జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్-NPS)లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వేతర చందాదారులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కీలక సడలింపులు ప్రకటించింది. ఎన్‌పీఎస్ (NPS) నుంచి బయటకు వచ్చే సమయంలో (ఎగ్జిట్) ఖాతాలో జమ అయిన మొత్తం నిధుల్లో 80 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. ఇంతకు ముందు (Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds) ఈ పరిమితి 60 శాతంగా ఉండేది. తాజా మార్పులతో చందాదారులకు నగదు లభ్యత మరింత పెరగనుంది. ఎగ్జిట్ సమయంలో మిగిలిన 20 శాతం నిధులను యాన్యుటీలు కొనుగోలు చేయడానికి వినియోగించాలి. వీటి ద్వారా నెలవారీగా లేదా కాలానుగుణంగా పింఛన్ పొందే సదుపాయం కొనసాగుతుంది. ఎన్‌పీఎస్ (NPS) ఖాతాలోని మొత్తం పెన్షన్ కార్పస్ రూ.8 లక్షలలోపు ఉంటే, చందాదారు మొత్తం నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించింది. అవసరమైతే దశలవారీగా ఉపసంహరణ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎన్‌పీఎస్‌లో పాక్షిక ఉపసంహరణల సంఖ్యను మూడు నుంచి నాలుగుకు పెంచింది. అదేవిధంగా 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా మూడేళ్ల వ్యవధిలో మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలు చేసుకునే వీలు కల్పించారు. ప్రభుత్వేతర ఎన్‌పీఎస్ (NPS) చందాదారులకు ఎగ్జిట్ గరిష్ట వయస్సును 70 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు పెంచారు. మొత్తంగా చూస్తే, ఎన్‌పీఎస్ (NPS)నిబంధనల్లో చేసిన ఈ మార్పులు ప్రభుత్వేతర చందాదారులకు గణనీయమైన లాభాన్ని అందించనున్నాయి.
ఎన్‌పీఎస్ (NPS)పై రుణ సౌకర్యం.. Loan Facility on NPS (National Pension System)
– ఎన్‌పీఎస్ (NPS)ఖాతాలపై రుణాలు తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్దేశించిన పరిమితుల మేరకు నియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. పీఎఫ్‌ఆర్‌డీఏ (ఎగ్జిట్స్ అండ్ విత్‌డ్రాయల్స్ అండర్ ది నేషనల్ పెన్షన్ సిస్టమ్) (అమెండ్‌మెంట్) రెగ్యులేషన్స్–2025 ప్రకారం ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్దేశించిన పరిమితుల మేరకు మాత్రమే ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. దీంతో అత్యవసర అవసరాల సమయంలో ఎన్‌పీఎస్ నిధులను పూర్తిగా ఉపసంహరించుకోకుండా, రుణ రూపంలో వినియోగించుకునే అవకాశం చందాదారులకు లభించనుంది.
– ఎన్‌పీఎస్ ఖాతాను కనీసం పది సంవత్సరాలు పూర్తి చేసిన సభ్యులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ నిర్మాణం, వైద్య అవసరాలు వంటి కారణాల కోసం ఈ నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో పనిచేసే ఎన్‌పీఎస్ చందాదారులకూ ఈ సడలింపులు వర్తిస్తాయి. ముఖ్యంగా యువ ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. పూర్తిగా నిధులు వెనక్కి తీసుకునే ముందు, భవిష్యత్‌లో వచ్చే (Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds) పెన్షన్‌పై ప్రభావాన్ని గమనించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవసరానికి తగినంత మాత్రమే ఉపసంహరించుకోవడం మేలని చెబుతున్నారు.
పదవీ విరమణ సమయంలో ఉపసంహరణ..Withdrawal at the Time of Retirement
ప్రభుత్వ ఎన్‌పీఎస్ (NPS) చందాదారులు పదవీ విరమణ సమయంలో తమ ఎన్‌పీఎస్ ఖాతాలో జమ అయిన మొత్తం నిధుల్లో 60 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని యాన్యుటీలు కొనుగోలు చేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. వీటి ద్వారా నెలవారీగా లేదా నిర్దిష్ట వ్యవధిలో పింఛన్ అందుకునే సదుపాయం ఉంటుంది. 60 శాతం ఉపసంహరణ మొత్తాన్ని ఒక్కసారిగా లేదా క్రమానుగత ఉపసంహరణ విధానంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఒకవేళ ఉపసంహరణకు అర్హమైన మొత్తం రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, ఎగ్జిట్ సమయంలోనే మొత్తం నిధులను ఏక మొత్తంలో వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.
