డిజిటల్ విప్లవంలో భాగంగా, ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే ఇంటరోపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (ICCW) సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇది సౌకర్యాన్ని పెంచడమే కాకుండా డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేస్తోంది. కానీ, ఈ సాంకేతిక ప్రక్రియలో అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఏటీఎంలో యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేస్తున్న సమయంలో చాలామంది ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది. కానీ ఏటీఎం నుండి డబ్బులు బయటకు రాలేదు. ఇటువంటి సందర్భాలలో ఖాతారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నాయి. ఖాతాలో మీ డబ్బు కట్ అయినా, ఏటీఎం నుంచి నగదు రాలేదు అంటే ఖాతాదారులు వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. వెంటనే సంబంధిత బ్యాంక్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. బ్యాంకు వెబ్‌సైట్‌లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అయితే అన్ని రసీదులు, స్టేట్‌మెంట్‌లు భద్రంగా ఉంచడం చాలా ముఖ్యం. దీని ద్వారా డబ్బు తిరిగి వచ్చేలా చూసుకోవచ్చు. సమస్యలు ఎదురుకాకుండా నివారించవచ్చు.
ఎలా ఫిర్యాదు చేయాలంటే ..? How to Lodge a Complaint…?
– “డెబిట్ సక్సెస్, క్యాష్ నాట్ డిస్పెన్స్‌డ్” సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఎస్బీఐ కొన్ని కీలక సూచనలను చేసింది. తొలుత ఎస్బీఐ ఫిర్యాదుల నిర్వహణ వెబ్‌సైట్ crh.sbi.bank.in ను ఓపెన్ చేయాలి . మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. Raise Request/Complaint ఆప్షన్ ఎంచుకోవాలి. సమస్య ఎదురైన ఖాతా నంబర్ను సెలక్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ హిస్టరీలో సంబంధిత లావాదేవీని ఎంచుకుని, డ్రాప్‌డౌన్ మెనూలో UPI Merchant Transaction ఆప్షన్‌ను గుర్తించాలి. ఘటన జరిగిన తేదీ, సమయం, ఏటీఎం ఐడీ వంటి వివరాలను క్లుప్తంగా నమోదు చేయాలి. ఈ విధంగా ఫిర్యాదు చేయడం ద్వారా బ్యాంక్ సమస్యను వెరిఫై చేసి, డబ్బు రికవరీ కోసం చర్యలు తీసుకుంటుంది.
– ఏటీఎం లేదా డిజిటల్ లావాదేవీలలో సమస్యలు ఎదురైనప్పుడు, ఎస్బీఐ తప్ప మరే ఇతర బ్యాంక్ ఖాతాదారులైనా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా బ్యాంక్ కస్టమర్ కేర్ సంప్రదించాలి. మొట్టమొదట మీరు లావాదేవీ జరిగిన బ్యాంక్ కస్టమర్ సర్వీస్ నంబర్ లేదా ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించాలి. చాలాబ్యాంకులు ఆన్‌లైన్ ఫిర్యాదు సదుపాయం ఇస్తాయి. “Raise Complaint” లేదా “Customer Support” ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత సంబంధిత వివరాలు అందించాలి. ఖాతా నంబర్, ట్రాన్సాక్షన్ ఐడి, తేదీ, సమయం, ఏటీఎం లేదా యూపీఐ వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్, రసీదులు, లావాదేవీ స్క్రీన్‌షాట్లు వంటివి ఫిర్యాదుతో జత చేయడం మేలు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత బ్యాంక్ ఇచ్చే ట్రాకింగ్ నంబర్ భద్రంగా ఉంచండి. తద్వారా పరిష్కారం చెక్ చేయవచ్చు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యాంక్‌తో సమన్వయం కొనసాగించాలి. ఏటీఎం, యూపీఐ లేదా ఇతర డిజిటల్ లావాదేవీ సమస్యలలో, ముందుగా బ్యాంక్ కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేయడం, అన్ని వివరాలను సరైనన విధంగా ఇవ్వడం, ట్రాకింగ్ నంబర్ భద్రపరచడం అత్యంత ముఖ్యము. ఈ పద్ధతిలో మాత్రమే డబ్బు రికవరీ త్వరగా సాధ్యమవుతుంది.
