బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దాని ధర , విలువ అమాంతం ఎగబాకడం సామాన్య, మధ్య తరగతి వర్గాలను కలవరపరుస్తోంది. అయితే పలు కారణాల రీత్యా బంగారంపై రుణాల సంఖ్య కూడా అదే సంఖ్యలో పెరుగుతోంది. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడులు.. ఇలా వివిధ అవసరాలకు ప్రజలు బ్యాంకుల్లో బంగారు రుణాలు (Gold Loans) పొందుతున్నారు. తాకట్టు పెట్టిన ఆభరణాలపై మరింత మొత్తాన్ని రుణంగా పొందుతన్నారు. గోల్డ్ రుణాలు.. తిరిగి వసూలు (రికవరీ) లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రుణాలు తీసుకున్న వారు నిర్దేశిత గడువులోగా చెల్లించకపోవడంతో 40శాతానికి మంది రుణగ్రహీతలు ఎగవేతదారుల జాబితాలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు సరికొత్త ఆంక్షలు విధించాయి .ఇకపై బంగారు రుణాలపై ప్రతినెలా వడ్డీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశాయి. లేకుంటే సిబిల్ స్కోర్ పడిపోనుంది.
ఆంక్షలు ఎందుకంటే? Why These Restrictions?
వాస్తవంగా బంగారు రుణాలు (Gold Loans) చాలా సులభంగా లభ్యమవుతాయి. ఎవరైనా బంగారపు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు (pledge) చేసి వెంటనే నగదు రుణంగా పొందవచ్చు. కానీ ఈ రుణాల పెరిగిన డీఫాల్ట్‌లు (Repayment failure) బ్యాంకులకు క్యాష్ ఫ్లో సమస్యల్ని, అనిశ్చిత అంశాలను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఎక్కువ అయిపోవటం వల్ల చేయూతగా రుణాలు పెరిగిపోయాయి. కానీ తిరిగి చెల్లించే వారి సంఖ్య బాగా తగ్గింది. బంగారం ధరలు పెరగడం ఒక్కపక్క పెట్టుబడిదారులకు లాభమయినా, మరోపక్క రుణాల డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థలో కొత్త ఒత్తిడిని తెచ్చింది. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
రిన్యూవల్ (Renewal) / రీషెడ్యూల్ (Reschedule) పై నిషేధం
Ban on Renewal and Rescheduling of Gold Loans
గతంలో ఒక బంగారు రుణం గడువును పొడిగించుకోవడం (renewal) సాధ్యమవుతుండేది. కానీ ఇప్పుడు బ్యాంకులు ఇలాంటి పొడగింపునకు అనుమతి ఇవ్వవు. బంగారు రుణాన్ని పొందినపటి నుంచి గరిష్టంగా 12 నెలల్లో అసలు రుణం + వడ్డీ మొత్తం చెల్లించాలి. ఈ గడువు దాటితే, అలాగే చెల్లించకపోతే ఖాతాదారును డిఫాల్టరుగా ప్రకటించొచ్చు. 15 నెలలు దాటితే బ్యాంకులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంటుంది.
లోన్ టు వాల్యూ (LTV: Loan-to-Value) పరిమితులు
Loan-to-Value (LTV) Limits
బంగారు ఆభరణాల విలువ ఆధారంగా రుణనుష్పత్తి (LTV) నిష్పత్తులపై నియంత్రణలు మరింత కఠినతరం చేశారు. ఉదాహరణకు.. ఒక బ్యాంక్ నిబంధన ప్రకారం, 22 క్యారెట్ బంగారంపై 75% వరకు మాత్రమే రుణాన్ని అనుమతించగలరు.
వ్యవసాయం, MSME రుణాల కోసం .. For Agriculture and MSME Loans
వాణిజ్య ప్రయోజనం కాకుండా, వ్యవసాయం లేదా MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు) అవసరాల కోసం ఇచ్చే రుణాల్లో, ఇప్పుడు బంగారం / వెండి తాకట్టు పెట్టడం లాగానే ఒక రుణ హామిగా పరిగణించబడుతుంది. అంటే, స్వచ్ఛందంగా ఆభరణాలను తాకట్టు పెట్టినవారికి ఇది ఒక అదనపు అవకాశం.
పాత లోన్ చెల్లిస్తేనే కొత్త రుణం .. New Loan Only After Repaying Old Loan
కొత్త రుణాన్ని మంజూరు చేయడానికి ముందు, పాత రుణాన్ని పూర్తిగా చెల్లించాలి. అదే బంగారం ఆధారంగా మరొక రుణాన్ని ఇవ్వరు.