జాగ్రత్తలే భవిష్యత్తుకు భరోసా…Precautions Are the Key to a Secure Future
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్- NPS)లో పెట్టుబడులు పెట్టడం భవిష్యత్‌కు భద్రతనిచ్చే నిర్ణయం. అయితే ఇటీవల ఎన్‌పీఎస్ నిబంధనల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ప్రభుత్వేతర చందాదారులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
1. అవసరానికి మించి ఉపసంహరణ వద్దు (Avoid Excess Withdrawals Beyond Your Actual Needs): (NPS)ఎగ్జిట్ సమయంలో 80 శాతం వరకు నిధులు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నా, మొత్తాన్ని తీసుకోవడం వల్ల భవిష్యత్ పెన్షన్ తగ్గే ప్రమాదం ఉంది. నిజంగా అవసరమైనంత మాత్రమే ఉపసంహరించుకోవడం మేలు.
2. యాన్యుటీ ఎంపికలో అప్రమత్తత (Be Cautious While Choosing Annuity Options): (NPS)మిగిలిన నిధులతో కొనుగోలు చేసే యాన్యుటీ స్కీమ్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. నెలవారీ పెన్షన్, వడ్డీ రేట్లు, జీవిత భాగస్వామికి లాభం వంటి అంశాలను ముందే పరిశీలించాలి.
3. పాక్షిక ఉపసంహరణలను పరిమితంగా వినియోగించాలి(Use Partial Withdrawals Sparingly): (NPS)పాక్షిక ఉపసంహరణల సంఖ్య పెరిగినప్పటికీ, తరచూ నిధులు తీసుకోవడం కార్పస్‌ను తగ్గిస్తుంది. దీర్ఘకాల లాభాల కోసం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించాలి.
4. పెట్టుబడి ఎంపికలో సమతుల్యత అవసరం(Maintain Balance While Choosing Investment Options): (NPS)ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల మధ్య సరైన నిష్పత్తి ఉండేలా పెట్టుబడులు కేటాయించాలి. వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ తగ్గించే విధంగా పోర్ట్‌ఫోలియో మార్చుకోవాలి.
5. ఎగ్జిట్ వయస్సు నిర్ణయంలో ముందస్తు ప్రణాళిక(Plan the Exit Age in Advance): (NPS)ఎగ్జిట్ వయస్సును 85 ఏళ్ల వరకు పెంచిన నేపథ్యంలో, ఎప్పుడు బయటకు రావాలన్నదానిపై ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆదాయం వచ్చే వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి.
6. రుణాలు చివరి మార్గంగా మాత్రమే (Use Loans Only as a Last Resort): ఎన్‌పీఎస్ (NPS) ఖాతాలపై రుణ సౌకర్యం ఉన్నా, దాన్ని తరచుగా వినియోగించడం మంచిది కాదు. రుణం తీసుకుంటే రిటైర్మెంట్ నిధులపై ప్రభావం పడుతుందని గుర్తుంచుకోవాలి.
ఇవీ లాభనష్టాలు.. These Are the Pros and Cons
ఎన్‌పీఎస్(NPS)లో నిధుల ఉపసంహరణ వల్ల చందాదారులు తక్షణ నగదు అవసరాలు తీర్చుకోవచ్చు. వైద్య ఖర్చులు, పిల్లల చదువు, గృహ నిర్మాణం మొదలైన వాటికి ఆ నిధులను తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో నిధులు అందుబాటులో ఉంటాయి. పెన్షన్ భద్రతతో పాటు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మిగిలిన నిధులు యాన్యుటీల ద్వారా భవిష్యత్ పెన్షన్ అందించగలవు. అయితే ఎక్కువగా ఎన్‌పీఎస్ (Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds) నుంచి నిధులు తీసుకుంటే, ఆ తరువాత వచ్చే నెలవారీ పెన్షన్ తగ్గిపోతుంది. తరచుగా తీసుకుంటే ఖాతా పరిమాణం తగ్గుతుంది. రిటైర్మెంట్ సమయంలో నిధులు తక్కువగా అందుతాయి.








Leave a Reply