
HOW TO EARN 1 CRORE WITH 1 LAKH
మన దగ్గర ఉన్న లక్ష రూపాయలను 1 కోటి రూపాయలుగా చేయడం ఎలా
పేదరికంలో పుట్టడం తప్పు కాదు.. కానీ పేదరికంలో బతకడం నిజంగా తప్పే. ఈ నానుడి మనం చిన్న ప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. ఇది అందరూ గుర్తించవలసిన నిజం కూడా. మనం చేసే చిన్న ఉద్యోగాన్ని, మన ఆర్థిక పరిస్థితిని, మన పేదరికాన్ని చూసి భయపడుతూ, నిరంతరం బాధపడుతూ బతికేకన్నాకొంచెం క్రమ శిక్షణతో, పద్ధతిగా డబ్బులను ఆదా చేసుకోగలిగితే ధనవంతులమే కాదు, కోటీశ్వరులం కూడా కావడం అసాధ్యమేమీ కాదు.
దీనికి మనం ఇక్కడ చేయాల్సిందేంటంటే మనం సంపాధించిన చిన్న చిన్న మొత్తాల డబ్బే మళ్ళీ తిరిగి డబ్బుని సృష్టించేలా చేయడం. ఇలా పెరగాలంటే మనకి రకారకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొద్దిగా ఎక్కువ కాలం పట్టినా, మన జీవితం లోని రెండో సగానికి చేరుకునేసరికి మన వారసులకైనా అధిక మొత్తంలో సొమ్మును పోగు చేయగలిగితే ధనవంతులుగా మారి మన వారసులతో కలిపి కోటీశ్వరులుగా బతకవచ్చు. అయితే దీనికి మనం చేయాల్సిందేంటో ఓ సారి చూద్దాం.
మనకి రకారకాల సేవింగ్ schemes ఉంటాయి. ఫిక్సిడ్ డిపాజిట్, పీఎఫ్, పోస్టల్ స్కీమ్స్, బాండ్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా రకారకాల సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ విధానాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎన్ని సంవత్సరాల్లో లక్ష రూపాయలని కోటి రూపాయలుగా మార్చగలమో తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మన డబ్బులు ఎంత గ్రో అవుతాయో అవగాహన కలిగి ఉంటే సరైన ఎంపిక చేసుకోగలుగుతాం. లక్ష రూపాయలు కోటి రూపాయలు అయ్యే ప్రోసెస్ ను తెలుసుకుందాం..
ఎప్పుడైతే లక్ష రూపాయలను కోటి రూపాయిల కింద కన్వెర్ట్ చెయ్యాలనుకుంటున్నామో అప్పుడు మనం అధిక లాభం అందించే పథకాలను ఎంచుకుంటేనే సాధ్యం అవుతుంది. అంటే రిస్క్ కూడా ఎక్కువ తీసుకోగలగాలి. రిస్క్ ఎక్కువ తీసుకుంటేనే రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది.
లక్షరూపాయలు కోటిరూపాయలు అవ్వాలంటే 100 రెట్లు పెరగాలి. లేదా రూ.10,000 అనేది 10 లక్షలు అవ్వాలన్నా 100 రెట్లు పెరగాల్సిన అవసరం ఉంది.
మనం ఏ స్కీమ్ లోనైనా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి కోటి అవ్వాలంటే 60 సంవత్సరాలు ఆగితే గానీ సాధ్యం కాదు. కొంతమంది స్టాక్ మార్కెట్లోకి రాగానే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అయితే సరిపోతుంది అనుకుంటారు. మార్కెట్లో టాప్ 10 ఇన్వెస్టర్స్ అందరి పోర్ట్ ఫోలియోలు కూడా మనకి బయట ఈజీగా దొరుకుతాయి. ఆ టాప్ 10 ఇన్వెస్టర్ల రిటర్న్స్ CAGR చూసుకుంటే 15 నుంచి 25 శాతం మాత్రమే ఉంటుంది. మనకి 20 సంవత్సరాల్లో మన డబ్బు 100 రెట్లు పెరగాలంటే 25 శాతం CAGR ప్రతి సంవత్సరానికి వస్తే తప్ప మనకి 100 రెట్లు పెరగడం అనేది సాధ్యం కాదు. మార్కెట్ ఎప్పుడూ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అలాంటి టైమ్ లో 25 శాతం రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఉండవా అంటే కనీసం 20 లేదా 30 స్టాక్స్ ఉంటాయి. కానీ ఏ స్టాక్స్ ఖచ్చితంగా 25 శాతం రిటర్న్స్ ఇస్తుంది అంటే మనం చెప్పలేం.
