Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

ఏఐ సూచ‌న‌ .. జీతానికి ర‌క్ష‌! AI Guidance… A Shield for Your Salary!

Posted on 21/12/2025 By admin No Comments on ఏఐ సూచ‌న‌ .. జీతానికి ర‌క్ష‌! AI Guidance… A Shield for Your Salary!

జీతం వచ్చిన వెంటనే ఆవిరైపోతుందా? ఎన్ని లెక్కలు వేసుకున్నా, నెలాఖరుకు చేతిలో ఏమీ మిగ‌ల‌డం లేదా? అయితే ఏఐతో ఇక‌పై ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించొచ్చు. మన ఆర్థిక ప్రణాళికలో కొత్త తోడు .. కృత్రిమ మేధ (ఏఐ) (AI) రక్షక స్నేహితుడిలా ముందుకు వస్తోంది. ఈ రోజుల్లో ఏయే ఖర్చులు చేయకూడదు… వచ్చే వారం ఏది చెల్లించాలి.. ఏ ఖర్చులు ప్రాధాన్యం లేదో, ఏఐ ముందుగానే హెచ్చరిస్తుంది. కేవలం ఖర్చులను రాసుకునే స్థాయిలోనే కాదు, నిజంగా మన డబ్బును సురక్షితం చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శకం కూడా చేస్తుంది. సాధారణంగా మనం బడ్జెట్ అంటే నెలాఖరులో ఏం ఖర్చు చేశామో చూస్తాం. కానీ, ఇప్పుడు ఏఐ (Artificial Intelligence) మన జేబులో రూపాయికి కొత్త రక్షణ తీసుకొస్తోంది. ఏఐ, మన ఖర్చులు, ఆదాయపు వివరాలను విశ్లేషించి, ఎక్కడ ఎలా పొగడుతున్నామో గుర్తిస్తుంది. మనం అదనపు ఖర్చులు చేయకుండా, అవసరమైన పొదుపును ఎలా సాధించాలో సూచిస్తుంది. ఈ ఏఐ సిస్టమ్ మనకు alerts కూడా ఇస్తుంది . ఖర్చు అసహజంగా పెరుగుతుందా లేదా ఏదైనా డబ్బు అనవసరంగా పోతుందా అని. ఇలా ఉంటే, మనం ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఏఐతో ఖర్చులు ట్రాక్ ..Track Expenses with AI

ఏఐ (AI)మ‌న‌ ఖర్చుల‌ను ట్రాక్ చేస్తుంది. అసహజంగా పెరిగే ఖ‌ర్చుల‌ను గుర్తిస్తుంది. తగిన హెచ్చరికలు జారీ చేస్తుంది. బీమా, రుణ వసూలు, ఇన్వెస్ట్‌మెంట్ కు తగిన సమయాన్ని సూచిస్తుంది. అవసరమైనప్పుడు ఖర్చు తగ్గించడానికి, పొదుపు చేయడానికి మార్గం చూపిస్తుంది. ‘ఈ నెలా ఎక్కడ డబ్బు పెట్టాలి, ఏ ఖర్చులు వదిలేయాలి’ అని సూచిస్తుంది. జీతం వెంటనే ఆవిరైపోకుండా నెలాఖరు సులభంగా గడిపేందుకు ఏఐ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. మనకు ముందే హెచ్చరిక ఇచ్చి, అవసరాన్ని గుర్తించి, ఖ‌ర్చును నియంత్రించే విధంగా పని చేస్తుంది. ఏఐ తో వ్యక్తిగత బడ్జెట్ ను సుల‌భంగా ప్లాన్ చేసుకుని, డబ్బును సురక్షితం చేసుకోవ‌చ్చు.

గత ఆరు నెలల ఖర్చులతో పోలుస్తూ.. Compared with Expenses of the Past Six Months…
మన డబ్బు ఎలా వినియోగించబడుతుందో గమనించడం క‌ష్టం. కానీ ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధ) (AI)ఈ పని చాలా సులభం చేస్తుంది. మ‌నం గత ఆరు నెలల్లో ఎంత ఖర్చు చేసామో గమనిస్తుంది. వచ్చే నెలలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందో ముందే అంచనా వేస్తుంది. ఏ ఖర్చులు తగ్గించాలి, ఎక్కడ డబ్బు సురక్షితం చేయాలి అన్నది సూచిస్తుంది. బీమా, రుణ, విద్య, అవసరపు ఖర్చులు ముందుగానే గుర్తిస్తుంది.

