ఉద్యోగులు అత్యవసర సమయాల్లో EPF నుంచి డబ్బు తీసుకోవడం చాలా సాధారణం. కానీ ఎప్పుడు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందో చాలా మందికి స్పష్టంగా తెలియదు. చిన్న పొరపాటే పెద్ద నష్టానికి దారితీయొచ్చు అంటున్నారు నిపుణులు. మీ కష్టార్జిత EPF సొమ్ముపై పన్ను పడకుండా ఉండాలంటే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
5 ఏళ్లకు ముందు విత్‌డ్రా చేస్తే… Withdrawing Before 5 Years…
మీరు ఒకే సంస్థలోనా… లేక వేరే సంస్థల్లోనా మొత్తం కలిపి 5 సంవత్సరాల కంటిన్యూయస్ సర్వీస్ లేకుండా EPFని విత్‌డ్రా చేస్తే ఆ మొత్తం ట్యాక్సబుల్ ఇన్కమ్గా పరిగణిస్తారు. మీ కాంట్రిబ్యూషన్‌పై వచ్చిన వడ్డీ, కంపెనీ కాంట్రిబ్యూషన్, దానిపై వచ్చిన వడ్డీ.. అన్నీ పన్నుకు లోబడతాయి.
₹50,000 పైగా విత్‌డ్రా చేస్తే TDS.. TDS on Withdrawals Above ₹50,000
5 ఏళ్లలోపే EPF విత్‌డ్రా చేసి, మొత్తం ₹50,000 కంటే ఎక్కువ అయితే EPFO 10% TDS కట్ చేస్తుంది.
PAN ఇవ్వకపోతే ఈ TDS మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఫారం 15G/15H ఇస్తే TDS మినహాయింపు..Submit Form 15G/15H to Avoid TDS
మీ ఆదాయం ట్యాక్స్ లిమిట్ లోపే ఉంటే, మీరు ఫారం 15G/15H సమర్పిస్తే TDS కట్ చేయరు.
అయితే ఫారం ఇచ్చినందుకు పన్ను పూర్తిగా మాఫీ అయిందనే కాదు. మీకు వర్తించే ట్యాక్స్ స్లాబ్ ప్రకారం రిటర్న్ ఫైల్ చేసే సమయంలో పన్ను లెక్కిస్తారు.
జాబ్ మార్చినా… Even If You Change Jobs…
చాలామంది జాబ్ మార్చిన వెంటనే పాత EPF విత్‌డ్రా చేస్తారు. ఇది పెద్ద తప్పు. పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్‌కి PF ట్రాన్స్ఫర్ చేస్తే సర్వీస్ కంటిన్యూవిటీ కొనసాగుతుంది. 5 ఏళ్ల రూల్ బ్రేక్ కాకపోవడంతో పన్ను పడదు
ఇంట్రెస్ట్‌పై కూడా ట్యాక్స్ పడుతుందా? Is Interest Also Taxable?
5 ఏళ్లలోపు విత్‌డ్రా చేస్తే ఇంట్రెస్ట్‌పై కూడా ట్యాక్స్ పడుతుంది. మీ EPF బ్యాలెన్స్‌లోని ఇంట్రెస్ట్ కూడా ఇతర ఆదాయం (Income from Other Sources)గా పరిగణించి పన్ను వేస్తారు. 5 ఏళ్లు పూర్తయ్యాక విత్‌డ్రా చేసిన EPF మొత్తం ట్యాక్స్ ఫ్రీ. EPF దేశంలో అత్యుత్తమ రిస్క్–ఫ్రీ ఇన్వెస్ట్మెంట్గా నిలుస్తుంది.
EPFలో 4 రకాలుగా డబ్బు జమ.. 4 Ways Money Is Deposited in EPF
ఉద్యోగి కాంట్రిబ్యూషన్
యజమాని/సంస్థ కాంట్రిబ్యూషన్
సంస్థ చేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీ
ఉద్యోగి డిపాజిట్లపై వచ్చే వడ్డీ… ఈ నాలుగే EPF మొత్తాన్ని రూపొందిస్తాయి.
EPF నుంచి విత్‌డ్రా చేసేటప్పుడు పన్ను ఎలా పడుతుందంటే..? How Is EPF Withdrawal Taxed?