రుణగ్రహీతలకు ఎదురయ్యే సవాళ్లు, జాగ్రత్తలు
Challenges and Precautions for Borrowers
రుణం చెల్లించలేని పరిస్థితిలో బంగారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
వడ్డీలను, రుణ భాగాన్ని సమయానికి చెల్లించకపోతే డిఫాల్టర్‌గా గుర్తింపు, క్రెడిట్ స్కోర్ పై ప్రభావం.
బంగారం ధర.. బ్యాంకుల్లో లోన్లు.. Gold Prices and Bank Loans
కొన్ని నగరాల్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,20,000 – ₹1,24,000 మధ్య ఉంది. అయితే బ్యాంకుల్లో గోల్డ్ లోన్, వడ్డీల శాతం ఎలా ఉందో తెలుసుకుందాం.
HDFC Bank-లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు సుమారు 9.30% – 17.86% మధ్య ఉన్నాయి
ICICI Bank లో స్వల్ప వడ్డీ రేట్లు 9.15% నుంచి ఉన్నాయి.
SBI (State Bank of India) గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7.50% నుంచి ప్రారంభమవుతాయి.
Axis Bank గోల్డ్ లోన్‌లో వడ్డీ రేట్లు 9.75% నుండి 17.00% వరకు ఉన్నట్లు ప్రకటించాయి.
రుణ పరిమాణం & LTV … Loan Amount & LTV
బ్యాంకులు సాధారణంగా గోల్డ్ విలువకు 70% – 85% వరకు (Loan-to-Value) రుణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని బ్యాంకులు తక్కువ శానుభూతి LTVలను అమలు చేయవచ్చు, రుణ భద్రత కొలతలు, పూర్వ రుణ చెల్లింపు రికార్డు ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్ని బ్యాంకులు 6 నెలల నుండి 36 నెలల (1–3 సంవత్సరాల) కాలపరిమితి ఇస్తాయి. మరికొన్ని బ్యాంకులు కేవలం వడ్డీ చెల్లింపు (interest only) ఆప్షన్ కల్పిస్తాయి . చివరిలో అసలు రుణ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజులు, మూల్యాంకన ఛార్జీలు, మొబైల్ / స్టాంప్ చార్జీలు అనేవి ఆ బ్యాంకు విధానాలపై ఆధారపడి ఉంటాయి.
సక్రమంగా వడ్డీ చెల్లించకపోతే..?
What Happens If Interest Is Not Paid on Time?
బ్యాంకులు ప్రతి నెల రుణంపై వడ్డీ వసూలు చేస్తాయి. ఎవరైనా సమయానికి వడ్డీ చెల్లించకపోతే మొదట పెనాల్టీ వడ్డీ (Penalty Interest) విధిస్తారు. కొన్ని బ్యాంకులు 1%–2% అదనంగా వసూలు చేస్తాయి. వడ్డీ పెండింగ్‌గా ఉంటే, అది తదుపరి నెల వడ్డీలో కలిసిపోతుంది. అంటే కాంపౌండ్ ఇంటరెస్ట్ విధానం వర్తిస్తుంది. రెండో దశ లో CIBIL స్కోర్‌పై ప్రభావం పడుతుంది. నెలవారీ వడ్డీ చెల్లించకపోవడం వల్ల క్రెడిట్ హిస్టరీలో డిఫాల్ట్‌గా నమోదు అవుతుంది. CIBIL స్కోర్ 20–30 పాయింట్ల వరకు తగ్గవచ్చు. భవిష్యత్తులో మీరు ఏ రుణం తీసుకోవాలన్నా (హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్) బ్యాంకులు అనుమానంతో చూస్తాయి. మూడో దశ లో బంగారం వేలం వేస్తారు. రుణ గడువు ముగిసే నాటికి వడ్డీ, అసలు మొత్తం చెల్లించకపోతే బ్యాంకు / NBFC సంస్థ తాకట్టు బంగారాన్ని వేలం వేయడానికి నోటీసు జారీ చేస్తుంది. 12 నెలల రుణ గడువు పూర్తయిన 3 నెలల లోపు నోటీసు పంపిస్తారు. చెల్లింపు జరగకపోతే వేలం ప్రక్రియ మొదలవుతుంది. బంగారం అమ్మకం ద్వారా రుణం తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మాత్రమే కస్టమర్‌కి తిరిగి ఇస్తారు. ఉదాహరణకు మీరు ₹2 లక్షల బంగారం రుణం తీసుకున్నారని అనుకోండి. వడ్డీ రేటు 10% అనుకుంటే నెలకు ₹1,666 చెల్లించాలి. మూడు నెలలు చెల్లించకపోతే ₹5,000 వడ్డీ పెండింగ్ అవుతుంది. దానికి పైగా పెనాల్టీ వడ్డీ (దాదాపు ₹500–₹700) జోడిస్తారు.
ఇలా క్రమంగా బకాయి వడ్డీ బరువు పెరిగి అసలు రుణానికి దగ్గరగా చేరుతుంది.