పెద్ద ఖ‌ర్చుల గురించి ముందుగానే చెబుతూ.. Alerting You About Major Expenses in Advance…

సాధారణంగా మనం పెద్ద ఖర్చుల గురించి ముందే ప్లాన్ చేయడం త‌ప్ప డ‌బ్బుల‌ను పొదుపు చేయ‌లేం. కానీ ఏఐ (కృత్రిమ మేధ) (AI)ఈ పనిని జాగ్రత్తగా చేస్తుంది. ఉదాహరణకు జూన్‌లో పిల్లల స్కూలు ఫీజులు ఉంటాయి. సంప్రదాయ బడ్జెటింగ్ యాప్‌లు కేవలం ఖర్చులు రికార్డు చూపిస్తాయి. కానీ ఏఐ ఏప్రిల్ నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది . “వచ్చే రెండు నెలల్లో భారీ ఖర్చు ఉంది, షాపింగ్ తగ్గించండి” అని హెచ్చరిస్తుంది. దీంతో ఖర్చుల గురించి మ‌నం ముందే తెలుసుకోవచ్చు. అవసరమున్నప్పుడు ఖర్చుల‌ను తగ్గించుకోవ‌చ్చు. కేవలం డేటా రికార్డు చేయడం మాత్రమే కాదు, ముందే నిర్ణయం తీసుకోవడానికి మార్గం చూపిస్తుంది.

ఆర్థిక నిపుణుల సూత్రం.. ఏఐతో సులభం! Financial Experts’ Rule… Made Easy with AI!

సంపాదనలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పెట్టుబడులకు కేటాయించాల‌ని సాధారణంగా ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. కానీ దీన్ని ప్రతి నెలా కచ్చితంగా పాటించడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఏఐ (AI)ఆధారిత యాప్‌లు మ‌న‌కు సహాయపడతాయి. మీరు జీతం పొందగానే, ఏఐ మీకు నిర్దేశించిన శాతాలను వేర్వేరు భాగాలుగా విడగొడుతుంది. అవసరాలు, కోరికలు, పెట్టుబడులకు కేటాయించిన డబ్బు తగిన రూపంలో అందుబాటులో ఉంచుతుంది. దీన్ని వాడితే, మీరు అనవసర ఖర్చులు తగ్గించి, జీతాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు.

మ‌న‌కు తెలియ‌ని ఖర్చుల‌ను ఏఐ ఇప్పుడు కనిపెడుతుందంటే..? AI Now Detects Expenses We’re Unaware Of…?

చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే చిన్నచిన్న మొత్తాలు ఖర్చవుతుంటాయి. ముఖ్యంగా కొన్ని సబ్‌స్క్రిప్షన్లు, సేవలు… మనం వాడకపోయినా ఆటో-రెన్యూవల్ వల్ల డబ్బు తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏఐ (కృత్రిమ మేధ) (AI) సహాయం చేస్తుంది. అసహజ ఖర్చులను ముందుగానే గుర్తిస్తుంది. ఎక్కడ డబ్బు అనవసరంగా వెళ్తుందో గుర్తిస్తుంది. ఆప్షన్లు సూచిస్తుంది. “ఈ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు, రద్దు చేయండి” అని హెచ్చరిస్తుంది. ముందే అప్రమత్తం చేస్తుంది. ప్రతి నెలా చిన్న ఖర్చులు ఒక్కసారిగా పెద్ద భారంగా మారకముందే సూచనలు ఇస్తుంది.

ఆన్‌లైన్ షాపింగ్‌లో సరైన డీల్.. ఏఐ తెలుసుకుంటుంది! Get the Right Deal in Online Shopping… AI Knows!

