దేశీయ స్టాక్ మార్కెట్లో మరోసారి తొలి పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) సందడి మొదలైంది. ప్రముఖ కంపెనీలు వరుసగా స్టాక్ మార్కెట్లోకి (Borrow to Invest in an IPO) అడుగుపెడుతుండటంతో రిటైల్ పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నెలకొంది. గత కొన్నేళ్లుగా అనేక ఐపీఓలు లిస్టింగ్ రోజునే మంచి లాభాలు అందించడంతో, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ప్రతి కంపెనీ షేర్లు కూడా అదే తరహా రాబడులు ఇస్తాయనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా లక్షలాది మంది పెట్టుబడిదారులు ఐపీఓలకు దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఈ పోటీలో మరో కొత్త ధోరణి కూడా కనిపిస్తోంది. తమ వద్ద తగినంత నిధులు లేకపోయినా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లేదా ఇతర మార్గాల ద్వారా అప్పులు తీసుకుని ఐపీఓలకు దరఖాస్తు చేయడం. ఎక్కువ మొత్తానికి దరఖాస్తు చేస్తే షేర్లు తప్పకుండా వస్తాయనే భావనతో కొందరు రుణాలపై ఆధారపడుతున్నారు. కానీ ఈ వ్యూహం కనిపించినంత సులభం కాదని, లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు పెరుగుతోంది ఐపీఓలపై మోజు? Why IPOs Are Attracting Investors?
డీమ్యాట్ ఖాతాలు పెరగడం, మొబైల్ ట్రేడింగ్ యాప్‌లు అందుబాటులోకి రావడం, ఆన్లైన్లోనే పెట్టుబడులు పెట్టే అవకాశం కలగడం (Borrow to Invest in an IPO)వంటి కారణాలతో రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో కొన్ని ప్రముఖ ఐపీఓలు లిస్టింగ్ రోజునే భారీ ప్రీమియంతో ట్రేడవడంతో, చాలామందిలో ఐపీఓ అంటే ఖచ్చితమైన లాభం అన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంచి కంపెనీ ఐపీఓ వస్తుందనే వార్త వచ్చిన వెంటనే దానికి భారీ మొత్తాలతో దరఖాస్తు చేయాలనే ధోరణి పెరుగుతోంది. కొందరు కుటుంబ సభ్యుల పేర్లతో వేర్వేరు దరఖాస్తులు వేస్తుంటే, మరికొందరు రుణాలు తీసుకుని మరీ పెట్టుబడి పెడుతున్నారు.
ఐపీఓ ఫండింగ్ అంటే ఏమిటి? What Is IPO Funding?
పెట్టుబడిదారుల (Borrow to Invest in an IPO)ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) ప్రత్యేకంగా ఐపీఓ ఫండింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ విధానంలో రుణదాత పెట్టుబడిదారుడి తరఫున అవసరమైన నిధులను ASBA (Application Supported by Blocked Amount) ఖాతాలో బ్లాక్ చేస్తాడు. ఐపీఓ కేటాయింపు పూర్తయ్యే వరకు ఆ మొత్తం ఖాతాలోనే నిల్వ ఉంటుంది. షేర్లు కేటాయించిన తర్వాత అవసరమైన మొత్తం మాత్రమే డెబిట్ అవుతుంది. మిగిలిన మొత్తం తిరిగి అన్‌బ్లాక్ అవుతుంది. ఇది చాలా మందికి సులభమైన మార్గంలా కనిపించినా, ఇందులో దాగి ఉన్న ఖర్చులు చాలామంది గుర్తించరు.
