క్రెడిట్ కార్డు అంటే “బ్యాంక్ ఇచ్చే అప్పు సౌకర్యం” అని చెప్పవచ్చు. సమయానికి చెల్లించి, సులభంగా ఖర్చు చేయగలిగితే ఇది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. కానీ లిమిట్‌ను తగ్గించి, రిస్క్‌ను నియంత్రించడం అవసరం. ఈ రోజుల్లో ప్రతిఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డులున్నాయి. అయితే దానికో లిమిట్ ఉంటుంది. బ్యాంకును బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లిమిట్ ఉంటుంది. కాగా రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలని చాలామంది యోచిస్తున్నారు.అయితే అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డు లిమిట్ అంటే .. What is a Credit Card Limit?
క్రెడిట్ కార్డు ద్వారా మనకు బ్యాంకు ఇచ్చే ఖర్చు సామర్థ్యం. అంటే మనం నెలలో ఎంత ఖర్చు చేసుకోవచ్చో నిర్ణయించే పరిమితి. రోజూ వారీగా పెరుగుతున్న ఖర్చులు, అత్యవసర అవసరాలు, షాపింగ్ .. ఇవన్నీ క్రమంగా క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకునే అవసరాన్ని కలిగిస్తున్నాయి.
లిమిట్ పెంచుకోవడానికి ప్రాథమిక షరతులు .. Basic Eligibility Criteria to Increase Credit Card Limit
చెల్లింపు చరిత్ర పాజిటివ్‌గా ఉండాలి. గత బిల్లులు ఆలస్యం లేకుండా చెల్లించాలి. వేతనం లేదా ఆదాయం పెరిగితే బ్యాంకులు లిమిట్ పెంపును అనుమతిస్తాయి. క్రెడిట్ స్కోరు 750+ ఉండేలా చూసుకోవాలి. క్రెడిట్ కార్డు గరిష్ట లిమిట్ ఉపయోగం 30–50% మధ్య ఉండేలా చూడాలి. ఉదాహరణకు రూ.లక్షా లిమిట్ తో కార్డు ఉంటే అందులో 30–40% మాత్రమే వాడటం మంచిది. మిగిలిన భాగం అత్యవసర పరిస్థితుల కోసం ఉంచాలి.
లిమిట్ పెంచుకునే మార్గాలు.. Ways to Increase Your Credit Card Limit
బ్యాంక్ యాప్‌లో “లిమిట్ ఇన్‌క్రీజ్ రిక్వెస్ట్” ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కస్టమర్ కేర్ కాల్ ద్వారా రిక్వెస్ట్ వివరాలతో బ్యాంక్‌కు కాల్ చేయొచ్చు. కొత్త ఆదాయం, జీతం పెరుగుదల, ఇతర ఆర్థిక పత్రాలు అవసరం అయితే అందించాలి. లిమిట్ పెంచుకోవడం అంటే అదనపు క్రెడిట్ పొందడమే. కానీ అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. పేమెంట్ సిస్టమ్ పాజిటివ్‌గా ఉంటేనే లిమిట్ పెరుగుతుంది.
జాగ్రత్తలు.. Precautions When Using a Credit Card
రాబడి పెరిగినట్లు భావించి ఎక్కువ ఖర్చు చేయవద్దు. రీసెంట్ బిల్లులు ఆలస్యం అవ్వకూడదు. డెట్-టు-ఇన్కమ్ రేషియో ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రతినెలా సక్రమంగా ఈఎంఐ చెల్లించాలి. పాస్వర్డ్, CVV వంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి.
