ఒకప్పుడు బ్యాంకు రుణం అంటే పెద్ద అవసరం వచ్చినప్పుడే తీసుకునే ఆర్థిక నిర్ణయం. ఇల్లు కొనాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, పిల్లల చదువుల కోసమైనా అప్పు తీసుకోవడం సహజం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని క్లిక్‌లతోనే వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు, బై నౌ పే లేటర్ (BNPL), వినియోగ రుణాలు నిమిషాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా భారతీయుల జీవనశైలిలో రుణాలు విడదీయలేని భాగంగా మారిపోయాయి. గత తొమ్మిదేళ్లలో భారతదేశ రుణ వ్యవస్థ (A Nation Running on Loans) ఎంత వేగంగా విస్తరించిందో ట్రాన్స్‌యూనియన్ సిబిల్ (TransUnion CIBIL) విడుదల చేసిన ‘Unlocking Access: Journey of Credit Expansion in India’ నివేదిక స్పష్టంగా చూపించింది. ఈ అధ్యయనం కేవలం రుణాల సంఖ్య పెరిగిందనే విషయాన్ని మాత్రమే కాదు… దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతోంది? యువత, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎలా అధికారిక రుణ వ్యవస్థలోకి వస్తున్నారు? రుణాల వినియోగం ఏ దిశగా సాగుతోంది? వంటి కీలక అంశాలనూ వెలుగులోకి తీసుకొచ్చింది.
రుణాల విప్లవం… తొమ్మిదేళ్లలో భారీ మార్పు.. A Decade of Credit Expansion
మార్చి 2017లో దేశంలో రుణాలు పొందే అర్హత ఉన్న జనాభా (A Nation Running on Loans) సుమారు 79 కోట్లు. తొమ్మిదేళ్ల తర్వాత అంటే మార్చి 2026 నాటికి ఈ సంఖ్య 89 కోట్లకు చేరింది. ఇది కేవలం జనాభా పెరుగుదల వల్ల వచ్చిన మార్పు మాత్రమే కాదు… అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరిగిందనడానికి కూడా నిదర్శనం. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే… కనీసం ఒకసారి అయినా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకున్న వారి వాటా 35 శాతం నుంచి 74 శాతానికి పెరిగింది. అంటే రుణ వ్యవస్థ ఇప్పుడు కొద్దిమందికే పరిమితం కాకుండా, సమాజంలోని పెద్ద వర్గానికి చేరువైందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
క్రెడిట్ యాక్టివ్ వినియోగదారులు పెరుగుతున్నారు.. More Indians Are Actively Using Credit
రుణం ఒకసారి తీసుకుని పూర్తిగా చెల్లించేసే పరిస్థితి (A Nation Running on Loans) క్రమంగా మారుతోంది. ఇప్పుడు చాలామంది నిరంతరం ఏదో ఒక రుణ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. నివేదిక ప్రకారం, క్రెడిట్ యాక్టివ్ వినియోగదారుల వాటా 11 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. అంటే రుణ వ్యవస్థలోకి వచ్చిన వారిలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు నిరంతరం రుణాలను వినియోగిస్తున్నారు. అయితే కొత్తగా మొదటిసారి రుణం తీసుకునే వారి వాటా 32 శాతం నుంచి 13 శాతానికి తగ్గింది. దీని అర్థం… ఇప్పటికే రుణ వ్యవస్థలో ఉన్నవారే మరిన్ని రుణ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారన్న మాట.
వ్యక్తిగత రుణాలకే అధిక డిమాండ్.. Personal Loans Dominate
ఇప్పటి వరకు గృహ రుణాలు, వాహన రుణాలే ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు (A Nation Running on Loans) వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, వినియోగ రుణాలే మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. మార్చి 2017లో వినియోగ రుణాలు తీసుకున్న వారి వాటా 34 శాతం ఉండగా, 2026 నాటికి అది 51 శాతానికి పెరిగింది. ఈ కాలంలో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు తీసుకున్న వారి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. రోజువారీ జీవనశైలి ఖర్చులు కూడా ఇప్పుడు రుణాలపై ఆధారపడుతున్నాయనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
వ్యాపార రుణాల్లోనూ వేగం.. Business Credit Gains Momentum
దేశంలో స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు (A Nation Running on Loans) పెరగడంతో వ్యాపార రుణాలకు కూడా డిమాండ్ పెరిగింది. వ్యాపార రుణాలు పొందిన వారి వాటా 3 శాతం నుంచి 9 శాతానికి చేరింది. అయితే వారి సంఖ్య మాత్రం పది రెట్లు పెరగడం విశేషం. చిన్న వ్యాపారాలు కూడా ఇప్పుడు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థను ఆశ్రయిస్తున్నాయనే సంకేతాలను ఇది ఇస్తోంది.