ఎంత వరకు రుణం ఇస్తారు? Loan Limits and Terms
సాధారణంగా ఐపీఓ(Borrow to Invest in an IPO) ఫండింగ్‌లో రుణదాతలు మొత్తం దరఖాస్తు విలువలో 80 శాతం వరకు రుణం ఇస్తారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని పెట్టుబడిదారుడు మార్జిన్‌గా చెల్లించాలి. ఈ రుణాలపై వార్షిక వడ్డీ రేట్లు సుమారు 8.5 శాతం నుంచి 14 శాతం వరకు ఉంటాయి. రుణ కాలపరిమితి సాధారణంగా 7 నుంచి 45 రోజుల మధ్య ఉంటుంది. కాలపరిమితి తక్కువగానే ఉన్నప్పటికీ, వడ్డీ లెక్కలు మాత్రం పూర్తి మొత్తంపైనే వర్తిస్తాయి.
తాకట్టు పెట్టి కూడా రుణం.. Loans Against Investments
ఐపీఓ కోసం రుణం (Borrow to Invest in an IPO)తీసుకునే మరో మార్గం కూడా ఉంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. సాధారణంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై 50 నుంచి 55 శాతం, డెట్ ఫండ్లపై 60 నుంచి 80 శాతం వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేట్లు సాధారణంగా 9 నుంచి 10 శాతం మధ్య ఉంటాయి. అయితే రుణం పూర్తిగా తీర్చే వరకు తాకట్టు పెట్టిన పెట్టుబడులను విక్రయించే అవకాశం ఉండదు. మార్కెట్లో మంచి అవకాశాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోలేరు.
అసలు చిక్కు వడ్డీలోనే.. Interest Is the Real Catch
ఐపీఓ ఫండింగ్‌లో (Borrow to Invest in an IPO)చాలామంది విస్మరించే అంశం వడ్డీ లెక్కింపు. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు రూ.2 లక్షలు అప్పుగా తీసుకుని ఐపీఓకు దరఖాస్తు చేశాడనుకుందాం. కానీ అతనికి చివరకు రూ.14 వేల విలువైన షేర్లు మాత్రమే కేటాయించబడ్డాయి. చాలామంది ఇక్కడ వడ్డీ కూడా రూ.14 వేలపైనే ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తవానికి బ్లాక్ చేసిన మొత్తం రూ.2 లక్షలపైనే వడ్డీ చెల్లించాలి. షేర్లు తక్కువగా వచ్చినా, అసలు రాకపోయినా ఆ కాలానికి వడ్డీ మాత్రం తప్పదు. ఇదే అంశం చాలా మందికి నష్టాలను తెచ్చిపెడుతోంది.
షేర్లు రాకపోయినా వడ్డీ తప్పదు.. No Allotment, Yet Interest Payable
ఐపీఓలకు (Borrow to Invest in an IPO)భారీగా దరఖాస్తులు వచ్చినప్పుడు అందరికీ షేర్లు కేటాయించే అవకాశం ఉండదు. చాలామందికి అసలు అలాట్మెంట్ కూడా జరగదు. అయితే మీరు తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ మాత్రం పూర్తి స్థాయిలో చెల్లించాల్సిందే. అంటే షేర్లు రాకపోయినా ఖర్చు మాత్రం ఖాయం.
లిస్టింగ్ నష్టమైతే పరిస్థితి? What If Listing Disappoints?
ఐపీఓలో షేర్లు వచ్చిన (Borrow to Invest in an IPO)తర్వాత కూడా ప్రమాదం పూర్తిగా తొలగిపోదు. కొన్ని సందర్భాల్లో షేరు ఇష్యూ ధర కంటే తక్కువ ధరకు మార్కెట్లో నమోదవుతుంది. అప్పుడు పెట్టుబడిదారుడు మూలధనంలో నష్టపోవడమే కాకుండా, తీసుకున్న రుణానికి సంబంధించిన అసలు, వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. అంటే ఒకవైపు షేరు విలువ తగ్గుతుంది. మరోవైపు అప్పు మాత్రం అలాగే ఉంటుంది.