క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి .. Credit Utilization Ratio
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (Credit Utilization Ratio)” ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్ల ఆర్థిక శక్తిని అంచనా వేస్తాయి. ఇది ఏకకాలంలో మీరు రుణాలను ఎంత మేరకు ఉపయోగిస్తున్నారో చూపే సూచిక. ఉదాహరణకు మీకు ₹1,00,000 క్రెడిట్ లిమిట్ ఉందనుకుందాం. మీరు ₹30,000 మాత్రమే వాడితే.. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30% అవుతుంది. క్రెడిట్ స్కోరు ప్రభావం 30–40% మధ్య ఉంచితే స్కోరు మెరుగుగా ఉంటుంది. 50% కంటే ఎక్కువగా వాడితే క్రెడిట్ స్కోరు దెబ్బ తింటుంది. తక్కువ యుటిలైజేషన్, పేమెంట్ చరిత్ర సానుకూలం అయితే బ్యాంకులు లిమిట్ పెంచే అవకాశం ఎక్కువ. క్రెడిట్ కార్డులు, రుణాలు వాడేటప్పుడు యుటిలైజేషన్ రేషియోని మానిటర్ చేయడం తప్పనిసరి. సరైన నిష్పత్తిలో వాడితే, లిమిట్ పెంపు, మంచి క్రెడిట్ స్కోరు, ఆర్థిక నియంత్రణ అన్నీ సాధ్యమే. ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు.
ఆదాయం పెరుగుదల .. Income Growth
నెలవారీ వేతనం పెరగడం.. బోనస్ లేదా ఇ క్రిమెంట్ పొందడం తో బ్యాంకులు అదనపు క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి అవకాశాన్ని పెంచుతాయి. కానీ ఖర్చుల నియంత్రణ, బిల్లుల పేమెంట్, యుటిలైజేషన్ నిష్పత్తి తప్పక పాటిస్తేనే లాభం. స్మార్ట్‌గా ప్లాన్ చేసుకోవడం మేలు .
అదనంగా మరొక క్రెడిట్ కార్డు వినియోగించవచ్చా? Can You Use an Additional Credit Card?
ఒక క్రెడిట్ కార్డు ఉపయోగం పెరిగి.. నెలలో ఖర్చులు పెరుగుతున్న సందర్భంలో, ఎక్కువ లిమిట్ కోసం మరొక క్రెడిట్ కార్డు తీసుకోవాలని చాలామంది వినియోగదారులు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవంగా ఒక వ్యక్తికి ఇప్పటికే క్రెడిట్ కార్డు ఉన్నా.. అదనంగా మరొక కార్డు ఇవ్వడం ద్వారా మొత్తం లిమిట్ పెరుగుతుంది. దీంతో మీ అత్యవసర ఖర్చులు సులభమవుతాయి. రివార్డ్స్, క్యాష్‌బ్యాక్, EMI ఎంపిక వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ప్రతి కొత్త కార్డు రుణ భారం పెంచుతుంది. దీన్ని బాగా అంచనా వేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. బిల్లులు ఆలస్యం కాకుండా చెల్లించాలి. లేకపోతే వడ్డీ పెరుగుతుంది. లిమిట్ కు మించి కార్డును ఉపయోగించకూడదు. సగం వాడటం మంచిది. అధిక కార్డులు తీసుకోవడం అంటే రిస్క్ ను పెంచుకోవడమే..
వేర్వేరు బ్యాంకుల క్రెడిట్ కార్డులు పొందవచ్చా? Can You Have Credit Cards from Different Banks?
ఇప్పటికే ఒక క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నా.. మరొక బ్యాంక్ నుంచి కొత్త క్రెడిట్ కార్డు పొందవచ్చా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నిపుణుల సూచనల ప్రకారం.. సక్రమంగా ప్లాన్ చేస్తే వివిధ బ్యాంకుల కార్డులు పొందడం పూర్తిగా సాధ్యమే, కానీ కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే ఉన్న కార్డుల రుణం ఎక్కువ అయితే, కొత్త కార్డు మంజూరు అయ్యే అవకాశం తగ్గుతుంది.
క్రెడిట్ కార్డులు ఉచితంగా పొందవచ్చా..? Can Credit Cards Be Obtained for Free?
క్రెడిట్ కార్డులు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, వాటి ఫీజులు, ప్రయోజనాలు, షరతులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉచితంగా ఇచ్చే బ్యాంకులు, చార్జీలు వసూలు చేసే బ్యాంకుల వివరాలను పరిశీలించి.. మీ అవసరాలకు అనుగుణంగా సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవడం ఉత్తమం.
