
జూన్ 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది జూన్ 1 నుంచి అనేక ఫైనాన్సియల్ విషయాలకు సంబంధించి నిబంధనల్లో ప్రభుత్వం పలుమార్పులు తీసుకువచ్చింది. ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవే. ముఖ్యంగా Credit Card, Aadhar Card, LPG Gas, Driving License వినియోగానికి సంబంధించిన పలు మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
New Driving Licence Rules
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ డ్రై వింగ్ లైసెన్స్ రూల్స్‌లో జూన్ 1 నుంచి కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం, జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలకు హాజరై, వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో లైసెన్స్ పొందవచ్చు.
లైట్ మోటార్ వెహికల్ ట్రైనింగ్ నాలుగు వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలి. ఈ శిక్షణ థియరీ, ప్రాక్టికల్ విధానాల్లో ఉండాలి. థియరీ కోసం కనీసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం కనీసం 21 గంటలు కేటాయించాలి. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 6 వారాలు లేదా కనీసం 38 గంటలపాటు శిక్షణ ఉండాలి. థియరీ ఎడ్యుకేషన్ 8 గంటలు, ప్రాక్టికల్స్ 31 గంటలు ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు.. Driving license fees
లెర్నర్ లైసెన్స్ – రూ.200
లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ – రూ.200
ఇంటర్నేషనల్ లైసెన్స్ – రూ.1000
పర్మినెంట్ లైసెన్స్ – రూ.200
పర్మినెంట్ లైసెన్స్ రెన్యూవల్ – రూ.200
డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యువల్ – రూ.10,000
డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ – రూ.5000
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయండిలా!
Apply for driving license
ముందుగా మీరు https://parivahan.gov.in. వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలోని “డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
వెంటనే అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అవసరమైతే దాని ప్రింట్అవుట్ తీసుకోవాలి.
దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన వివరాలు అన్నీ నమోదు చేయాలి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
అక్కడున్న సూచనల ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాలి.
మీ ప్రాధాన్యతను బట్టి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అవసరమైన పత్రాలతో ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాలి.
మీ డ్రైవింగ్ నైపుణ్యాన్ని రుజువు చేసే ఆధారాలను ఆర్టీఓకు చూపించాలి.
మీ డ్రైవింగ్ స్కిల్స్ పెర్ఫెక్ట్గా ఉన్నట్లయితే, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.
భారీ జరిమానాలు.. Heavy fines
వాహనాలు నడిపేవాళ్లు ఓవర్ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తే రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్ విధిస్తారు. ఒకవేళ ఎవరైనా మైనర్ వాహనాన్ని నడిపితే రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు ఆ వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డును కూడా క్యాన్సిల్ చేస్తారు. సదరు మైనర్‌కు 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరు.
ఆధార్ కార్డ్ అప్డేట్
Aadhaar Card Update Last Date
చాలా కాలం నుంచి ఆధార్ కార్డ్ అప్డేట్ చేయనివారు UIDAI వెబ్ సైట్ ఓపెన్ చేసి జూన్ 14లోపు ఆ పని చేయాలి. మీరు సింపుల్‌గా ఆన్లైన్లోనే ఆధార్ వివరాలను అప్డేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్‌లైన్‌లో ఆధార్ అప్డేట్ చేయాలంటే, ప్రతి అప్డేట్కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్
LPG Gas Cylinder Prices
చమురు సంస్థలు ప్రతి నెలా మొదటి రోజున ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇవి మే నెలలో వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించాయి. జూన్ నుంచి కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. ఇన్నిరోజులు ప్రభుత్వం నచ్చినపుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేది అలాగే తగ్గించేది. కాని ఇప్పటినుండి ఎప్పటికప్పుడు పెంచడానికి, తగ్గించడానికి లేదు. పెంచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా ప్రతినెలా 1 తేదీనా చెప్పాలి. గ్యాస్ ధరలు ప్రతినెలా 1తేదీనా అప్ డేట్ అవుతాయి.
Credit Card.. క్రెడిట్ కార్డు
క్రెడిట్ కార్డు నిబంధనలను కూడా బ్యాంకులు మార్చాయి. రివార్డ్ ప్రోగ్రామ్, ఫీ విధానంలో మార్పులు చేశాయి. ఈ మార్పులు వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ కార్డు నిబంధనలు మార్చిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. మరి ఏ బ్యాంకు ఎలాంటి నిబంధనలు తీసుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ కార్డు.. SBI Credit card
జూన్ నుంచి ఎస్బీఐ కార్డు కీలక మార్పులు చేసింది. ఇకపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు చేసినట్లయితే రివార్డు పాయింట్లు ఇవ్వదు. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. గవర్నమెంట్ ట్రాన్జక్షన్స్ అంటే ట్రాఫిక్ చలానా, కోర్ట్ ఫైన్స్, పాస్ పోర్ట్, డిఎల్ అప్లికేషన్ ఫీజు, ట్యాక్స్ ఇవన్నీ మనం SBI Credit cardతో కడితే ఒక్క రివార్డ్ కూడా రాదు. ఈ జాబితాలో ఆరమ్, ఎస్బీఐ కార్డు ఎలైట్, ఎస్బీఐ కార్డు ఎలైట్ అడ్వాంటేజ్ వంటివి ఉన్నాయి.
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు: Amazon pay ICICI Credit Card
Amazon pay ICICI Credit Card ద్వారా రెంట్ పేమెంట్లు చేస్తే ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. అయితే, ఫ్యూయల్ సర్‌ఛార్జీ పేమెంట్లపై 1 శాతం డిస్కౌంట్ అనేది కొనసాగనుంది. బంగారం కొనుగోళ్లు, ఈఎంఐలపై ఎలాంటి రివార్డు పాయింట్లు రావు.
స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు.. HDFC Credit Card
మనం ఇన్నిరోజులు HDFC Credit Card ను Swiggy యాప్ లో ఉపయోగిస్తున్నట్లయితే మనకి క్యాష్ బ్యాక్ అనేది డైరక్ట్ గా యాప్ లో ఉన్న వాలెట్ లో పడేది. అప్పుడు తర్వాత మనకి ఉపయోగపడేది. అయితే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్ విధానంలో మార్పులు చేసింది. క్యాష్ బ్యాక్ అనేది ఇకపై స్విగ్గీ మనీ రూపంలో స్విగ్గీ యాప్‌లో కనిపించడానికి బదులుగా కార్డు స్టేట్మెంట్ బ్యాలెన్స్‌లో కనిపిస్తుంది. ఈ మార్పులతో రిడంప్షన్ ప్రాసెస్ సులభమవుతుంది. కార్డు హోల్డర్లకు తదుపరి నెల బిల్లు తగ్గుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు
Bank of Baroda One Co Branded Credit Card
బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వన్ కో బ్రాండెట్ క్రెడిట్ కార్డుపై కొత్త ఛార్జీలు విధించింది. బకాయిలపై వడ్డీ రేట్లు, ఓవర్ లిమిట్ ఫీస్, లేట్ పేమెంట్స్ ఛార్జీల వంటి వాటిలో మార్పులు చేసింది.