చిన్న వడ్డీ కూడా పెద్ద భారమే.. Small Interest, Big Impact
రూ.2 లక్షలను 12 శాతం వార్షిక వడ్డీతో కేవలం 7 రోజులపాటు తీసుకున్నా సుమారు రూ.460 వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీనికి అదనంగా(Borrow to Invest in an IPO) ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, తాకట్టు ఛార్జీలు కూడా ఉంటాయి. అంటే ఈ ఖర్చులను తిరిగి పొందాలంటే షేరు లిస్టింగ్ రోజున కనీసం 0.25 శాతం వరకు పెరగాలి. ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, మార్కెట్లో ప్రతి ఐపీఓకి అది సాధ్యం కాదు.
తాకట్టు రుణాల్లో మరో ప్రమాదం.. Risk of Margin Calls
షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టి (Borrow to Invest in an IPO)రుణం తీసుకున్నప్పుడు మార్కెట్ పడిపోతే సమస్య మరింత పెరుగుతుంది. మీ పెట్టుబడుల విలువ తగ్గిపోతే రుణదాత అదనపు హామీ (Margin Call) ఇవ్వాలని కోరవచ్చు. లేదా రుణంలో కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేయవచ్చు. అలాంటి సమయంలో డబ్బు సమకూర్చుకోలేకపోతే తాకట్టు పెట్టిన షేర్లను విక్రయించే అవకాశం కూడా ఉంటుంది.
ఎప్పుడు లాభం వస్తుంది? When Does It Actually Work?
ఐపీఓ ఫండింగ్ నిజంగా లాభదాయకం(Borrow to Invest in an IPO) కావాలంటే ఒకేసారి మూడు విషయాలు అనుకూలంగా జరగాలి. మొదటిగా దరఖాస్తుదారుడికి షేర్లు కేటాయించాలి. రెండవది, లిస్టింగ్ రోజున వచ్చే లాభం వడ్డీ, ఇతర ఖర్చులను మించాలి. మూడవది, షేరు ధర లిస్టింగ్ తర్వాత కూడా స్థిరంగా ఉండాలి. ఈ మూడు పరిస్థితుల్లో ఏ ఒక్కటి అనుకూలంగా లేకపోయినా ఆశించిన లాభం దక్కకపోవచ్చు.
మూలధనమే మొదటి రక్షణ.. Protect Capital First
స్టాక్ మార్కెట్లో ప్రతి ఐపీఓ (Borrow to Invest in an IPO)భారీ లాభాలు ఇస్తుందనే గ్యారంటీ లేదు. మంచి కంపెనీల షేర్లు కూడా కొన్ని సందర్భాల్లో నిరాశపరుస్తాయి. మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల స్పందన, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, కంపెనీ పనితీరు వంటి అనేక అంశాలు లిస్టింగ్‌ను ప్రభావితం చేస్తాయి. అందుకే అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ అధిక ప్రమాదంతో కూడుకున్న వ్యూహమే. పెట్టుబడులకు ఉపయోగించే డబ్బు మీ అదనపు నిధులు కావాలి తప్ప, రుణం కాకూడదు.
నిపుణుల సలహా ఇదే.. Expert Advice
ఐపీఓల ద్వారా(Borrow to Invest in an IPO) మంచి అవకాశాలు లభించవచ్చు. కానీ అవి ఖచ్చితమైన లాభాలకు హామీ ఇవ్వవు. అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ భారం, కేటాయింపు అనిశ్చితి, లిస్టింగ్ నష్టాలు, తాకట్టు ప్రమాదాలు వంటి అనేక రిస్కులు ఉంటాయి. ముఖ్యంగా అస్థిర మార్కెట్ పరిస్థితుల్లో లిస్టింగ్ లాభాల కోసం రుణాలు చేయడం కంటే, చేతిలో ఉన్న సొంత నిధులతోనే పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడుల్లో మొదటి నియమం అధిక లాభాలు సంపాదించడం కాదు.. ముందుగా మూలధనాన్ని కాపాడుకోవడమే అని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