మరి లక్ష రూపాయలను కోటిగా ఎలా చేయగలగాలంటే దాని కోసం మనం మంచి బిజినెస్ మాదిరి ఆలోచించాలి. మనం ఏ కంపెనీని తీసుకున్నా ప్రతి కంపెనీకి VISION, MISSION ఉంటుంది.
మనం 1లక్షతో మొదలుపెట్టి కోటి సంపాదించాలనుకుంటున్నాం. ఇక్కడ ఇది మన విజన్ అనుకుంటే మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే లక్ష రూపాయలు నుంచి కోటి రూపాయలకు వెళ్తామో దానిని మిషన్ అంటాం.
WHAT IS THE RULE OF 72
72/
RATE OF RETURN = TIME FOR INVESTMENT TO DOUBLE
అంటే 72 ని వడ్డీ రేటుతో భాగిస్తే మన డబ్బులు రెట్టింపయ్యే కాలం వస్తుంది. దీని ఆధారంగా మనం ఫైనాన్షియల్ గోల్స్‌ని అంచనా వేసుకోవచ్చు.
ఈ లెక్కన చూసుకుంటే తక్కువ కాలంలో డబ్బులు డబుల్ అయ్యే ఉత్తమ మార్గం స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఇక్కడ మనం పొందే ప్రాఫిట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఫాలో కావాలి.
* స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినపుడు మనం ఎక్కువ అత్యాశ పడకూడదు. మనం కాలిక్యులేటడ్ గా ఉండాలి. ఎమోషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు.
* స్టాక్ మార్కెట్లో రిస్క్ రివార్డ్ చూసుకుంటూ వెళ్లాలి. మన ఆలోచన విధానం స్టాక్ మార్కెట్లో ఎలా ఉండాలంటే.. మనం ఒక స్టాక్ లో ట్రేడ్ చేస్తే 2 శాతం ప్రాఫిట్ వచ్చిందనుకుంటే అప్పుడు మనం ద రూల్ ఆఫ్ 72 ని గుర్తించుకుని మన లక్ష్యాలను అంచనా వేసుకోగలగాలి.
మనం మన విజన్ ని మిషన్ కింద మార్చుకుంటూ చిన్నచిన్న గోల్స్ పెట్టుకుంటే అలాంటపుడు మన ప్రాఫిబులిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వీటన్నింటికీ సింపుల్ మంత్రం ఏంటంటే.. POWER OF COMPOUNDING. ఈ కాంపౌండింగ్ అనేది స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్‌లో అధికంగా ఉంటుంది.
మనకి నిఫ్టీ ఫిప్టీలో టాప్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఉంటాయి. ఈ కంపెనీల బిజినెస్ లలో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ రిస్క్ లు లేని స్టాక్‌లలో మనం జనరల్ గా ట్రేడ్ చేస్తున్నపుడు ఈజీగా ఫ్రాఫిట్ సంపాదించవచ్చు.
* ఎప్పుడైతే ఈ ఫిఫ్టీ కంపెనీలోని స్టాక్స్‌లో షార్ప్ ఫాల్ వస్తుందో అప్పుడు షార్ప్ రివర్సల్స్ కూడా వస్తుంది. ఆ షార్ప్ రివర్సల్స్ ని మనం ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షేర్స్ ని మనం నోట్ చేసుకుని సింపుల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు.
* ఈషేర్స్ ని ఎలా ట్రేడ్ చెయ్యాలో తెలుసుకోవడం కోసం బేసిక్ గా చిన్నచిన్న టెక్నికల్ ఎనాలసిస్ చేస్తే సరిపోతుంది.
* మనం ఒక ట్రేడ్ కి 3.5 శాతం ప్రాఫిట్ రావాలంటే స్టాక్ మార్కెట్లో ఈజీగా వస్తుంది. ఇంత తక్కువ రిటర్న్స్ మనం టార్గెట్ గా తీసుకుంటే ఇందులో పాయింట్ 5 శాతం బ్రోకరేజ్ కింద పోతుంది.
* మనం 3.5 శాతం ప్రాఫిట్‌తో ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే 20 ట్రేడ్స్ చేసే సరికి మన డబ్బులు డబుల్ అయిపోతాయి. కానీ వీటిని ట్రేడ్ చెయ్యడానికి కూడా కొంచెం ఓపిక, నాలెడ్జ్ ఉండాలి.
* మనం లక్ష రూపాయలని కోటి రూపాయలు చెయ్యాలంటే మనం 7 మెట్లు ఎక్కాలి. ఒక్కో మెట్టుకి మనం డబ్బులు డబుల్ చెయ్యాలి.
