బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక మార్పులు చేసింది. ఇకపై బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలను తప్పనిసరి చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. బ్యాంకింగ్ సవరణ చట్టం ప్రకారం ఈ మార్పులు చేశారు. దీని ప్రకారం ఇకపై బ్యాంకులో ఖాతా తెరవాలనుకునే వారు తప్పనిసరిగా నలుగురు నామినీల పేర్లును సూచించాలి. ఇప్పటివరకు ఒక ఖాతాకు ఒక నామినీ నియమించుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక ఖాతాకు గరిష్ఠంగా నాలుగు నామినీల్ని (4) నియమించుకోవచ్చు. డిపాజిట్ ఖాతాలు, బ్యాంకు ఇతరత్రా సేవలకు ఈ నామినేషన్‌ల మార్పులు వర్తిస్తాయి. నామినీలకి మీరు ఇవ్వబోయే వాటాల శాతాన్ని ముందుగా నిర్ణయించుకోవచ్చు . ఉదాహరణకు నలుగురిలో ఒక్కరికి 40 %, రెండో వారికి 30 % ఇలా.. మొత్తంగా 100%కి చేరాలి. అయితే, బ్యాంకుల సేఫ్‌కస్టడీ లాకర్లు, సేఫ్టీ లాకర్లు వంటి వస్తువుల నామినేషన్‌లో మాత్రం ఒకరి తర్వాత ఒకరుగా (సక్సెసివ్ నామినేషన్) విధానం మాత్రమే అనుమతించబడుతుంది.
బ్యాంకులు సన్నద్ధం ..Banks Are Prepared
బ్యాంకులు కూడా కొత్త వ్యవస్థకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్, ఫార్మాట్‌లు అప్‌డేట్ చేస్తున్నాయి. అయితే కస్టమర్ల వివరాలు సరైన రీతిలో పొందకపోతే తప్పిదాలు తప్పవని అధికారులు చెబుతున్నారు.
అనేక ప్రయోజనాలు ..Multiple Benefits
ఒక నామినీకి మాత్రమే ఆధారపడే సమస్యలు తగ్గనున్నాయి. ఆస్తి విభజన / వారసత్వ సంబంధిత క్లెయిమ్‌ల సమయం ఆదా అవుతుంది. ఖాతాదారు స్వయంగా నామినీల చాయిస్ మార్పులు చేయొచ్చు. వాటాల నిర్థారణ సౌకర్యాన్ని పొందగలరు. ఈ నిబంధనలు అమలుకు వచ్చే నాటికి ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో నామినేషన్ వివరాలను రివ్యూ చేసుకొని అవసరమైతే సవరించుకోవచ్చు.
నాలుగు నామినీలతో నష్టాలేనా?.. Any Drawbacks to Having Four Nominees?
నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘మల్టిపుల్ నామినీ వ్యవస్థ’పై ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తుంటే… నిపుణులు మాత్రం “జాగ్రత్త!” అంటున్నారు. ఒక ఖాతాకు గరిష్ఠంగా నాలుగు నామినీలు ఉంచుకోవచ్చని కొత్త నియమం చెబుతుండగా, దాంతో నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నలుగురు నామినీలు అనే నూతన విధానంలో సౌలభ్యం ఎంత ఉందో.. జాగ్రత్తగా లేకుంటే తీవ్ర ఇబ్బందుపాలవడం ఖాయం. నామినీ పెంచే ముందు ఆలోచించాలి. లేకుంటే వారసత్వ తగాదాలు తప్పవు.
పెరగనున్న వివాదాలు..Disputes Likely to Increase
ఇప్పటి వరకు ఒక్క నామినీ మాత్రమే ఉండేది. ఇప్పుడు నలుగురికి వాటాలు కేటాయించే అవకాశం రావడంతో వారసత్వ హక్కుల తగాదాలు మళ్లీ ముందుకొచ్చే ప్రమాదం ఉంది. “ఎవరికెంత శాతం?” అన్నదానిపై కుటుంబాల్లో వివాదాలు చెలరేగే అవకాశం లేకపోలేదు. బ్యాంకులకూ లీగల్ క్లారిటీ కోసం సమయం పట్టే పరిస్థితి ఉంది.
ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు.. Customers’ Negligence
నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలామంది ఖాతాదారులు నామినీల పేర్లు మాత్రమే నమోదు చేస్తారు ఎవరికి ఎంత శాతం వాటా (share percentage) స్పష్టంగా పేర్కొనరు. దీంతో వారి మరణానంతరం బ్యాంకులు నామినీ వాటా పంపిణీపై తర్జనభర్జనలో పడతాయి. చిన్న పొరపాటుతో వారసులకు డబ్బు చేరే ప్రక్రియ నెలల తరబడి ఆలస్యం అవుతుంది.
నామినీ అంటే..What is a Nominee?
బ్యాంకింగ్ చట్టం ప్రకారం.. నామినీ అనేది కేవలం డబ్బు స్వీకరించే వ్యక్తి మాత్రమే. ఆ డబ్బు అసలు హక్కు ఎవరిదో తేల్చేది వారసత్వ చట్టం (Succession Law). నలుగురు నామినీలు ఉన్నప్పుడు వారసత్వ హక్కులు, లీగల్ వారసులు ఎవరన్న గందరగోళం పెరగొచ్చు. ఖాతాదారుడు మరణించిన తర్వాత ఖాతాలోని డబ్బును నామినీగా ఉన్నవారు స్వీకరించవచ్చు. అయితే ఆ వ్యక్తి నిజమైన వారసుడు కావాలనే అవసరం లేదు. అందుకే నామినీ పేరు నమోదు చేసినప్పుడే ఈ డబ్బు చివరికి ఎవరికీ చెందాలి? అనే దానిపై ఖాతాదారుకు స్పష్టత ఉండాలి.
