఇక NPS (టియర్‌–1 ఖాతా) ప్రభుత్వ ఆధారిత రిటైర్మెంట్‌ పథకం. మార్కెట్ , బాండ్ల మిశ్రమంతో పెట్టుబడులు నిర్వహించబడతాయి. రిస్క్‌ తక్కువగా ఉండి, పన్ను మినహాయింపులు (₹2 లక్షల వరకు) కూడా లభిస్తాయి. అయితే 60 సంవత్సరాల వరకు లాక్‌-ఇన్‌ ఉండడం, ఉపసంహరణపై నియంత్రణ ఉండటం పెట్టుబడిదారులకు కొంత ఇబ్బందిగా మారవచ్చు. ఉద్యోగులు, స్వయం ఉపాధి వృత్తులు, రిటైర్మెంట్‌ భద్రత కోరుకునేవారికి ఇది అనుకూలం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

About the Author

admin

Administrator

View All Posts
164

Post navigation

Previous: బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
Next: 2025లో అత్యుత్తమ 3 విలువ ఫండ్లు | వాల్యూ రీసెర్చ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం Top 3 Best Value Funds of 2025 | As per Value Research Rankings

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related Stories

pf-withdrawal-atm
  • FEATURE NEWS

ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI

admin 17/12/2025 0
trade-deficit
  • FEATURE NEWS
  • Uncategorized

5 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు..60% తగ్గిన పసిడి దిగుమతులు! Trade Deficit Hits 5-Month Low… Gold Imports Drop 60%!

admin 16/12/2025 0
spend money
  • FEATURE NEWS

ఖ‌ర్చుల‌కు ఏ మాత్రం త‌గ్గేదేలే..! భవిష్యత్తుపై భారతీయుల్లో అధిక విశ్వాసం No Let-Up in Spending..! Indians Show Strong Confidence in the Future

admin 16/12/2025 0
  • BOOKS
  • FEATURE NEWS
  • FINICAL PLANNING
  • INSURANCE
  • INVESTMENTS
  • MARKET
  • MONEY TIPS
  • MUTUAL FUNDS
  • NEWS
  • Uncategorized
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI
  • మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further
  • సీఈఓలకు భ‌లే గిరాకీ … రూ.9 కోట్ల పైగా వార్షిక వేతనం ! CEOs Enjoy High Demand… Annual Salaries Over ₹9 Crore!
  • 600 బిలియన్‌ డాలర్ల అధిపతిగా ఎలాన్‌ మస్క్ .. Elon Musk Becomes a $600 Billion Tycoon
  • ABOUT US
  • Blog
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Privacy Policy
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI
  • మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further
  • సీఈఓలకు భ‌లే గిరాకీ … రూ.9 కోట్ల పైగా వార్షిక వేతనం ! CEOs Enjoy High Demand… Annual Salaries Over ₹9 Crore!
  • 600 బిలియన్‌ డాలర్ల అధిపతిగా ఎలాన్‌ మస్క్ .. Elon Musk Becomes a $600 Billion Tycoon

Recent Posts

  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI
  • మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further
  • సీఈఓలకు భ‌లే గిరాకీ … రూ.9 కోట్ల పైగా వార్షిక వేతనం ! CEOs Enjoy High Demand… Annual Salaries Over ₹9 Crore!
  • 600 బిలియన్‌ డాలర్ల అధిపతిగా ఎలాన్‌ మస్క్ .. Elon Musk Becomes a $600 Billion Tycoon

Categories

  • BOOKS
  • FEATURE NEWS
  • FINICAL PLANNING
  • INSURANCE
  • INVESTMENTS
  • MARKET
  • MONEY TIPS
  • MUTUAL FUNDS
  • NEWS
  • Uncategorized

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take Benefits Caution is Essential Compared to Other Countries… Convenience difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Geopolitical Tensions how many bank accounts can a person have HOW TO FINDOUT MULTI BAGGER STOCKS how To get financial freedom How to improve CIBIL Score how to save money for children Interest Rate Investor Enthusiasm is crypto investments are safe Key Highlights Market Expansion New Limits Precautions Recommendations for Investors Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the benifits of credit cards what are the best financial rules what are the charges for bank account what is cbdc What is Personal loan and how to get personal loan what is Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana what is scuttlebutt investing in stock market what is share buyback what is the story behind the name of  air india WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Blog
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Privacy Policy

Widget (Calendar)

December 2025
S M T W T F S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
« Nov    

You may have missed

pf-withdrawal-atm
  • FEATURE NEWS

ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI

admin 17/12/2025 0
market
  • MARKET

మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out

admin 17/12/2025 0
rupee
  • NEWS

మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further

admin 16/12/2025 0
ceos
  • NEWS

సీఈఓలకు భ‌లే గిరాకీ … రూ.9 కోట్ల పైగా వార్షిక వేతనం ! CEOs Enjoy High Demand… Annual Salaries Over ₹9 Crore!

admin 16/12/2025 0
Copyright © All rights reserved. | MoreNews by AF themes.