ఉదాహరణకు A అనే వ్యక్తి 3 ఏళ్ల సేవ పూర్తి చేశాడు. కొన్ని అత్యవసర కారణాలతో తన EPF నుంచి ₹60,000 విత్‌డ్రా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతడి PF ఖాతాలో మొత్తం రూ.3 లక్షలు (ఉద్యోగి + సంస్థ భాగాలు, వాటిపై వడ్డీ కలిపి) ఉన్నట్లు భావిద్దాం. అయితే A వ్యక్తి 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయలేదు. అందువల్ల ఉపసంహరణ చేసిన మొత్తం పూర్తిగా పన్నుకు లోబడి ఉంటుంది. కొత్త పన్ను విధానం ప్రకారం చూస్తే A వ్యక్తి 10% ట్యాక్స్ స్లాబ్‌లోకి వస్తాడు. అందువల్ల ₹60,000పై 10% TDS పడుతుంది. అంటే ₹6,000 నేరుగా కట్ అవుతుంది. ఉపసంహరణ చేసిన మొత్తం తక్కువైనా… పన్ను మాత్రం సర్వీస్ పీరియడ్ ఆధారంగా లెక్కిస్తారు. ఇదే A అనే వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేసి ఉంటే ఒక్క రూపాయి కూడా TDS లేదా ఇన్కమ్ ట్యాక్స్ పడదు.
ఈపీఎఫ్ – పూర్తిగా పన్ను రహితం! EPF — Completely Tax-Free!
ఉద్యోగుల భవిష్యత్తును భద్రపరిచే EPF ఖాతా పన్నుల పరంగా అత్యంత లాభదాయకమైన సేవింగ్స్ స్కీమ్‌గా నిలుస్తోంది. ఎందుకంటే ఇది EEE కేటగిరీకి చెందినది. సాధారణ సేవర్లకు, కొత్తగా ఉద్యోగాలు ప్రారంభించిన వారికి ఈ కేటగిరీ గురించి స్పష్టత ఉండటం ఎంతో అవసరం.
EEE కేటగిరీ అంటే ఏమిటి? What Is the EEE Category?
EEE అంటే Exempt (డిపాజిట్‌పై మినహాయింపు). Exempt (వడ్డీపై మినహాయింపు). Exempt (మెచ్యూరిటీపై మినహాయింపు). అంటే EPFలో ఉద్యోగి, సంస్థ చేసే కాంట్రిబ్యూషన్స్, వాటిపై వచ్చే వడ్డీ, చివరకు రిటైర్మెంట్ సమయాన పొందే మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం.
పాత పన్ను విధానం .. Old Tax Regime
పాత పన్ను విధానంలో EPFలో చేసే ఉద్యోగి డిపాజిట్లపై రూ.1.5 లక్షల వరకు 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. విద్యా ఫీజులు, ఇన్సూరెన్స్, హౌస్ లోన్ ప్రిన్సిపల్‌తో పాటు EPF కూడా ఈ శ్రేణిలోకి వస్తుంది.
కొత్త పన్ను విధానం .. New Tax Regime
కొత్త పన్ను విధానంలో 80C మినహాయింపు లేకపోవడంతో ఉద్యోగులు తమ EPF కాంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్ బెనిఫిట్ పొందరు. కేవలం యజమాని కాంట్రిబ్యూషన్‌పై మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
EPF బ్యాలెన్స్, వడ్డీ, మెచ్యూరిటీ – పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ.. EPF Balance, Interest & Maturity — Completely Tax-Free
ట్యాక్స్ విధానం ఏది ఎంచుకున్నా… EPF ఖాతాలోని నగదు నిల్వలు, వడ్డీ, మెచ్యూరిటీ అన్నీ 100% పన్ను రహితం. కానీ ఒకే షరతు ఏమిటంటే ఖాతా 5 ఏళ్ల పాటు కొనసాగాలి. ఐదేళ్ల సర్వీస్ కి ముందు EPF విత్‌డ్రా చేస్తే EEE ప్రయోజనం ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ఉద్యోగి, యజమాని కాంట్రిబ్యూషన్లపై వచ్చిన వడ్డీ మొత్తమంతా పన్ను పరిధిలోకి వస్తుంది. 5 సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేస్తే EPF భారతదేశంలో అత్యంత భద్రమైన, పన్ను రహిత పెట్టుబడిల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకే నిపుణులు “EPFను రిటైర్మెంట్ వరకు అలాగే ఉంచడం ఉత్తమం” అంటున్నారు. EPF అనేది ఉద్యోగులకు దక్కే అత్యుత్తమ పన్ను ప్రయోజనం కలిగిన సేవింగ్ పథకం.అదే సమయం లో చిన్న తప్పు చేస్తే కొన్నేళ్లుగా కూడకట్టుకున్న వడ్డీపై కూడా పన్ను పడే పరిస్థితి ఉంది.