మనం ఆన్లైన్‌లో ఏదైనా కొనాలనుకున్నప్పుడు, అది నిజంగా సరైన ధరలో ఉందా? లేదా? అనేది ఒక సందేహం వెంటాడుతుంది. కానీఇక్కడ ఏఐ (AI) (కృత్రిమ మేధ) ముందుగానే మనకు సహాయపడుతుంది. గత ధరలతో పోలుస్తుంది. కొనదలచిన వస్తువు ధర గతంలో ఎటువంటి స్థాయిలో ఉందో, మార్పు రేట్లను విశ్లేషిస్తుంది. సరైన కొనుగోలు సూచన ఇస్తుంది. ఇప్పుడు సరైన ధరలో కొనుగోలు చేస్తున్నారా లేదా అని చెప్పి, అవసరమైతే “కొనకపోవడం మంచిది” అని సూచిస్తుంది. సరైన డీల్ కోసం సహాయం చేస్తుంది. డిస్కౌంట్, సేల్స్, ఉచిత ఆఫర్లు గమనించి, మోసపోకూడదు అని అప్రమత్తం చేస్తుంది.

మూడ్ బేస్డ్ షాపింగ్.. Mood-Based Shopping…

చాలామందికి ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఆనందంలో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లు ఎక్కువగా వాడటం అలవాటు. ఇలాంటి సందర్భాల్లో డబ్బు అనవసరంగా ఖర్చవుతుంది. ఇటువంటి సంద‌ర్భాల‌లో కూడా ఏఐ (AI) (కృత్రిమ మేధ) మనకు సహాయం చేస్తుంది. ఖర్చు చేస్తున్న సమయం, సందర్భం, మానసిక స్థితిని అర్థం చేసుకుంటుంది. అర్ధరాత్రి షాపింగ్‌ ఎక్కువగా చేస్తుంటే “ఇది అనవసరపు ఖర్చు కావచ్చు.. ఒకసారి ఆలోచించండి” అని నోటిఫికేషన్ పంపుతుంది. impulsive ఖర్చులు తగ్గించి, డబ్బు సురక్షితం చేస్తుంది.

కారు, ఇల్లు కోసం డబ్బు సురక్షితం.. Safeguard Money for Car and Home…

చాలామందికి కారు కొనాలి, ఇల్లు కట్టాలి అని ఆలోచన వస్తుంది. కానీ, ఆ లక్ష్యానికి ఎంత డబ్బు జమ చేస్తున్నామో చట్టబద్ధంగా గమనించటం కష్టమే. ఇక్కడ ఏఐ (AI) ఆధారిత యాప్‌లు సహాయపడతాయి. మీరు ఒక లక్ష్యం (కారు, ఇల్లు) సెట్ చేస్తే, ఏఐ ఆ లక్ష్యానికి డబ్బు జమ చేయడానికి సిస్టమ్ పనిచేస్తుంది. ఉదాహరణకు, మీరు రూ.490 ఖర్చు చేసి వస్తువులు కొన్నారనుకుందాం. దాన్ని రూ.500గా రౌండ్ చేసి, మిగిలిన రూ.10 మీ కారు ఫండ్‌లోకి మళ్లిస్తుంది. ఇలా చేయడం వల్ల, ముందస్తుగా ప్లాన్ చేసిన లక్ష్యానికి అందుకు అవసరమైన డబ్బు సులభంగా చేరుతుంది.

ఏఐ ఉపయోగించడంలో నమ్మకమే ప్రాధాన్యం..Trust Is Key in Using AI

ఏఐ (AI) (కృత్రిమ మేధ) మన ఆర్థిక వ్యవహారాలను సులభం చేసేస్తుంది. కానీ, మీ డబ్బు, వ్యక్తిగత సమాచారం భద్రతా కవచంలో ఉండాలి అనే విషయంలో జాగ్రత్త అవసరం. కేవలం ఆర్‌బీఐ గుర్తింపు పొందిన లేదా పేరున్న బ్యాంకులు ఇచ్చే ఏఐ టూల్స్‌ను మాత్రమే వాడాలి. అనామక, అజ్ఞాత ఏఐ యాప్‌లు ప్రమాదకరం. సురక్షిత ఏఐ టూల్స్ ఉపయోగించడం వల్ల, డబ్బు, ఖర్చులు, పెట్టుబడులు సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

ఆర్థిక యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు జాగ్రత్త! Be Careful When Installing Financial Apps!