మహిళలు, యువత ముందంజ.. Women and Youth Drive Credit Growth
భారత రుణ వ్యవస్థలో (A Nation Running on Loans) గత తొమ్మిదేళ్లలో అత్యంత పెద్ద మార్పు మహిళల భాగస్వామ్యం. 2017లో మొత్తం రుణ గ్రహీతల్లో మహిళల వాటా 22 శాతం ఉండగా, 2026 నాటికి అది 30 శాతానికి చేరింది. అదే సమయంలో యువత భాగస్వామ్యం 33 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మహిళల రుణ వినియోగం మరింత వేగంగా పెరగడం ఆర్థిక సాధికారతకు మంచి సంకేతంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామీణ భారత్‌లో పెరుగుతున్న క్రెడిట్.. Rural India Joins the Credit Network
ఒకప్పుడు బ్యాంకు రుణాలు ప్రధానంగా పట్టణాలకే (A Nation Running on Loans) పరిమితం అయ్యేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ సంస్థలు, సూక్ష్మ రుణాల వల్ల పరిస్థితి పూర్తిగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల క్రెడిట్ వినియోగం 53 శాతం నుంచి 63 శాతానికి పెరిగింది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కూడా అధికారిక రుణాల ప్రాధాన్యం పెరుగుతోందని సూచిస్తోంది.
క్రెడిట్ స్కోర్‌పై అవగాహన పెరిగింది.. Credit Score Awareness Rises
కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా మందికి తమ సిబిల్ స్కోర్ (A Nation Running on Loans) అంటే ఏమిటో కూడా తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2018లో దాదాపు ఎవరూ తమ క్రెడిట్ స్కోర్‌ను పరిశీలించకపోగా, 2026 నాటికి 35 శాతం క్రెడిట్ యాక్టివ్ వినియోగదారులు తమ స్కోర్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారు. ఇది బాధ్యతాయుతమైన రుణ సంస్కృతి పెరుగుతోందనడానికి సంకేతం.
అధిక రుణభారం… ఆందోళన కలిగించే అంశం.. Rising Debt Burden
రుణాల విస్తరణతో (A Nation Running on Loans) పాటు మరో సమస్య కూడా కనిపిస్తోంది. అవసరానికి మించి రుణాలు తీసుకున్న వారి వాటా 2017లో 5 శాతం ఉండగా, 2024 నాటికి 18 శాతానికి చేరింది. తర్వాత బ్యాంకులు, నియంత్రణ సంస్థలు తీసుకున్న చర్యలతో 2026 నాటికి అది 15 శాతానికి తగ్గింది. అయితే ఇప్పటికీ అధిక రుణభారం కొందరిని ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోందని నివేదిక హెచ్చరిస్తోంది.
రాష్ట్రాల మధ్య మారుతున్న ధోరణి.. Changing Regional Credit Map
సాంప్రదాయంగా మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలే రుణ మార్కెట్లో (A Nation Running on Loans) ముందుండేవి. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు వేగంగా ఎదుగుతున్నాయి. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ వాటా 8 శాతం నుంచి 11 శాతానికి పెరగడం దేశ రుణ పటంలో కీలక మార్పుగా కనిపిస్తోంది.
వాణిజ్య రంగంలోనూ అవకాశాలే.. Business Lending Still Has Huge Potential
వ్యాపార రుణాలకు (A Nation Running on Loans) అర్హత ఉన్న సంస్థల సంఖ్య 6.3 కోట్ల నుంచి 8.7 కోట్లకు పెరిగింది. అయితే వాణిజ్య రుణాలు పొందిన సంస్థల వాటా మాత్రం 50 శాతం నుంచి 41 శాతానికి తగ్గింది. దీని అర్థం… ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (MSMEs) అధికారిక రుణ వ్యవస్థలోకి తీసుకురావడానికి ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని నివేదిక చెబుతోంది.
రుణం తీసుకోవడం తప్పు కాదు… నిర్వహణే ముఖ్యం.. Responsible Borrowing Matters
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం (A Nation Running on Loans) రుణం తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆదాయానికి మించి అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగించడం, వ్యక్తిగత రుణాలతో పాత రుణాలు తీర్చడం వంటి అలవాట్లు దీర్ఘకాలంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. రుణం తీసుకునే ముందు నెలవారీ ఆదాయం, ఈఎంఐలు, అత్యవసర నిధి, భవిష్యత్తు ఖర్చులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా భారతదేశంలో రుణ వ్యవస్థ గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేనంతగా విస్తరించింది. కోట్లాది మంది అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడం, మహిళలు, యువత, గ్రామీణ ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం పెరగడం ఆర్థికాభివృద్ధికి సానుకూల సంకేతాలే. అదే సమయంలో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరగడం, అధిక రుణభారం కూడా ఆందోళన కలిగించే అంశాలుగా మారుతున్నాయి. రుణం ఆర్థిక పురోగతికి సాధనమే కానీ, అది ఆదాయాన్ని మించి భారంగా మారితే సంపదను పెంచే మార్గం కాకుండా ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది. అందుకే అప్పు తీసుకోవడం కంటే, దాన్ని బాధ్యతగా నిర్వహించుకోవడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అని ఈ నివేదిక స్పష్టంగా చెబుతోంది.