నిపుణులు ఏమంటున్నారంటే.. Experts Say…
అనేక మంది చిన్న చిన్న అవసరాలకు EPF నుంచి విత్‌డ్రా చేస్తున్నారు. ఇది రిటైర్మెంట్ సేఫ్టీని దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. “EPFను చివరి ఆప్షన్‌గా మాత్రమే వాడాలి. అవకాశం ఉంటే లోన్ తీసుకున్నా సరే EPFను విత్‌డ్రా చేయకూడదు” అని సూచిస్తున్నారు. EPF సొమ్ము మీ రిటైర్మెంట్ భద్రత. ఆపదకాలంలో విత్‌డ్రా చేయొచ్చు. కానీ 5 ఏళ్ల రూల్, TDS, ట్యాక్స్ లెక్కలు తప్పక తెలుసుకోవాలి. లేకపోతే మీ సొంత సేవింగ్స్‌కే పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ఉద్యోగ విరమణకు ముందే EPF విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది? పెన్షన్‌కు అర్హత ఉంటుందా?
What Happens If You Withdraw EPF Before Retirement? Will You Be Eligible for Pension?
ఉద్యోగస్తుల భవిష్యత్ భద్రతకు EPF, EPS పథకాలు ఎంత ముఖ్యమనేది తెలిసిందే. అయితే రిటైర్మెంట్కు ముందే అత్యవసర అవసరాల కోసం చాలామంది EPF నుంచి నగదు ఉపసంహరించుకుంటుంటారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న. EPFను ముందే విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం ఉంటుందా? EPSకు అర్హత కోల్పోతారా? లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవంగా ఉద్యోగి జీతం నుంచి 12% EPFలో చేరుతుంది. యజమాని వాటా 12%లో 8.33% EPS (పెన్షన్ ఖాతా)లోకి, మిగతా 3.67% EPFలోకి వెళుతుంది. అంటే మీరు EPF విత్‌డ్రా చేసినా… EPS బ్యాలెన్స్‌ను నేరుగా ఉపసంహరించలేరు .
సర్వీసు 10 ఏళ్లు దాటితే పెన్షన్ తప్పనిసరి! Pension Is Mandatory After 10 Years of Service!
ఉద్యోగి 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి EPSలో కంట్రిబ్యూషన్ ఉంటే పెన్షన్ అర్హత ఆటోమేటిక్‌గా వస్తుంది. EPF మొత్తం విత్‌డ్రా చేసుకున్నా కూడా EPS మెంబర్షిప్ కొనసాగుతుంది. 58 ఏళ్లు పూర్తయ్యాక మాత్రమే పెన్షన్ (Form 10D) క్లెయిమ్ చేసుకోవచ్చు 10 ఏళ్లు పూర్తి కాకముందే ఉద్యోగం మానేస్తే? ఇక్కడే చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. సర్వీస్ 10 ఏళ్లు దాటకపోతే EPF, EPS రెండూ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. EPS సొమ్ము ‘Withdrawal Benefit’ రూపంలో Form 10C ద్వారా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే పెన్షన్‌కు అర్హత ఉండదు.
EPF ముందే విత్‌డ్రా చేస్తే పెన్షన్‌కు నష్టమా? Does Early EPF Withdrawal Affect Pension?
EPF ముందే విత్‌డ్రా చేస్తే పెన్షన్‌కు నష్టం కాదు. సర్వీస్ 10 ఏళ్లు దాటిందా లేదా? అనేది ప్రధాన ప్రమాణం.
EPF పూర్తిగా తీసుకున్నా కూడా 10 ఏళ్లు సర్వీస్ ఉంటే పెన్షన్ హక్కు కోల్పోరు. 10 ఏళ్లు పూర్తి కాకపోతే పెన్షన్ అర్హత ఉండదు. అయితే చాలామంది రిటైర్మెంట్కి ముందే Form-10C వేసి EPS కూడా విత్‌డ్రా చేసుకుంటారు. 10 ఏళ్లు పూర్తి కాకపోతే ఇది సరే. 10 ఏళ్లు దాటితే EPS విత్‌డ్రా చేయరాదు. అలా చేస్తే పెన్షన్ మినహాయింపవుతుంది. ఏదేమైనా పదవీ విరమణకు ముందే EPF విత్‌డ్రా చేయొచ్చు. కానీ పెన్షన్‌పై ప్రభావం మీ సర్వీస్ కాలంపైనే ఆధారపడుతుంది. 10 ఏళ్లు దాటితే పెన్షన్ హక్కు గ్యారంటీ. 10 ఏళ్లు దాటకపోతే EPF + EPS రెండు తీసుకున్నా పెన్షన్ ఉండదు. ఉద్యోగ జీవితంలో చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తు భద్రతను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.