(AI)కొన్ని ఆర్థిక యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు, మీ మొబైల్‌కు వచ్చే సంక్షిప్త సందేశాలు (SMS) చదవడానికి అనుమతి అడుగుతాయి. ఇది ఖర్చులను, బిల్లులు, బ్యాంక్ నోటిఫికేషన్లు లెక్కించడానికి అవసరం అని అవగాహన ఉండాలి. ఏ యాప్ ఎందుకు SMS అనుమతి అడుగుతుందో అర్ధం చేసుకోండి. కేవలం నమ్మకమైన, బ్యాంక్ గుర్తింపు గల యాప్‌లకే ఈ అనుమతులు ఇవ్వండి. SMS అనుమతి ఇచ్చేటప్పుడు వాస్తవ అవసరం మాత్రమే అనుమతించండి, అవసరంలేని యాప్‌లకు అనుమతి ఇవ్వవద్దు.

ఏఐ సూచన.. కానీ ఖర్చు నిర్ణయం మీదే! AI Gives Advice… But Spending Decisions Are Yours!

ఏఐ (AI)(కృత్రిమ మేధ) మన ఖర్చులను, పొదుపును సులభం చేసేందుకు హెచ్చరికలు, సూచనలు ఇస్తుంది.
కానీ, చివరి నిర్ణయం , డబ్బు ఖర్చు చేయాలా లేదా అనేది –మన‌మే తేల్చుకోవాలి. ఏఐ సూచన మాత్రమే ఇస్తుంది, అందులోకి కట్టుబడాల్సిన అవసరం లేదు. ఖర్చు నిర్ణయం, వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను మీరు మాత్రమే నిర్ణయించాలి. ఇది డబ్బు వినియోగంలో జాగ్రత్త, నియంత్రణ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది.

218
FEATURE NEWS Tags:AI Gives Advice… But Spending Decisions Are Yours!, AI Now Detects Expenses We’re Unaware Of…?, Alerting You About Major Expenses in Advance…, Be Careful When Installing Financial Apps!, Compared with Expenses of the Past Six Months…, Financial Experts’ Rule… Made Easy with AI!, Get the Right Deal in Online Shopping… AI Knows!, Mood-Based Shopping…, Safeguard Money for Car and Home…, Track Expenses with AI, Trust Is Key in Using AI

Post navigation

Previous Post: మ్యూల్‌ ఖాతాల వలలో సామాన్యులు! అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు! Ordinary People Caught in Mule Account Traps! Trouble Is Inevitable If You’re Not Careful!
Next Post: ఇక‌పై సెబీ తనిఖీలు, దర్యాప్తుల‌కు గ‌రిష్ఠ కాలపరిమితి ఎనిమిదేళ్లే.. SEBI Inspections and Investigations Capped at Eight Years

Related Posts

  • బైబ్యాక్‌పై కొత్త పన్ను భారం… ఏప్రిల్‌ 1 నుంచి 12% సర్‌చార్జి.. 12% Surcharge on Buyback Capital Gains from April 1 FEATURE NEWS
  • 2025లో నెలకు లక్షకు పైగా ఆదాయం ఇచ్చే కొత్త ఆలోచ‌న‌లు Ideas that will give you a regular income of more than 1lakh per month in 2025 FEATURE NEWS
  • బంగారం వద్దు.. వెండి ముద్దు! Changing Trends in the Indian Jewellery Market FEATURE NEWS
  • పాత పెట్టుబడులకు ఊరట… ‘గార్‌’ భయం తొలగించిన సీబీడీటీ … Relief for Legacy Investments… CBDT Clears GAAR Concerns FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • స‌రికొత్త‌గా.. యూపీఐ చెల్లింపులు new changes in UPI payments FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఈ వెబ్‌సైట్లను మిస్ అవ్వొద్దు what are the important websites for stock market news FEATURE NEWS
  • అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks FEATURE NEWS
  • ఒక్క సంతకం… జీవితాంతం భారం? గ్యారెంటర్‌గా మారే ముందు వాస్త‌వాలు తెలుసుకోండి! One Signature… A Lifetime Burden? The Hard Truths Before Becoming a Guarantor FEATURE NEWS
  • ఏడాదికి రూ. 399తో ప‌ది ల‌క్ష‌ల బీమా Rs 399 per year with ten lakh insurance FEATURE NEWS
  • డివిడెండ్ ఎందుకిస్తారు what is dividend in stock market MARKET
  • ఓట‌మి రుచి చూస్తేనే గెలుపు * వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌ FEATURE NEWS
  • 2014లో 50 లక్షలు.. నేడు 5 కోట్లు FINICAL PLANNING
  • కార్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందా? Does Taking a Car Loan Reduce Your Credit Score? FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme