Scalping అంటే ఏమిటి What is Scalping
What is Scalping?
స్టాక్ మార్కెట్‌లో చాలా మంది ట్రేడింగ్ చేస్తుంటారు. ఈ ట్రేడర్స్ రకరకాల ట్రేడింగ్ విధానాలను ఎంచుకుంటుంటారు. ఇలా ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని స్ట్రాటజీలను ఫాలో అవుతారు. వీటిలో ఏది వర్కవుట్ అవుతుందో ప్రాక్టీస్ చేసి దానిమీద లాభాలను గడించడానికి ట్రై చేస్తారు. అయితే ఈ ట్రేడింగ్ స్టైల్ లో ఏది ఎవరికి సరిపోతుందో మనం పసిగట్టడం చాలా అవసరం. అయితే ఇంట్రాడే చేసే వారు చాలా మంది స్కాల్పింగ్ అనే విధానం ఎంచుకుంటారు. మరి ఈ స్కాల్పింగ్ అంటే ఏమిటో ఓ సారి చూద్దాం.
స్కాల్పింగ్ అనేది స్టాక్ ధరలో చిన్న ధర మార్పుల నుంచి లాభం పొందేందుకు ఉద్దేశించిన వ్యాపార వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలు చేసే ట్రేడర్స్ ఒకేరోజులో 10 నుంచి అనేకమైన ట్రేడ్లను ఎప్పుడైనా చేస్తారు. స్టాక్ ధరలో చిన్న చిన్న కదలికలు పెద్ద వాటి కంటే సులభంగా లాభాలను పట్టుకుంటాయనే నమ్మకంతో అమలు చేసే ఈ వ్యూహాన్ని స్కాల్పింగ్ అంటారు. ఈ విధానంలో ట్రేడింగ్ చేసే వారిని స్కాల్పర్స్ అంటారు.
ట్రేడింగ్స్ అన్నింటిలో కంటే రిస్క్ ఎక్కువ ఉన్న ప్రొఫైల్ Scalping. ఈ ట్రేడింగ్ ని ఎక్కువ ఇంట్రాడేలో నిర్వహిస్తారు. డే ట్రేడింగ్, స్కాల్పింగ్ ఈ రెండూ బిలాంగ్స్ టూ ఇంట్రాడే ట్రేడింగ్.
ఇంట్రాడే ట్రేడింగ్ అనేది స్పెక్యులర్ బిజినెస్. అంటే పూర్తి ఒక అంచనాతో, నమ్మకంతో చేసే టైమింగ్ చేసే ప్రక్రియ.
స్కాల్పింగ్ ఎందుకు చేస్తారు
Why is scalping done?
వీలైనంత ఎక్కువ లాభాలను త్వరగా పొందడానికి చాలా మంది స్కాల్పింగ్ను ఎంచుకుంటారు. అంతేకాకుండా ఇందులో బ్రోకర్స్ 5 సార్లు లివరేజ్ ఇస్తారు. అప్పుడు రూ.లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినవారు రూ.5 లక్షల వరకు స్టాక్స్ బై చేసుకోవచ్చు లేదా సెల్ చేసుకోవచ్చు. అలాంటి మైండ్ సెట్ తో ఈ ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతారు.
* ఇందులో ప్రధాన లక్ష్యం ఏమిటంటే బిడ్ వద్ద అనేక షేర్లను కొనడం లేదా అమ్మడం.. వాటిని త్వరగా లాభం కోసం కొన్ని సెంట్లు ఎక్కువ లేదా తక్కువకు విక్రయించడం.
*ఇక్కడ హోల్డింగ్ సమయం సెకన్ల నుంచి నిమిషాల వరకు మారవచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా గంటల వరకు కూడా ఉండవచ్చు. మొత్తం మార్కెట్ ట్రేడింగ్ సేషన్ ముగిసేలోపు స్థానం మూసివేయబడుతుంది.
* ఇందులో స్టాప్ లాస్, టార్గెట్ రెండూ కూడా ఉంటాయి. ఒక్కోసారి మన ప్లానింగ్ అంతా ఒక్క సెకన్ లో రివర్స్ అవ్వవచ్చు. ఎందుకంటే మార్కెట్లో వలాటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ రివర్స్ అయితే వెంటనే సరండర్ అవ్వాలి. హోప్స్ పెట్టుకుని ఉంచుకోవడం కుదరదు.
* ఇక్కడ కేవలం స్ట్రాటజీ లు మాత్రమే పని చేస్తాయి.
* ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్ రెండూ లూజర్ టెక్నిక్స్. దీంట్లో మనం ట్రేడింగ్ చెయ్యాలంటే మార్కెట్ కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్, టెక్నిక్స్ మీద అవగాహన ఉండాలి.
* స్కాల్పింగ్‌లో చాలా తక్కువ టైమ్ లో స్పందించగల నేర్పు ఉండాలి.
* సాధారణంగా ట్రేడింగ్ అంటే ఒకే టైపు ప్యాటర్న్స్, ఒకేటైపు ఎంట్రీస్ గుర్తించుకుంటూ వాటిలోనే పదేపదే నంబర్ ఆఫ్ గేమ్స్ ఆడినపుడు వచ్చే నమ్మకంతో మార్కెట్లోకి ఎంటర్ అవ్వవలిసి ఉంటుంది.
* మనం ట్రేడింగ్ కి వచ్చినపుడు మన పర్సనాలిటీ ఎటువైపో క్లారిటీ ఉండాలి. ఒక్కసారి క్లారిటీ వచ్చిన తర్వాత దాని సెటప్ రూల్స్ క్లెయిమ్ చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ ఒకే ప్రొడక్ట్ పట్టుకుని లేదా స్కానర్స్ వాడి మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తుంటారు.
* ఇక్కడ కాంపిటేషన్ అనేది ఆల్గారిధం సాఫ్ట్ వేర్ నుంచి వస్తుంది. ఏదైనా సరే ప్రాక్టీస్ లేకుండా, ఈ టెక్నిక్స్ మీద అవగాహన లేకుండా మీద కేవలం ఆసక్తితో మాత్రమే వస్తే వర్కౌట్ కాదు.
* ఇందులో మైండ్ సెట్ చాలా ముఖ్యం. డిసెప్లైన్ రూల్స్ ఉంటాయి. వాటిని పాటించాలి. అందులో ఇన్ టైమ్ ఎంట్రీ అవ్వాలి. అలాగే ఇన్ టైమ్ ఎగ్జిట్ అవ్వాలి.
* ఇక్కడ డెడికేటెడ్ ఇంటర్నేట్ కేబుల్స్ ఉండాలి. హై 10 హై7 ప్రోసెస్ ఉన్న సిస్టమ్స్ కావాలి. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి.
* ఈ ట్రేడింగ్ అందరికీ సెట్ కాదు. నాలెడ్జ్ బాగుండాలి. సైకాలజీ చాలా టఫ్ గా ఉండాలి. అంటే నష్టం వచ్చినా డిస్టర్బ్ అవ్వకూడదు.
* కొన్ని సెటప్ రూల్స్ ఫాలో అయ్యి అవన్నీ మనకి వస్తే అప్పుడు మనకి ఈ ట్రేడింగ్ వర్కౌట్ అవ్వవచ్చు.
* మనకు బాగా అలవాటైన, లాభాలను ఇచ్చిన కొన్ని స్ట్రాటజీలను ఫాలో అయితే స్కాల్పింగ్‌లో లాభాల శాతం పెరిగే అవకాశం ఉంది.
ఎలాంటి వారికి స్కాల్పింగ్ సూట్ అవుతుంది
Who Should Scalping Suit
మనం ఏ ట్రేడింగ్ చేసినా ఇంట్రాడే మార్కెట్, నిప్టీని, సెక్టార్ ని, మనం ట్రేడింగ్ చేసే స్టాక్స్ ని కంపేర్ చేసుకున్నప్పుడు కొంత క్లారిటీ వస్తుంది.
* మనకి మార్కెట్ స్ట్రక్చర్స్ మీద బాగా గ్రిప్ ఉంటేనే ఇక్కడ ప్రోఫిటబిలిటీ పెరుగుతుంది.
* ఈ విధానం అనేది చాలా ఏగ్రసివ్ గా ఉంటేనే సూట్ అవుతుంది.
* ఒకవేళ మనకి ఈ ట్రేడింగ్ పై ఆసక్తి ఉంటే ముందు డమ్మీ ట్రేడింగ్ చేసిన తర్వాత అందులో విన్నింగ్ పర్సంటేజ్ పెరిగితే అప్పుడు రియల్ మార్కెట్లోకి రావచ్చు.
* ఇందులో ఒక్క నిమిషం లేటయినా వచ్చిన ప్రాఫిట్స్ నష్టాల్లోకి పోతుంది.
* ఇది ఈటీఎఫ్ ట్రేడింగ్ కి పూర్తి వ్యతిరేకం. అందువల్ల ఇక్కడ ఫైనాన్షియల్ గోల్స్ ముఖ్యం. టార్గెట్ ఉండాల్సిందే.
* ఇక్కడ నాలెడ్జ్, అనుభవం చాలా ముఖ్యం.
* స్కాల్పింగ్‌లో మనం చేసే ట్రేడ్ క్వాన్టిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం ప్రాఫిట్ తీసుకోగలుగుతాం.
* ఇక్కడ రిస్క్ అండ్ రివార్ఢ అనేది చాలా ఎక్కువ. లాభాలు భారీగా వస్తాయి, నష్టాలు కూడా అదే స్థాయిలో వస్తాయి.
* స్కాల్పింగ్ అనేది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆడే ఆట. వారు భారీ మొత్తంతో వచ్చి స్కాల్పింగ్ చేస్తుంటారు. నష్టాలను కూడా భరించగలిగే శక్తి వారికుంటుంది. మనలాంటి రిటైలర్స్ ఇందులోకి రావాలంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
* ఇందులో ఇన్ కమ్ ట్యాక్స్ , చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి.
స్కాల్పింగ్ కు చార్జీలు ఎంత ఉంటాయి
What are the charges for scalping?
నంబర్ ఆఫ్ ట్రేడ్స్, వాల్యూషన్ ఎక్కువ చేస్తారు కాబట్టి బ్రోకరేజీ ఫీజు కూడా ఎక్కువ పే చెయ్యవలిసి ఉంటుంది. అందుకే ఈ ట్రేడింగ్ వాళ్ళు బల్క్ లో ఎక్కువ కొంటుంటారు. 0.3 శాతం ప్రాఫిట్ రాగానే బల్క్ లో అమ్మేస్తారు. ఇక్కడ ప్రతి ట్రాన్జాక్షన్ లో కూడా సెబీకి ఫీజు పే చెయ్యాలి. ఎక్స్ఛేంజీకి పే చెయ్యాలి. జీఎస్టీ చెల్లించాలి. స్టేట్ గవర్నమెంట్ కి పే చెయ్యాలి. బ్రోకర్ కి పే చెయ్యాలి. ఇలా ప్రతి ట్రేడ్ ఎంట్రీకి, ఎగ్జిట్ కి కూడా చార్జీలను చెల్లిస్తూ పోవాలి. అందువల్ల ట్రాన్జాక్షన్ చార్జి ఎక్కువ గా భరించాల్సి ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ మొత్తంలో పడుతుంది.
మనకు వచ్చే రిటర్న్, చార్జీలను బేరీజు వేసుకోవాలి. అప్పుడే ఒక అంచనాకు రాగలుగుతాం.
Leave a Reply