20 వేల జీతంతో రిచ్ అవ్వవచ్చా
Can you become rich with a salary of 20 thousand
మనలో చాలా మంది మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారే ఉంటారు. ధనవంతుడిలా దర్జాగా బతకలేక, పేదవాడిలా మరీ తగ్గి బతకలేక సతమతమవుతుంటారు. ఈ వర్గంలో ఉండే వారికి ఆదాయం సుమారు 20వేలు ఉంటుంది. ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ధనవంతులవడం కోసం కలలు కంటుంటారు. మరి ఈవర్గం ప్రజలు ఎలా ఈ కలను నిజం చేసుకోగలరో చూద్దాం..
నెలకి రూ.20,000 జీతం వచ్చే ఉద్యోగి వెల్త్ ను క్రియేట్ చేయడానికి సాధ్యమవుతుందా ?లేదా అంటే చాలా వరకు కుదరదు అనే సమాధానం వస్తుంది. మనం నిజంగా ఒక దానిని ఇష్టపడితే ప్రకృతి వాటిని మనకి సొంతం చేస్తుంది. నిజంగా శాలరీ ఎంప్లాయిస్ రిచ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇంటి అద్దె కట్టడం, వాటర్ బిల్, నెట్ బిల్లు, పిల్లలు స్కూల్ ఫీజులు.. ఇవన్నీ పే చేస్తే మనకి వచ్చే శాలరీ మిగలదు. ఇక సేవింగ్స్ ఊసే రాదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ముందు ఖర్చులు అన్నీ తీసేయగా మిగిలితే ఇన్వెస్ట్ చేస్తామంటే మనం ఎప్పటికీ సంపాదించలేం. 1930 లో జొర్డెన్ అనే ఇన్వెస్టర్ The Richest Man in Babylon అను పుస్తకం రాసారు. ఈ పుస్తకంలో రిచ్ అవ్వాలంటే ఏమి చెయ్యాలో క్లియర్ గా చెప్పారు. ఆ బుక్ ప్రకారం ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అని సూచించారు.
Pay Yourself First…
* మనం ఖచ్చితంగా రిచ్ అవ్వాలనుకుంటే మనకి వచ్చిన జీతంలో మొదటి కొంత అమౌంట్ ని తీసి సేవ్ చెయ్యాలి.
* మనం ఎప్పటికి రిచ్ కావాలి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అసెట్స్ పై మనకి నాలెడ్జ్ ఉందో అన్న దాని బట్టి ఎంతో కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయాలి. మన నాలెడ్జ్ ను బట్టి మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీ లేదా మనకి ఏది సాధ్యమనిపిస్తే దానిని ఎంచుకోవాలి.
* మంచి రాబడి పొందేందుకు సంవత్సరానికి 15 – 20 శాతం రిటర్న్స్ వచ్చే పథకాలు ఉపయోగపడతాయి.
* ఏ మ్యూచువల్ ఫండ్స్ లో సంవత్సరానికి 15- 20 శాతం రిటర్న్స్ వస్తాయో దానిలో మొదట మన జీతం రాగానే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చెయ్యాలి. మిగిలిన డబ్బులతో లైఫ్ ని బ్యాలన్స్ చేసుకోవాలి.
* ఇంట్లో ఇద్దరూ జాబ్స్ చెయ్యండి. ఒకరికి వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తే వేరేవారికి వచ్చిన డబ్బులతో ఇంటిని నడిపించవచ్చు.
* మనం మొదట ప్యూచర్ కోసం డబ్బులు దాచాలి. మిగతా డబ్బులు ఖర్చు చేయాలి.
* క్రమంగా ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనల్ని, మన పిల్లలను కూడా కోటీశ్వరులను చేస్తాయి. ఈ పద్ధతిని అనుసరిస్తే ఖచ్చితంగా రిచ్ అవుతాం.
* మనకి ఎంత జీతం వచ్చినా జీతానికి తగ్గట్టుగా ఖర్చులు వస్తునే ఉంటాయి. అందువల్ల జీతం రాగానే ముందు కొంత అమౌంట్ తీసి మంచి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. లాంగ్ టైమ్ లో ఈ మనీ కాంపౌండ్ అవుతూ ఉంటుంది.
For example..
ఉదాహరణకు.. రిలయన్స్ గ్రోత్ ఫండ్స్ చూస్తే 1995లో రూ.10 ఉన్న ఎన్ఏవీ 2017 సంవత్సరంలో రూ.1000 కి వెళ్ళింది. ఇప్పడు సుమారు రెండువేల రూపాయలకు పైగా ఎన్ ఏవీ కలిగి ఉంది. అంటే ఆ ఫండ్ లో మొదటిగా లక్ష రూపాయిలు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఇప్పడు సుమారు రెండు కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇంకా ఇలాంటి చాలా ఫండ్స్ ఉన్నాయి.