గందరగోళం తలెత్తకుండా.. Without Causing Confusion…
ఖాతాదారులు నామినీలు పెంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. వారసత్వ పత్రం (Will) లేకుండా నామినీలే ఆధారం అవుతారు. కాబట్టి గందరగోళం తలెత్తకుండా స్పష్టమైన రికార్డులు ఉంచుకోవాలి. అని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
సరిగ్గా నామినీని ఎలా నియమించాలి? ఎవరికెంత శాతం ఇవ్వాలి?
How to Properly Appoint a Nominee? How Much Percentage to Allot to Each?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గరా ఒక బ్యాంకు ఖాతా ఉంది. కానీ ఆ ఖాతాకు చాలామంది నామినీ వివరాలు సరిగా ఇవ్వడం కాదు. కొంతమంది ఎవరో ఒకరి పేరు రాసేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎవరిని నామినీగా పెట్టాలంటే? Who Should Be Appointed as a Nominee?
కుటుంబ సభ్యులు (భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు) ను నామినీగా పెట్టవచ్చు. వివాదాలు రాకుండా ఉండాలంటే, వారసత్వ పత్రం (Will) లో కూడా అదే పేర్లు ఉండాలి. కుటుంబం వెలుపల వ్యక్తిని నామినీగా ఉంచాలనుకుంటే రికార్డ్‌లో రాయాలి. ఇకపై ఒక బ్యాంకు ఖాతాకు గరిష్ఠంగా నాలుగు నామినీలు పెట్టుకోవచ్చనే నూతన విధానం అమలులోకి రానున్న నేపథ్యంలో నామినీ పేరు నమోదు చేసేటప్పుడు వాటా శాతం కూడా చెప్పాలి. ఇలా చేయడం వల్ల వారసత్వ తగాదాలకు ఆస్కారం ఉండదు.
ఎవరికెంత శాతం ఇవ్వాలి? What Percentage Should Be Allotted to Whom?
నలుగురు నామినీలు ఉంటే మొత్తం 100% వాటాను వారికి పంచాలి. ఉదాహరణకు: భార్య – 40%, కుమారుడు – 30%, కుమార్తె – 20%, తల్లి – 10% ఇలా శాతం వివరాలను ఫారంలో స్పష్టంగా రాయాలి. బ్యాంకు కాపీని సురక్షితంగా ఉంచాలి.
ఎప్పుడు మార్పు చేయాలి? When Should It Be Changed?
జీవితంలో పరిస్థితులు మారతాయి. వివాహం, విడాకులు, పిల్లల జననం, మరణం ఇవన్నీ నామినీ వివరాలను రివైజ్ చేయాల్సిన సందర్భాలు. పాత నామినీ వివరాలు మార్చకపోతే, మరణానంతరం డబ్బు తప్పు వ్యక్తికి చేరే ప్రమాదం ఉంది.
ఏ ఖాతాలకు నామినీ తప్పనిసరి? Which Accounts Is a Nominee Mandatory?
సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్, పీఎఫ్ ఖాతాలకు నామినీ వివరాలు ఉండాలి.
కుటుంబంతో చర్చించాలి.. Should Discuss with the Family…
నామినీ నియమించడం ఒకసారి చేసే పని కాదు. అది జీవితంలో మార్పులకు అనుగుణంగా అప్‌డేట్ చేసుకోవాల్సిన బాధ్యత. అని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎవరికెంత శాతం ఇవ్వాలనే దానిపై కుటుంబంతో ముందుగానే చర్చించి నిర్ణయించాలి. లేకపోతే ప్రేమ బంధం కంటే వారసత్వ బంధం బలహీనమవుతుంది. అని అంటున్నారు.
నామినీ vs వారసత్వం Nominee vs. Inheritance
చాలామంది ఖాతాదారులు, నామినీని వారసు లేదా యాజమాన్య హక్కు దారుడు అనుకుంటారు. కానీ నామినీ, వారసత్వం మధ్య ప్రాధమిక తేడా తెలుసుకుంటే, భవిష్యత్తులో వారసత్వ వివాదాలు తప్పించుకోవచ్చు. నామినీ అనేది ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు/ఆస్తిని స్వీకరించే వ్యక్తి. ఇది తాత్కాలిక స్వీకరణ హక్కు మాత్రమే. ఉదాహరణకు ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాకు మీరు మీ స్నేహితుని నామినీగా పెట్టారనుకుందాం. ఆ ఖాతా నిధులు నామినీకి ఫెయిర్‌గా అందుతాయి. కానీ కానీ నిజమైన వారసులు ఆ డబ్బును వారసత్వ చట్టం ప్రకారం పొందగలరు. వారసులు అనేవారు, ఇచ్చిన ఆస్తి మీద చట్టబద్ధ హక్కు కలిగి ఉన్న వ్యక్తులు. వారసులే చివరకు ఆస్తి యాజమాన్యాన్ని సొంతం చేసుకుంటారు.