గడువు లోగా బ్యాంకులు చెల్లించకుంటే.. If Banks Don’t Credit Within the Prescribed Time…
ఏటీఎం లేదా యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయిన సందర్భాల్లో కస్టమర్లు అనవసర కష్టాల్లో పడవద్దు. ఫిర్యాదు రిజిస్టర్ అయిన తర్వాత, బ్యాంక్ ప్రత్యేక ఫిర్యాదు నంబర్‌ను ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అందిస్తుంది. RBI నిబంధనల ప్రకారం, ఫెయిల్ అయిన ఏటీఎం లావాదేవీలు సాధారణంగా 5 పనిదినాల్లోపు ఖాతాలో తిరిగి జమ చేయాలి. బ్యాంక్ ఈ గడువు లోపు నగదు జమ చేయకపోతే, ఆ రోజు నుండి రోజుకు ₹100 చొప్పున వినియోగదారుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖాతాదారులు సాక్ష్యాలు భద్రపరుచుకోవడం ఎందుకు ముఖ్యం. “Transaction Failed” స్క్రీన్‌ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి. డెబిట్ అయినట్లు వచ్చిన SMS లేదా నోటిఫికేషన్‌ను భద్రపరచాలి. ఈ పత్రాలు భవిష్యత్తులో సమస్యలను నిరూపించడానికి, అలాగే పరిహారం పొందడానికి ఉపయోగపడతాయి.
అప్రమత్తంగా ఉండాలి… Stay Alert
డిజిటల్ విప్లవం వల్ల బ్యాంకింగ్ సేవలు సులభతరం అయినప్పటికీ, కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కస్టమర్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఖాతాదారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏటీఎం నుంచి నగదు డ్రా చేసేటప్పుడు ఖాతాదారులు తమ ట్రాన్సాక్షన్ పూర్తయినట్లు ధృవీకరించుకోవాలి. ఏటీఎం స్క్రీన్ లేదా రసీదు చూసి, “Transaction Successful” అని కన్పిస్తోందో లేదో చూడాలి. స్క్రీన్‌షాట్ తీసుకోవడం, SMS/మెసేజ్ భద్రపరచడం మేలు. ఆ తర్వాత ఏటీఎం కస్టమర్ కేర్ లేదా టోల్-ఫ్రీ నంబర్‌కు వెంటనే కాల్ చేయాలి. బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. “Raise Complaint” లేదా “Customer Support” ఆప్షన్ ద్వారా లావాదేవీ వివరాలు ఇవ్వాలి. ట్రాకింగ్ నంబర్ సేఫ్‌గా ఉంచాలి. ఫిర్యాదు నమోదైన తర్వాత బ్యాంక్ ఇస్తున్న ట్రాకింగ్ నంబర్ భద్రంగా ఉంచడం వల్ల సమస్య పరిష్కారం వేగంగా ట్రాక్ చేయవచ్చు.సమస్య పరిష్కారం కోసం ఫాలో-అప్ చేయాలి. బ్యాంక్ నుండి డబ్బు రికవరీ అయ్యే వరకు సమన్వయం పాటించాలి. బ్యాంక్ టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేకపోతే, బ్యాంక్ సిబ్బందికి సమస్యను తెలియజేయాలి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం హక్కులు వినియోగించుకోవాలి. కస్టమర్లు తమ హక్కులను ఉపయోగించుకుని, డబ్బు రికవరీ కోసం చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేస్తే, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం సులభం అవుతుంది.
ఏటీఎం నుంచి నెలలో ఎన్నిసార్లు ఉచితంగా నగదు డ్రా చేయొచ్చు?
How Many Times Can You Withdraw Cash from an ATM for Free in a Month?
ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయడం ఇప్పుడు చాలా సాధారణం. అయితే, నెలలో ఎన్ని సార్లు ఉచితంగా డబ్బు తీసుకోవచ్చు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ విషయంలో ఆర్బీఐ స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు ఉచితంగా నగదు డ్రా చేయవచ్చు. ఇందులో నగదు విత్‌డ్రాలు మాత్రమే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి లావాదేవీలూ లెక్కలోకి వస్తాయి.ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి అయితే మెట్రో నగరాల్లో (దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) నెలకు 3 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో ప్రాంతాల్లో అయితే నెలకు 5 ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఈ ఉచిత లావాదేవీల్లో నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ వంటి అన్ని రకాల ట్రాన్సాక్షన్లు చేరతాయి.ఉచిత లావాదేవీల సంఖ్య దాటిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు బ్యాంకులు గరిష్టంగా రూ.21 వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. దీనికి జీఎస్టీ అదనంగా వర్తించవచ్చు.
ఖాతాదారులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే? What Should Account Holders Keep in Mind?
నెల ప్రారంభంలోనే ఎన్ని ఉచిత ట్రాన్సాక్షన్లు మిగిలాయో తెలుసుకోవాలి. అవసరం లేని బ్యాలెన్స్ ఎంక్వైరీలను తగ్గించుకోవాలి. ఒకేసారి అవసరమైన మొత్తం తీసుకుంటే చార్జీలు తగ్గుతాయి. ఏటీఎం నుంచి నెలలో పరిమిత సంఖ్యలోనే ఉచితంగా నగదు డ్రా చేయొచ్చు. ఆర్బీఐ నిబంధనలను తెలుసుకొని ప్లాన్ చేసుకుంటే.. అనవసర ఏటీఎం చార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