ఉచితంగా క్రెడిట్ కార్డులు ఇచ్చే బ్యాంకులు.. Banks Offering Free Credit Cards
ICICI బ్యాంక్, IDFC FIRST బ్యాంక్, HDFC బ్యాంక్, Axis బ్యాంక్
చార్జీలు వసూలు చేసే బ్యాంకులు.. Banks That Charge Fees
HDFC బ్యాంక్, SBI బ్యాంక్
క్రెడిట్ కార్డు డీఫాల్ట్ అయితే.. ఏమవుతుంది? What Happens If You Default on a Credit Card?
క్రెడిట్ కార్డు వినియోగంలో ఒక చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా డీఫాల్ట్ (Default) అవ్వడం అంటే.. బిల్లను సమయానికి చెల్లించకపోవడం. ఇది వ్యక్తి ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. డీఫాల్ట్ అయినప్పుడు వెంటనే బ్యాంక్‌తో సంప్రదించి, రీపేమెంట్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆలస్యానికి వడ్డీ తగ్గించడం, క్రెడిట్ స్కోరు రికవరీకి ఇది కీలకం. అని నిపుణులు చెబుతున్నారు.
ప్రభావాలు..Impacts
అధిక వడ్డీ: చెల్లింపులు ఆలస్యం అయితే, ప్రతి రోజుకు వడ్డీ గణన ప్రారంభమవుతుంది.
క్రెడిట్ స్కోరు తగ్గడం: మీ క్రెడిట్ స్కోరు పడిపోతుంది. తద్వారా కొత్త క్రెడిట్ కార్డు, లోన్ పొందడం కష్టం అవుతుంది.
క్రెడిట్ రిపోర్ట్‌లో ప్రతికూలం: ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు ఈ రిపోర్ట్‌ను చూడటం వల్ల భవిష్యత్తులో రుణం ఆమోదం కష్టతరం.
లీగల్ చర్యలు: కొన్ని సందర్భాల్లో, బ్యాంకులు రికవరీ కోసం లీగల్ నోటీసులు పంపవచ్చు.
పరిష్కార మార్గాలు.. Solutions
వడ్డీ మినహాయింపు కోసం రిక్వెస్ట్
EMI లేదా ప్లాన్ రీషెడ్యూల్
సంక్లిష్ట బిల్లులు క్రమంగా చెల్లించడం
క్రెడిట్ కార్డు వాడకం తగ్గించడం
క్రెడిట్ కార్డు తో లాభనష్టాలు..
లాభాలు..Benefits
అత్యవసర ఖర్చులు సులభం
డబ్బు లేకపోయినా, అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు చేయవచ్చు.
EMI సౌకర్యం ఉంటుంది.
పెద్ద కొనుగోళ్లను installmentలలో చెల్లించవచ్చు.
రివార్డ్స్ & క్యాష్‌బ్యాక్..Rewards & Cashback
షాపింగ్, ట్రావెల్, ఫ్యూయల్, ఇలక్ట్రానిక్స్లో ప్రత్యేక ఆఫర్లు.
క్రెడిట్ స్కోరు మెరుగుదల
సమయానికి బిల్లులు చెల్లిస్తే, భవిష్యత్తులో రుణాలు, ఇతర కార్డులు సులభంగా లభిస్తాయి.
డిజిటల్ ట్రాన్సాక్షన్ సౌకర్యం
ఆన్లైన్, యాప్, ఇంటర్నేషనల్ షాపింగ్‌లో సులభతరం.
నష్టాలు..Drawbacks
వడ్డీ భారాలు
బిల్లులు ఆలస్యం అయితే, అధిక వడ్డీ చెల్లించాలి.
క్రెడిట్ స్కోరు ప్రభావం
డీఫాల్ట్ అయితే, భవిష్యత్తులో రుణాలు, కొత్త కార్డులు పొందడం కష్టం.
అదనపు ఖర్చులు
రివార్డ్స్, EMI లను అదుపులో ఉంచకపోతే, అనవసర ఖర్చులు పెరుగుతాయి.
రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
లిమిట్ ఎక్కువగా వాడితే, రుణ భారం అధికమవుతుంది.
అదనపు ఫీజులు
జాయినింగ్ ఫీ, రీన్యువల్ ఫీ, లేట్ ఫీ వంటి అదనపు చార్జీలు ఉండవచ్చు.
